Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
మేకప్ లేకపోయినా అందంగా కనిపించడమెలా?
మహిళలకి మేకప్ పై మక్కువ ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ మేకప్ లేకుండా ఉండేందుకు ఇష్టపడతారు. అటువంటప్పుడు కూడా అందంగా కనిపించాలంటే తగిన ప్రయత్నం చేయాలి. అయితే, మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించాలంటే కొని జ
మహిళలకి మేకప్ పై మక్కువ ఎక్కువ. అయితే, అప్పుడప్పుడూ మేకప్ లేకుండా ఉండేందుకు ఇష్టపడతారు. అటువంటప్పుడు కూడా అందంగా కనిపించాలంటే తగిన ప్రయత్నం చేయాలి. అయితే, మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించాలంటే కొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు అటువంటి చిట్కాలను మీకు మేం అందిస్తున్నాము.
కొన్ని లేజీ డేస్ లో, మేకప్ కి దూరంగా ఉండాలనిపిస్తుంది. నిజానికి, మేకప్ కి సెలవివ్వడం చర్మానికి మంచిది కూడా. చర్మం స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటుంది. తద్వారా, బ్రేక్ అవుట్స్ సమస్య నిరోధింపబడుతుంది.
మేకప్ ని వాడకుండా ఈ సులభమైన చిట్కాలను వాడడం ద్వారా ఏ విధంగా అందంగా కనిపించవచ్చో ఇప్పుడు మీకు వివరిస్తాము. చర్మాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటే అటువంటి మేకప్ లుక్ సహజంగానే లభిస్తుంది. తద్వారా, మీకు ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది.
ఈ కింద చెప్పిన పాయింట్స్ అనేవి మేకప్ లేకుండా కూడా అందంగా కనిపించే విధానాన్ని తెలియచేస్తాయి. వీటిని చదివి మీరు మరింత ఆశ్చర్యానికి గురవుతారు. సరైన విధంగా వీటిని పాటిస్తే అందమైన చర్మ సౌందర్యాన్ని కలిగి ఉంటారు.
అలాగే, మేకప్ ని వాడనంత మాత్రాన సన్ స్క్రీన్ ని స్కిప్ చేయవలసిన అవసరం లేదు. హానికర సన్ రేస్ నుంచి చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ ని వాడటం అవసరం. ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి మేకప్ కి సెలవు ప్రకటించిన రోజు కూడా అందంగా కనిపించే చిట్కాలను తెలుసుకోండి.

1. తరచూ ఎక్స్ఫోలియెట్ చేసుకోండి:
అందమైన చర్మాన్ని పొందడం కోసం ఎక్స్ఫోలియేషన్ ని మీ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి. ఈ చిట్కాను పాటిస్తే డెడ్ స్కిన్ సమస్య తొలగిపోతుంది. తద్వారా, మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవాలి. మార్కెట్ లో లభించే ఎక్స్ఫోలియేషన్ స్క్రబ్స్ ను ఇందుకోసం వాడవచ్చు. లేదంటే, హోంమేడ్ స్క్రబ్ ను తయారుచేసుకోవచ్చు. ఓట్స్ పౌడర్ ని అలాగే తేనెని కలిపి హోంమేడ్ స్క్రబ్ ని తయారుచేసుకుని వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.

2. బ్రాండెడ్ టోనర్ ను వాడండి:
చర్మానికి తగిన టోనర్ ని వాడడం ద్వారా కలిగే ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, బ్రాండెడ్ టోనర్ ని వాడండి. లేదా, రోజ్ వాటర్ వంటి బేసిక్ ఇంగ్రీడియెంట్స్ ని వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. మంచి టోనర్ ని చర్మ సంరక్షణలో భాగంగా వాడితే మేకప్ లేకున్నా కూడా మీరు అందంగా కనిపిస్తారు.

3. కనుబొమ్మలు షేప్ చేసుకోండి:
కనుబొమ్మలు షేప్ చేసుకోవడం మంచిది. మేకప్ లేకున్నా కూడా అందంగా కనిపించాలంటే ఐ బ్రోస్ ని షేప్ చేసుకోవడం అవసరం. ఒక జత ట్వీజర్స్ ని అలాగే ఒక జత చిన్న కత్తెరలని దగ్గరగా ఉంచుకోండి. కనుబొమ్మల వద్ద పెరుగుతున్న అదనపు వెంట్రుకలు మీ అందాన్ని దెబ్బతీస్తాయి. కనుబొమ్మల మధ్యలోనున్న గ్యాప్ ను బ్లాక్ లేదా బ్రౌన్ ఐ షాడో ని వాడి మీ సొగసుని మెరుగుపరచుకోవచ్చు.

4. ఫేషియల్ హెయిర్ ని తొలగించుకోండి:
మేకప్ లేకున్నా కూడా అందంగా కనిపించాలంటే ముఖంపై వెంట్రుకలను తొలగించుకోవాలి. ఇలా ఫిషియల్ హెయిర్ ను తొలగించుకోవడం ద్వారా అందమైన లుక్ ను సొంతం చేసుకోవచ్చు. వ్యాక్సింగ్ లేదా త్రెడింగ్ ద్వారా పేషియల్ హెయిర్ ను తొలగించుకోవచ్చు.

5. సరైన మాయిశ్చరైజర్ ను వాడండి:
మీ చర్మతత్వం ఏదైనా సరే మాయిశ్చరైజర్ ను వాడడం మాత్రం తప్పనిసరి. తద్వారా, మీ చర్మానికి తగినంత తేమ అందుతుంది. తేలికపాటి జెల్ మాయిశ్చరైజర్ ను తీసుకుని తరచూ వాడితే ఉత్తమ ఫలితం పొందవచ్చు.

6. బుగ్గలను నొక్కండి:
బుగ్గలను నొక్కడం ద్వారా ఆ ప్రదేశంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగి మీరు బ్లష్ ని అప్లై చేసిన ఎఫెక్ట్ వస్తుంది. తద్వారా, మేకప్ లుక్ ని సహజంగానే పొందవచ్చు.



Click it and Unblock the Notifications











