1. షేవింగ్ ను అవాయిడ్ చేయండి

1. షేవింగ్ ను అవాయిడ్ చేయండి

బంప్స్ ఫార్మేషన్ అనేది ప్రారంభమవుతున్నట్టు మీకు తెలిస్తే ఆ ప్రదేశంలోని హెయిర్ ను తొలగించడం మానుకోండి. షేవింగ్ వలన ఆ ప్రాంతం మరింత ఇరిటేట్ అవుతుంది. బంప్స్ హీల్ అయిన తరువాత హెయిర్ ను తొలగించవచ్చు.

2. టీ ట్రీ ఆయిల్

2. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు అధికం. అందువలన బంప్స్, పింపుల్స్ మరియు యాక్నే వంటి సమస్యలు తొలగిపోతాయి. డైల్యూట్ చేయబడిన టీట్రీ ఆయిల్ ను బంప్స్ పై అప్లై చేసి ఆ ఏరియాకి కాస్తంత గాలి తగిలేటట్టుగా ఉంచండి. దీనిని రోజుకు రెండుసార్లు పాటిస్తే మంచి ఫలితం లభిస్తుంది. టీట్రీ ఆయిల్ రెమెడీ ద్వారా మీకు రెండు మూడు రోజులలో మంచి ఫలితం లభిస్తుంది.

3. అలోవెరా జెల్

3. అలోవెరా జెల్

బంప్స్ వద్ద దురద అలాగే అసౌకర్యం తీవ్రంగా ఉన్నప్పుడు అలోవెరా జెల్ ను ప్రయత్నించండి. ఈ ఇంగ్రిడియెంట్ కి చర్మాన్ని ప్రశాంతపరిచే గుణం కలదు. అలోవెరా జెల్ ను ప్రభావిత ప్రాంతంపై దట్టమైన లేయర్ గా అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే సూతింగ్ ఎఫెక్ట్ ను గమనించవచ్చు.

4. హెయిర్ రిమూవల్ కి ముందు ఎక్స్ఫోలియెట్ చేయండి

4. హెయిర్ రిమూవల్ కి ముందు ఎక్స్ఫోలియెట్ చేయండి

హెయిర్ ని తొలగించే ముందు ఎక్స్ఫోలియేట్ చేయండి. తద్వారా స్కిన్ పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. సాల్ట్ లేదా షుగర్ తో తయారుచేయబడిన హోంమేడ్ స్క్రబ్ ను వాడి ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. లేదా గ్లైకోలిక్ యాసిడ్ మరియు సాలిసిలిక్ యాసిడ్ ను కూడా మీరు ప్రయత్నించవచ్చు.

5. మీకు సరిపడేదేదో తెలుసుకోండి

5. మీకు సరిపడేదేదో తెలుసుకోండి

షేవింగ్ వలన బంప్స్ ఏర్పడితే మీరు వేరే హెయిర్ రిమూవల్ పద్దతిని పాటించండి. వ్యాక్సింగ్ లేదా ఎపిలేషన్ ను ప్రయత్నించండి. అలాగే, వ్యాక్సింగ్ కూడా కొంతమందికి పడదు. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారైతే తమకు పడే హెయిర్ రిమూవల్ పద్దతిని తెలుసుకుని దానినే పాటించడం మంచిది.

6. వార్మ్ కంప్రెస్

6. వార్మ్ కంప్రెస్

ప్రభావిత ప్రాంతంపై వార్మ్ కంప్రెస్ ని అప్లై చేయడం ద్వారా ఇంఫ్లేమేషన్ ను అలాగే పెయిన్ ను తగ్గించుకోవచ్చు. ఒక టవల్ ని తీసుకుని గోరువెచ్చటి నీటిలో దానిని ముంచి వార్మ్ కంప్రెస్ ను ప్రయత్నించండి.

7. రెటినాయిడ్స్

7. రెటినాయిడ్స్

యాంటీ ఏజింగ్ కి చెందిన ఒకానొక విటమిన్ రకం కిందకి రెటినాయిడ్స్ అనేవి వస్తాయి. ఇవి ఎన్నో యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ లో లభ్యమవుతాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేందుకు తోడ్పడతాయి. అలాగే స్కిన్ పై హైపర్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తాయి. మొదటిసారి వాడినప్పుడు ఇవి కొంచెం జిడ్డుగా అనిపిస్తాయి. రాను రాను మీ స్కిన్ వీటికి అలవాటు పడుతుంది. వీటి ద్వారా మెరుగైన ఫలితం లభిస్తుంది.

8. బేకింగ్ సోడా

8. బేకింగ్ సోడా

ఇంఫ్లేమేషన్ ను తొలగించేందుకు బేకింగ్ సోడా అమితంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బేకింగ్ సోడా పౌడర్ ను కొంత నీటిలో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయాలి. ప్రభావిత ప్రాంతంపై ఈ మిశ్రమంతో సర్క్యూలర్ మోషన్ లో రబ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా డెడ్ స్కిన్ సెల్స్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే బంప్స్ ని డ్రై చేయడానికి అలాగే ఇన్ఫెక్షన్ ని అరికట్టేందుకు బేకింగ్ సోడా ఉపయోగకరంగా ఉంటుంది.

9. లాగకండి

9. లాగకండి

బంప్స్ ని ట్వీజర్ వంటి పదార్థాలతో లాగడానికి ప్రయత్నించకండి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. హీల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆ తరువాత ట్వీజర్స్ ను వాడి చర్మం లోపల పెరుగుతున్న హెయిర్ ను తొలగించుకోవచ్చు.

10. షేవింగ్ జెల్ ని వాడండి

10. షేవింగ్ జెల్ ని వాడండి

షేవింగ్ ని ప్రయత్నిస్తున్నట్టయితే, మాయిశ్చరైజ్ చేయడం మరచిపోకండి. షేవింగ్ జెల్ ని వాడి లూబ్రికేట్ చేయడం వలన చర్మం హర్ట్ అవదు. చాలా మంది ప్లెయిన్ వాటర్ ని లేదా సాధారణ బాడీ వాష్ జెల్ ని వాడి షేవ్ చేసుకుంటారు. బేబీ ఆయిల్ లేదా కోకోనట్ ఆఈల్ ను వాడడం అనేది గ్రేట్ ఆప్షన్. దీని వలన స్కిన్ కి తగినంత మాయిశ్చర్ లభిస్తుంది. మీకు బంప్స్ అనేవి తలెత్తవు.

Read more about: shaving aloe vera skin care glowing skin home remedies చర్మ సంరక్షణ హోం రెమెడీస్
English summary

How To Deal With Bumps On The Body

Sometimes, shaving and other forms of hair removal that we use may lead to painful bumps on the body. These bumps grow because your hair gets stuck under your skin while it is growing back. Apart from being unsightly, these bumps can really be painful and at times itchy, especially if they grow in the pubic area.
Story first published: Saturday, February 17, 2018, 12:30 [IST]
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X