For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వర్షాకాలంలో మెరిసే చర్మానికై ఇంటిలో తయారుచేసుకోగలిగే తాజా పండ్ల మాస్క్

  |

  మనలో చాలామందికి వర్షమంటే అమితమైన ప్రేమ. అయినప్పటికీ, నాణానికి రెండు పార్శ్వాలున్నట్లు, వర్షాలు తమతో పాటు అనేక చర్మ సమస్యలను కూడా మోసుకొస్తాయి.

  మారుతున్న ఋతువులు అనుగుణంగా మన చర్మంలో కూడా చాలా మార్పులు సంభవిస్తాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన, చర్మం పొడిబారిపోతుంది. చెమట మరియు దుమ్ము కారణంగా ఏర్పడిన మొటిమలు, ఇబ్బందికరంగా మరియు నిరంతర సమస్యగా మారే అవకాశం ఉంది. వర్షాకాలంలో పదేపదే తడవడం, ఆరడం వలన మీ ముఖం లో మెరుపు తగ్గి బయట ఉన్న వాతావరణం కన్నా విచారకరంగా కనపడవచ్చు.

  Homemade Fresh Fruit Mask For Glowing Skin This Monsoon

  ఇంటిలో తయారుచేసుకోగలిగే తాజా పండ్ల మాస్క్:

  వర్షాకాలం, చర్మంపై శ్రద్ధ వహించడానికి అంత అనువుగా ఉండదు. నిజానికి ఈ కాలంలో, సాధారణంగా మనం ఎల్లపుడు తీసుకునే జాగ్రత్తలు మాత్రమే తీసుకుంటే సరిపోవు. దుమ్ము ధూళికి నిరంతరం బహిర్గతం అవ్వడం వల్ల మీ చర్మం నిస్తేజంగా మరియు అలసటతో కూడుకున్నట్లు కనిపిస్తుంది. కనుక మీ చర్మానికి అదనపు పోషణ ఇవ్వడం ముఖ్యం. ఈ విషయంలో పండ్ల కన్నా మెరుగైనవి ఇంకేముంటాయి?

  అనాదిగా మహిళలు సౌందర్య పోషణ నిమిత్తం ప్రకృతి సుగుణాలను పొందుపరచుకున్న పదార్థాలను వినియోగించడం మనకు తెలిసినదే! తాజా పండ్లలో ఉండే చాలా రకాల విలువైన పోషకాలు, మూడు విధాలుగా ఉపయోగపడతాయి. మీ చర్మానికి లోతైన శుభ్రతను ఇచ్చి, పైన పేరుకున్న మృతకణాలను తొలగించి, ప్రకాశవంతమైన నూతన చైతన్యం నింపుతాయి.

  మార్కెట్లో చాలా రకాల పండ్లతో తాయారు చేసిన ఫేస్ ప్యాకులు అందుబాటులో ఉన్నప్పటికి, తాజా పండ్లతో మన ఇంట్లో తాయారు చేసుకునేవే వాడటం శ్రేయస్కరం. ఇప్పుడు మీ కోసం ఇంట్లోనే తాజా పండ్లతో సులభంగా తయారు చేసుకోగలిగే ఒక మాస్కు గురించి వివరిస్తున్నాం. ఇది వర్షాకాలంలో మిమ్మల్ని చిటికెలో పార్టీలకు కూడా సంసిద్ధం చేస్తుంది.ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడం సులభం మరియు చాలా కొద్ది సమయంలోనే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది.దీనివలన ఇంకొక లాభం ఏమిటంటే, ఇది ఎటువంటి చర్మతత్వం ఉన్నవారికైనా మేలు చేస్తుంది.

  వర్షాకాలంలో మెరిసే చర్మానికై అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కు :

  వర్షాకాలంలో మెరిసే చర్మానికై అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కు :

  కావలసిన పదార్థాలు:

  - 1 టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు

  - 1 టీ స్పూన్ కివీ గుజ్జు

  - 1 టేబుల్ స్పూన్ తేనె

  - 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం

  - 1 టేబుల్ స్పూన్ దబ్బపండు రసం

  అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కు తయారీ విధానం:

  అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కు తయారీ విధానం:

  1) అవకాడో గుజ్జు మరియు కివీ గుజ్జులను ఒక గిన్నెలో తీసుకుని బాగా మెదపండి.

  2) దీనికి 1 టేబుల్ స్పూన్ తేనెని కలపండి.

  3) పుచ్చకాయ రసంను పక్కన పెట్టండి. పైన చెప్పిన మిశ్రమంలో కలపకండి.

  అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కును వాడే విధానం:

  అవకాడో, కివీ మరియు దబ్బపండు మాస్కును వాడే విధానం:

  1) మీ ముఖాన్ని శుభ్రపరుచుకున్నాక, పుచ్చకాయ రసంతో వలయాకారంలో మృదువుగా మర్దన చేసుకోండి.

  2) రసం మొత్తం మీ చర్మం లోనికి ఇంకిపోయేవరకు మర్దన చేసుకోండి.

  3) అయిదు నిమిషాల తరువాత మీ ముఖాన్ని దూదితో శుభ్రపరచుకోండి.

  4) ఇప్పుడు అవకాడో, కివీ మరియు దబ్బపండు మిశ్రమాన్ని ముఖానికి పూసుకోండి.

  5) 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి.

  6) కడుక్కునేముందు, మీ ముఖంపై ఆ మిశ్రమంతో వలయాకారంలో మర్దన చేసుకోండి.

  7) ముఖంపై దబ్బపండు రసంతో ఒత్తుకోవడంతో ఈ ప్రక్రియను ముగించండి.

  8) మీ ముఖంపై దబ్బపండు రసం ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండటం ఇష్టం లేనట్లయితే కనుక పదిహేను నిమిషాల తరువాత కడిగేసుకోండి.

  9) ఈ ప్యాకును వారానికి ఒకసారి వాడితే మీ ముఖంలో తేమ నిలిచి ఉండడంతో పాటుగా మెరుపును సంతరించుకుంటుంది.

  ఈ ప్యాక్ ఏ విధంగా మీ చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది?

  ఈ ప్యాక్ ఏ విధంగా మీ చర్మానికి ప్రయోజనం చేకూరుస్తుంది?

  ఈ ప్యాక్ లో ఉపయోగించే పదార్థాలు అన్నీ చర్మానికి మేలు చేసేవే కాక, ఎటువంటి చర్మతత్వం ఉన్నవారికైనా మేలు చేస్తాయి. ఏ పదార్థం మన చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందో, ఈ క్రింద విశదంగా తెలియజేస్తున్నాం.

  1) పుచ్చకాయ రసం-

  1) పుచ్చకాయ రసం-

  పుచ్చకాయ రసం ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్. ఇది మీ చర్మం యొక్క రంధ్రాలను లోతుగా శుభ్రపరిచి, ఆ రంధ్రాలలో అడ్డుపడే మురికి మరియు ధూళిని తొలగిస్తుంది. ఏదైనా చికిత్స వలన ప్రయోజనం పొందడానికి, మీ చర్మంపై ఏదైనా పూసుకునే ముందు, లోతుగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.

  2) అవకాడో

  2) అవకాడో

  అవోకాడో చర్మానికి లోతుగా తేమనిస్తుంది మరియు మోటిమలు ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. ఇది సూర్యుని యొక్క హానికారకమైన కిరణాల నుండి చర్మమును రక్షించి వృద్ధాప్య ప్రక్రియను నిలుపుజేస్తుంది.

  3) కివి

  3) కివి

  కివి మీ చర్మానికి విటమిన్ సి యొక్క సరఫరాను పెంచి, మునుపెన్నడూ లేని మెరుపును మీ చర్మానికి అందిస్తుంది. కివిలో నిమ్మకాయ కన్నా ఎక్కువ విటమిన్ సి ఉన్నదని నిరూపించబడింది.

  ఇది మేనిఛాయను తేలిక పరిచి, ప్రకాశవంతంగా చేస్తుంది

  4) తేనె

  4) తేనె

  తేనె మంచి యాంటీ బాక్టీరియల్ గా పనిచేయడమే కాక, మెండుగా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది చర్మం యొక్క ఏ సమస్యనైనా తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాక ఇది చర్మానికి లోపల నుండి తేమను సమకూరుస్తుంది.

  5) దబ్బపండు రసం

  5) దబ్బపండు రసం

  దబ్బపండు రసం మంచి టోనర్ లాగా పనిచేస్తుంది.

  చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ తో ఇది పోరాడుతుంది మరియు వృద్ధాప్య ప్రక్రియను నిదానింపచేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం ద్వారా చర్మం యొక్క సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది.

  English summary

  Homemade Fresh Fruit Mask For Glowing Skin This Monsoon

  Our skin goes through a lot of changes with every change in season. While the air is high with humidity, skin tends to become drier due to constant winds. The sweat and dirt build also causes breakouts, which can be quite pesky and persistent. Try this homemade fruit face mask to get that glow back.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more