వేసవికి మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుటకు అనువైన హోం మేడ్ స్క్రబ్స్ ఇవే

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

వేసవికాలంలో మీ చర్మసౌందర్యాన్ని కాపాడుటకు అద్బుతమైన హోం మేడ్ స్క్రబ్స్ ఇవే.

వేసవికాలంలో అడుగుపెడుతున్న ఈ సమయంలోనే చర్మాన్ని కాపాడుకొనుటకు తగుచర్యలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎన్ని రకాల సౌందర్యసాధనాలు వినియోగిస్తున్నప్పటికీ వేసవికాలంలోని పెరుగుతున్న ఎండ తీవ్రత మీ చర్మ సౌందర్యంపై తీవ్రమైన ప్రభావమే చూపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గాలిలో కాలుష్యంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చర్మంపై పడే ప్రభావాన్ని తీవ్రతరం చేస్తుంది. చర్మం వదులుగా విరిగిపోవడం, పొడిబారడం, పేలవంగా తయారవ్వడం లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

homemade face scrubs, face scrubs for summer

ఇలాంటి సమస్యలను, చర్మరంధ్రాలను శుభ్రపరచడం మరియు చర్మంలో నీటి విలువలను పెంచడం ద్వారా ఉధృతం కాకుండా అరికట్టవచ్చు. అలా చేయడానికి చర్మం యొక్క సాంద్రతను పెంచగలిగే ఫేస్ స్క్రబ్ తో కనీసం వారానికి ఒకసారైనా స్క్రబ్ విధిగా చేస్తుండాలి. ఇందుకోసం ఇంట్లో సులభంగా తయారు చేసుకునే వేసవి అనుకూలమైన ఫేస్ స్క్రబ్ జాబితాను ఇవ్వడం జరిగినది.

పోషకాలతో, విటమిన్లతో రూపొందించబడిన ఈ స్క్రబ్స్ వేసవిలో మీ చర్మాన్ని ఎండ తీవ్రతకు గురికాకుండా అడ్డుకోగలవు.

క్రింద చూపిన స్క్రబ్ లో ఎదో ఒక స్క్రబ్ ని వారానికి కనీసం ఒకసారైనా వినియోగించడం మూలంగా వేసవిలో మీ చర్మాన్ని ఉష్ణోగ్రతల నుండి కాపాడుకొనుటకు అనువుగా ఉంటుంది.

ముఖ్య గమనిక : స్క్రబ్ వాడడానికి ముందు, మీ చర్మంపై (ఉదాహరణకు చెయ్యి మీద) ఒక పాచ్ వేసి అప్లై చేసి పరీక్షించడం ఉత్తమం.

స్క్రబ్ 1 :

స్క్రబ్ 1 :

కావలసిన పదార్ధాలు : లావెండర్ నూనె(lavender essential), ఓట్ మీల్ , ఆలివ్ ఆయిల్

స్క్రబ్ చేయు విధానము: ఒక గిన్నెలో నాలుగు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి, అందులో ఒక టీ స్పూన్ ఓట్ మీల్, 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి స్క్రబ్ లాంటి పదార్ధం వచ్చు వరకు బాగా కలపాలి.

ముఖాన్ని తడి చేసుకుని స్క్రబ్ ను సున్నితంగా తడి చర్మము పై వృత్తాకారములో అప్లై చెయ్యవలెను. ఇలా చర్మానికి పట్టించిన పిదప 5-10 నిమిషాల తర్వాత, ఆ పొడి అవశేషాలను గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చెయ్యవలెను. ఇది చర్మ రంధ్రాలను శుభ్ర పరచడం లో మరియు చర్మం పొడిబారకుండా ఉండడం లో సహాయం చేయును.

స్క్రబ్ 2:

స్క్రబ్ 2:

కావలసిన పదార్ధాలు: ఎండబెట్టిన నారింజ పై తొక్క పొడి మరియు కొబ్బరి నూనె

స్క్రబ్ చేయు విధానము : అర టీస్పూను నారింజ తొక్క పొడి మరియు ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి స్క్రబ్ అగునంతవరకు కలిపి మిశ్రమము చెయ్యవలెను.

ముఖమును తడిగా ఉంచుకుని (తక్కువ నీటితో), కొద్ది నిమిషాలు సుతారంగా చల్లని నీటితో స్క్రబ్ చేసాక, ఈ మిశ్రమాన్ని ముఖంపై అన్ని భాగాలకు విస్తరించునట్లు సున్నితంగా గుండ్రంగా అద్దుతూ అప్లై చెయ్యవలెను. ఇది ఒక టోనర్ వలె పనిచేసి, చర్మంలో నీటి సాంద్రతను పెంచి జీవం కనిపించేలా చేస్తుంది.

స్క్రబ్ 3:

స్క్రబ్ 3:

కావలసిన పదార్దాలు: చక్కెర, నిమ్మ రసం, రోజ్ ఆయిల్ .

స్క్రబ్ చేయు విధానము: ఒక గిన్నెలో అర టీస్పూన్ చక్కర పొడి, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, 3,4 చుక్కల గులాబీ నూనె ను వేసి scrub వచ్చునంతవరకు మిశ్రమంగా చేయవలెను.

ముఖం పై అన్నీ ప్రదేశాలకు విస్తరించునట్లు సున్నిత గా స్క్రబ్ చేసి, కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖమును శుభ్రంచెయ్యవలెను. ఇది చర్మం పై ఉన్న మృత కణాలను తొలగించి నిగారింపు తీసుకుని రావడానికి సహాయం చేస్తుంది.

స్క్రబ్ 4:

స్క్రబ్ 4:

కావలసిన పదార్ధాలు: బియ్యం పిండి, పాలు మరియు రోజ్ వాటర్.

తయారుచెయ్యు విధానము: ఒక స్పూన్ బియ్యం పిండిలో అర టీ స్పూన్ చొప్పున పాలు మరియు రోజ్ వాటర్ ని కలిపి స్క్రబ్ వచ్చునంత వరకు మిశ్రమమును కలపవలెను.

ముఖమునకు స్క్రబ్ అప్లై చేసాక , పొడి అగునంత వరకు ఉంచి గోరువెచ్చని నీటి తో శుభ్రపరచవలెను.

ఈ స్క్రబ్, చర్మం మృదుత్వానికి మరియు నిగారింపునకు సహకరించును.

స్క్రబ్ 5:

స్క్రబ్ 5:

కావలసిన పదార్ధాలు: కోకో పౌడర్ , మరియు తేనె

తయారుచెయ్యు విధానము: అర టీస్పూన్ కోకో పౌడర్ లో ఒక టీ స్పూన్ తేనె ని వేసి స్క్రబ్ వచ్చునంతవరకు మిశ్రమమును కలుపవలెను.

దీనిని ముఖము పై అన్నీ ప్రదేశాలు విస్తరించునట్లు సున్నితముగా స్క్రబ్ చేసి , కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కానీ క్లెన్సర్ తో కాని ముఖమును శుభ్రంచెయ్యవలెను. ఇది చర్మం పొడిబారకుండా చేసి ఒక టోనర్ లా పనిచెయ్యును.

స్క్రబ్ 6:

స్క్రబ్ 6:

కావలసిన పదార్ధాలు: కాఫీ గ్రౌండ్స్(రుబ్బిన కాఫీ గింజల మిశ్రమము), బాదం నూనె

తయారుచెయ్యు విధానము: ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ బాదం నూనె లో అరా టీ స్పూన్ కాఫీ గ్రౌండ్ వేసి స్క్రబ్ వచ్చినట్లు మిశ్రమాన్ని కలపవలెను.

తడి ముఖము పై సున్నితముగా అన్ని భాగములకు విస్తరింపునట్లు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాల తర్వాత అవశేషాలు పోవునట్లు గోరువెచ్చని నీటి తో ముఖమును కడుగవలెను. ఇది చర్మరంధ్రాలను శుభ్ర పరచడంలో, బ్లాక్ హెడ్స్ తొలగించుటలో మరియు చర్మం పొడిబారకుండా ఉండడంలో సహాయం చేయును

స్క్రబ్ 7:

స్క్రబ్ 7:

కావలసిన పదార్ధాలు: బ్రౌన్ షుగర్, షియా బట్టర్

తయారుచెయ్యు విధానము: ఒక ముక్క షియా బట్టర్ ను అరా టీ స్పూన్ బ్రౌన్ షుగర్ తో మిళితం చేసి స్క్రబ్ అయ్యేలా మిశ్రమాన్ని కలపాలి.

ముఖముపై స్క్రబ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత అవశేషాలు శుభ్రం అయ్యేలా గోరువెచ్చని నీటితో శుభ్రపరచవలెను.

ఇది మృత కణాలను తొలగించి, చర్మం పొడిబారకుండా చేయుట లో సహాయం చేయును.

English summary

homemade face scrubs | face scrubs for summer

The rising temperature with pollution in the air can make things difficult for your skin and lead to woes like breakouts, dullness, dryness, etc. To prevent that, you should prepare your skin for the summer season. Preparing scrubs using orange peel, coconut oil, oatmeal, olive oil, etc., and applying it on a weekly basis will make your skin more healthy.
Story first published: Friday, March 2, 2018, 7:00 [IST]