For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వదులైన చర్మం టైట్ గా మార్చి, యవ్వనంగా కనబడేలా చేసే ఎగ్ వైట్ రిసిపి

By Mallikarjuna
|

బ్యూటీ విషయంలో అనేక సమస్యలుండవచ్చు. వాటిలో చర్మ వదులవడం కూడా ఒక పెద్ద సమస్య. చర్మం వదులైనట్లు కనబడితే వయస్సైన వారిలా కనబడుతారు. ఈ సమస్య ఈ మద్యకాలంలో సహజం అయిపోయింది.

అసలు చర్మం ఎందుకు వదులౌతుందో మీకు తెలుసా? సడెన్ గా బరువు తగ్గడం, వయస్పు పెరిగే కొద్ది, కొల్లాజెన్ ను కోల్పోవడం, చర్మంలో సరిగా కొల్లాజెన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల చర్మం వదులైనట్లు కనబడుతుంది.

వదులైన చర్మం టైట్ గా మార్చడానికి లేదా టైట్ గా కనిపించడానికి బ్యూటీ స్టోర్స్ లో కమర్షియల్ గా చాలానే ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వవు. అలాగే స్కిన్ ట్రీట్మెంట్లకు వెళితే మొదటికే మోసం వస్తుంది. చర్మం మరింత పాడవడంతో పాటు పర్స్ కాలీ చేసుకోవడం జరగుతుంది.

Here’s How You Should Use Egg White To Tighten Your Skin

కొన్ని వేళల్లో మహిళలు ఈ స్కిన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను న్యాచురల్ గా తగ్గించుకోవాలంటే, కొన్ని న్యాచురల్ పదార్థాలు సహాయపడుతాయి. అలాంటి న్యాచురల్ పదార్థాలను పరిచయం చేయడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది

వదులైన మీ చర్మంను టైట్ గా మార్చడానికి కొన్ని న్యాచురల్ పదార్థాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎగ్ వైట్ ప్రదాన పదార్థం. ఎగ్ వైట్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్, ప్రోటీన్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల చర్మంలో అద్భుత మార్పులను తీసుకు రావడంతో పాటు, స్కిన్ టైట్ గా మార్చుతుంది. కాబట్టి, ఎగ్ వైట్ తో పాటు మరికొన్ని న్యాచురల్ పదార్థాలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

1. ఎగ్ వైట్ -నిమ్మరసం

1. ఎగ్ వైట్ -నిమ్మరసం

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని , రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. మాస్క్ డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం టైట్ గా మారి యంగర్ లుక్ ను అందిస్తుంది

2. ఎగ్ వైట్ -ఓట్ మీల్

2. ఎగ్ వైట్ -ఓట్ మీల్

రెండు టీస్పూన్ల ఓట్ మీల్ కు ఒక గుడ్డులోని తెల్లని పదార్థాన్ని తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేషియల్ స్కిన్ కు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తడి బట్టతో తుడవాలి. దీన్ని స్క్రబ్బింగ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాను వారంకు ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. ఎగ్ వైట్ -రోజ్ వాటర్

3. ఎగ్ వైట్ -రోజ్ వాటర్

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని, అందులో అరటీస్పూన్ కార్న్ స్టార్చ్(మొక్కజొన్న పిండి) మరియు ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. మూడు బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసిన తర్వాత ముఖం మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఈ హోం మేడ్ మెటీరియల్ ను నెలకొకసారి అప్లై చేస్తే మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు.

4. ఎగ్ వైట్ -తేనె

4. ఎగ్ వైట్ -తేనె

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని అందులో తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ లా మారిన తర్వాత ముఖం, మెడకు అప్లై చేయాలిజ 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేసుకోవాలి.వారంలో ఒకసారి ఈ చిట్కాను రిపీట్ చేస్తే ఎఫెక్టివ్ ఫలితాలను అందించి, చర్మంను టైట్ గా మార్చుతుంది.

5. ఎగ్ వైట్ - బియ్యం పిండి

5. ఎగ్ వైట్ - బియ్యం పిండి

ఒక బౌల్ తీసుకుని, అందులో ఎగ్ వైట్ , 2 టీస్పూన్ల బియ్యం పిండి వేసి రెండూ బాగా మిక్స్ చేసి పేస్ట్ లాచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడిగేసుకోవాలి. ఈ హోం ట్రీట్మెంట్ ను వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా, అందంగా మారుతుంది.

6. ఎగ్ వైట్ -పెరుగు

6. ఎగ్ వైట్ -పెరుగు

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ఎఫెక్టివ్ రెమెడీని వారానికొకసారి ఉపయోగిస్తే చర్మం అందంగా తయారవుతుంది.

7. ఎగ్ వైట్ - యాపిల్ గుజ్జు

7. ఎగ్ వైట్ - యాపిల్ గుజ్జు

ఒక బౌల్లో ఎగ్ వైట్ తీసుకుని, అందులో 2 టీస్పూన్ల యాపిల్ పల్ప్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ స్పెసిఫిక్ ఫేస్ మాస్క్ ను నెలలో రెండు సార్లు ఉపయోగిస్తే చర్మం టైట్ గా మారుతుంది.

8. ఎగ్ వైట్ + గ్లిజరిన్

8. ఎగ్ వైట్ + గ్లిజరిన్

ఒక బౌల్లో గుడ్డులోని తెలసొన తీసుకుని, దానికి ఒక టీస్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ రెండింటి మిశ్రమంను ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత కడిగేయాలి. ట్యాప్ వాటర్ తో కడగాలి. ఎగ్ వైట్ ను కనీసం నెలకొకసారి చర్మానికి ఉపయోగించడం వల్ల వదులైన చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.

English summary

Here’s How You Should Use Egg White To Tighten Your Skin

Loose skin is one beauty problem that can wreak havoc in your skin's appearance. And this problem has become exceedingly common these days. But, wait, there is one solution! Using egg white along with other natural ingredients such as lemon, oatmeal, etc., can naturally tighten your skin.
Desktop Bottom Promotion