For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ ఏజింగ్ కు తోడ్పడే హోమ్ మేడ్ గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్

|

ఏజింగ్ ను ఎవరు కోరుకుంటారు? ఎవరూ కోరుకోకపోయినా ఏజింగ్ అనేది సహజసిద్ధమైన ప్రక్రియ. ఎండలో ఎక్కువసేపు ఉండటం, మేకప్ ను ఎక్కువగా వాడటం, అస్తవ్యస్తమైన లైఫ్ స్టయిల్, స్మోకింగ్ మరియు డ్రింకింగ్ కు అడిక్ట్ అవడం వంటివి ఏజింగ్ లక్షణాలు త్వరగా కనపడేలా చేస్తాయి. మరి, ఈ ఏజింగ్ ను వాయిదా వేయవచ్చా? మీలో చాలా మందిలో ఈ సందేహం నెలకొని ఉండుంటుంది. అదృష్టవశాత్తు ఏజింగ్ లక్షణాలను కొంత మేరకు వాయిదా వేయవచ్చు.

ఏజింగ్ విషయంలో దిగులు చెందనవసరం లేదు. మీకొక్క అద్భుతమైన పరిష్కారాన్ని మేము తెలుపుతున్నాము. ఇక్కడ, గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ గురించి వివరించాము. ఈ ప్యాక్ ను వాడటం ద్వారా ముడతలను అలాగే ఫైన్ లైన్స్ ను సులభంగా తగ్గించుకోవచ్చు.

Homemade Green Gram Flour Face Pack For Anti-ageing
 

ఈ ప్యాక్ అనేది ముడతలను తగ్గించేందుకు తోడ్పడటంతో పాటు, మిగతా చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయకారిగా ఉంటుంది. ఈ ప్యాక్ ను వాడటం ద్వారా డార్క్ స్పాట్స్, బ్లేమిషెస్, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో వాడిన నిమ్మ మరియు తేనెలు ఈ ప్యాక్ యొక్క యాంటీ ఏజింగ్ సుగుణాలను మరింత పెంచుతాయి.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

గ్రీన్ గ్రామ్ ఫ్లోర్

ఎగ్ వైట్

తేనె

నిమ్మరసం

ఎలా తయారుచేయాలి?

ఎలా తయారుచేయాలి?

1. ఎగ్ నుంచి ఎగ్ వైట్ ను సెపరేట్ చేయండి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకోండి.

2. ఒక నిమ్మకాయను తరిగి నిమ్మరసాన్ని ఎగ్ వైట్ లో జోడించండి.

3. స్మూత్ వైట్ ఫోమ్ తయారయ్యే వరకు ఈ రెండు పదార్థాలని బాగా కలపండి. నిమ్మను జోడించడం వలన ఎగ్ నుంచి వచ్చే వాసన తగ్గుముఖం పడుతుంది.

4. ఇప్పుడు ఒక టీస్పూన్ ఆర్గానిక్ తేనెను జోడించండి. అలాగే గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ను కూడా జోడించండి.

5. ఈ పదార్థాలని బాగా కలపండి. ఎటువంటి లంప్స్ లేకుండా స్మూత్ పేస్ట్ రూపుదిద్దుకునే వరకు పదార్థాలను బాగా కలపండి.

ఎలా తయారుచేయాలి? వేసుకోవాలి
 

ఎలా తయారుచేయాలి? వేసుకోవాలి

6. మీ ముఖాన్ని వెచ్చటి నీటితో కడగండి. ఇలా చేస్తే స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి.

7. ఇప్పుడు కాస్తంత ప్యాక్ ను తీసుకుని ముఖంపై ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఈ ప్యాక్ ను ముఖంపై సర్కులర్ అలాగే అప్ వార్డ్ మోషన్ లో అప్లై చేయండి. కంటి వద్ద ప్రదేశాన్ని అవాయిడ్ చేయండి.

8. ఈ ప్యాక్ ను 15-20 నిమిషాల వరకు తొలగించకండి.

ఎలా తయారుచేయాలి? వేసుకోవాలి

ఎలా తయారుచేయాలి? వేసుకోవాలి

9. ఈ మాస్క్ ని అప్లై చేసుకుంటున్నప్పుడు మాట్లాడకండి. మాట్లాడితే, ప్యాక్ టైట్ గా ఉండటం వలన ముడతలు ఫార్మ్ అయ్యే ప్రమాదం ఉంది.

10. 20 నిమిషాల తరువాత ఈ మాస్క్ ఆరాక, వెచ్చటి నీళ్లతో రిన్స్ చేస్తూ మాస్క్ ను తొలగించండి.

11. ముఖంపై తడిని తుడుచుకుని మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి.

గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ద్వారా అందే ప్రయోజనాలు:

గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ద్వారా అందే ప్రయోజనాలు:

గ్రీన్ గ్రామ్ ఫ్లోర్ ను గ్రీన్ మూంగ్ దాల్ అని కూడా పిలుస్తారు. ఇందులో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. ఇది పోర్స్ ను లోలోపల నుంచి క్లీన్స్ చేస్తుంది. చర్మానికి పోషణనిస్తుంది. గ్రీన్ గ్రామ్ లో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు తోడ్పడతాయి. దీన్ని వాడితే, చర్మం మరింత యవ్వనంగా అలాగే అందంగా మారుతుంది. దీన్ని సోప్ కు ప్రత్యామ్నాయంగా రోజూ వాడుకోవచ్చు. తద్వారా, కాంతివంతమైన అలాగే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఎగ్ వైట్ వలన కలిగే ప్రయోజనాలు:

ఎగ్ వైట్ వలన కలిగే ప్రయోజనాలు:

ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ ప్రోటీన్స్ అనేవి చర్మం ఎలాస్టిసిటీను మెయింటెయిన్ చేసేందుకు తోడ్పడతాయి. ఇందులో, విటమిన్ ఏ తో పాటు కొలాజెన్ అనేది లభ్యమవుతుంది. ఇది ముడతలను అలాగే ఫైన్ లైన్స్ ను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇది చర్మంపై అదనంగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ను రెగ్యులేట్ చేస్తుంది. తద్వారా, ఆయిల్ ఫ్రీ స్మూత్ స్కిన్ ను అందిస్తుంది.

తేనె ద్వారా అందే ప్రయోజనాలు

తేనె ద్వారా అందే ప్రయోజనాలు

తేనె అద్భుతమైన, సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది ఏజింగ్ ప్రాసెస్ వేగాన్ని తగ్గిస్తుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చర్మ సంరక్షణలో ఉపయోగకరంగా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీ మైక్రో బయాల్ ప్రాపర్టీస్ అనేవి సూర్యుని నుండి విడుదలయ్యే హానికర కిరణాల నుంచి రక్షణను అందిస్తాయి.

నిమ్మ ద్వారా అందే ప్రయోజనాలు:

నిమ్మ ద్వారా అందే ప్రయోజనాలు:

నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది అనేక చర్మ సమస్యల నుంచి రక్షణను అందిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది స్కిన్ ఎక్స్ఫోలియేటర్ లా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది. చర్మం మరింత కాంతివంతంగా, యవ్వనంగా అలాగే తేటగా కనిపించేలా చేస్తుంది. అలాగే, ఇది యాక్నే, బ్లేమిషెస్, పిగ్మెంటేషన్ వంటి ఇతర చర్మసమస్యల నుంచి కూడా రక్షణను అందిస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ ను వాడితే ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు.

English summary

Homemade Green Gram Flour Face Pack For Anti-ageing

Many of you might have this question in mind - can you actually slow down the early signs of ageing? And if yes, how? Early signs of ageing are influenced by a number of factors like overexposure to the sun, over usage of make-up, lifestyle, excessive smoking and drinking, etc. You can try out the green gram flour pack to treat signs like wrinkles and fine lines.
Story first published: Thursday, August 9, 2018, 18:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more