For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే దానిమ్మ టోనర్

|

మీ వంటగదిలో అందుబాటులో ఉండే చక్కెర, ఉప్పు, పసుపు, పెరుగు, బేసన్ వంటి పదార్థాల శ్రేణి, మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసేందుకు దోహదపడే పదార్ధాలుగా ఉన్నాయి. ఇటువంటి ప్రాథమిక పదార్ధాలతోనే ఒక ఫేస్ ప్యాక్ చేసినప్పుడు, మీ చర్మంపై భారీ వ్యత్యాసాన్ని చూపించగలవు. క్రమంగా మీ ముఖానికి యవ్వనవంతంగా మెరిసేలా దోహదం చేస్తుంది.

అంతేకాక, మీరు మీ చర్మసంరక్షణలో భాగంగా పండ్లను జోడించినప్పుడు, అవి మీ చర్మాన్ని దోషరహితంగా చేయడమే కాకుండా, ఎటువంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తకుండా, మేలిమి ఛాయను అందివ్వడంలో సహాయం చేస్తాయి. పండ్లలో ఎప్పుడైనా మీ చర్మ సంరక్షణలో భాగంగా దానిమ్మను చేర్చారా? లేకపోతే, ఒకసారి దానిమ్మపండును ఉపయోగించి చూడండి. దీనిలో చర్మానికి తేజస్సును కలిగించే అనామ్లజనకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు మృదువైన, కోమలమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని అందివ్వడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది.

How To Make Pomegranate Toner For Soft, Glowing Skin At Home?

చర్మ సంరక్షణలో భాగంగా దానిమ్మపండునే ఎందుకు ఉపయోగించాలి?

విటమిన్-సి లో అధికంగా ఉండే దానిమ్మపండు వృద్ధాప్య చాయలను నెమ్మదిగా తగ్గిస్తుంది. దానిమ్మపండులో ఉండే అనామ్లజనకాలు చర్మాన్ని ప్రతికూల పరిస్థితుల నుండి పోరాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వాపు, దురద, చర్మం ఎర్రబారడం లేదా చికాకు తగ్గించడంలో ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంపై మచ్చలు తొలగించుటలో కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, దానిమ్మపండులో మీ చర్మాన్ని ప్రకాశింపజేసే సహజసిద్దమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా మీ చర్మం యొక్క స్థితిస్థాపకతను నిర్వహించడం ద్వారా మీ చర్మాన్ని పునరుద్దరించి, ఆకృతిని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది.

సాధారణంగా దానిమ్మపండును నేరుగా లేదా పండ్ల రసం రూపంలో సమయోచితంగా తీసుకుంటున్న ఎడల, ఇది మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మరియు మేని చాయను పెంచడానికి సహాయపడుతుంది.

దానిమ్మపండు మీ చర్మ ఆరోగ్యానికి సూచించబడిన అద్భుతమైన ఎంపిక అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ చర్మ సంరక్షణ పద్దతులలో భాగంగా, దానిమ్మపండును జోడించుకోవడం ఎంతో ఉత్తమమైన చర్యగా ఉంటుంది. ఎందుకంటే ఇది అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది కాబట్టి.

How To Make Pomegranate Toner For Soft, Glowing Skin At Home?

ఇంటివద్దనే కేవలం 5 దశలలోనే దానిమ్మతో టోనర్ తయారు చేసుకోవచ్చు :

ఇంట్లోనే దానిమ్మ టోనర్ తయారు చేయడం ఏమంత క్లిష్టమైన విషయం కాదు. దిగువ పేర్కొన్న సరళమైన మరియు సులువైన దశలను అనుసరించడం ద్వారా మరియు మీ చర్మానికి దానిమ్మ పండు ద్వారా మంచి ఆరోగ్యాన్ని అందివ్వగలరు.

కావలసిన పదార్ధాలు :

½ దానిమ్మ గింజలు

½ కప్ నీరు

1 గ్రీన్-టీ బ్యాగ్

1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

How To Make Pomegranate Toner For Soft, Glowing Skin At Home?

తయారుచేయు విధానం :

ఒక చిన్న పాత్రను తీసుకోండి మరియు అందులో అర కప్పు నీటిని చేర్చండి. చిన్న మంట మీద ఉంచి, నీటిని వేడి చేయండి.

ఒకసారి నీరు బాయిల్ అవడం మొదలైన వెంటనే, దానికి ఒక గ్రీన్-టీ బ్యాగ్ జోడించి, ఒకటి లేదా రెండు నిమిషాలు కాగనివ్వండి.

మంటను ఆపివేసి, పాత్రను పక్కన ఉంచండి. పాత్ర నుండి టీ బ్యాగ్ తొలగించండి. కొద్దిగా చల్లబడిన తర్వాత, దానిలో రోజ్ వాటర్ జోడించి కలపండి.

చివరగా, ఒక జ్యూసర్ మిక్సర్లో దానిమ్మపండు గింజలను తీసుకుని గ్రైండ్ చేసి దాని రసాన్ని వేరు చేయండి. తర్వాత దానిమ్మపండు రసాన్ని వేడిచేసిన నీటిలో వేసి బాగుగా కలపండి.

ఈ రసాన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకుని భవిష్యత్ అవసరాలకై నిల్వ చేయండి. మీ ముఖం మరియు మెడపై ఈ టోనర్ దరఖాస్తు చేసే క్రమంలో భాగంగా ఒక కాటన్ బాల్ వినియోగించండి. లేదా మీ ముఖం మీద పిచికారీ వలె స్ప్రే చేసి, మీ వేళ్లను ఉపయోగించి సున్నితంగా మసాజ్ చేయండి మరియు పొడిగామారే వరకు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగి, శుభ్రమైన పొడి తువాలుతో సున్నితంగా ముఖంపై నీటిని తొలగించండి. ఉత్తమ ఫలితాలకై వారంలో కనీసం 2 నుండి 3 సార్లు అనుసరించడం మంచిది. ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువగా ఉండే ఈ టోనర్, తక్కువ కాలంలోనే మెరుగైన ఫలితాలను చూపగలదు.

సులభంగానే ఉంది కదా, ఇంట్లోనే తయారుచేసుకోగల ఈ టోనర్ మీకు సులువుగా ఉండడమే కాకుండా, అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది కూడా. దానిమ్మలోని పోషకాలు, అనామ్లజనకాలు అంతర్గతంగా శరీరానికి ఎంత మేలు చేస్తాయో, బాహ్య సౌందర్యానికి కూడా అంతగా సహాయపడగలదు. కావున దైనందిక జీవన శైలిలో భాగంగా దానిమ్మను చేర్చుకోవడం ఎంతో మంచిదిగా సూచించబడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Make Pomegranate Toner For Soft, Glowing Skin At Home?

Rich in Vitamin C, pomegranate possess anti-ageing properties that slower the process of ageing. The antioxidants present in pomegranate also help to fight skin conditions such as inflammation, itching, redness of the skin or skin irritation. Moreover, pomegranate also has a natural tendency to brighten your skin
Story first published: Wednesday, October 17, 2018, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more