Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
నోటిచుట్టూ వచ్చే ముడుతల నుండి ఏ విధంగా తప్పించుకోవచ్చు?
నోటిచుట్టూ వచ్చే ముడుతల నుండి ఏ విధంగా తప్పించుకోవచ్చు?
నోటి చుట్టూ వచ్చే లోతైన ముడుతలు, వీటినే "స్మోకర్స్ లైన్స్" అంటారు, చాలామంది మహిళలలో కనిపిస్తాయి.ఇవి అందాన్ని దెబ్బతీసి, ఆత్మవిశ్వాసం తగ్గిస్తాయి. ఆడవారి చర్మాం సున్నితంగా ఉండటం వలన, ఈ సమస్య మగవారి కన్నా ఆడవారిలోనే ఎక్కువగా తలెత్తుతుంది.
అదేసమయంలో, నోటి చుట్టూ వచ్చే ముడుతలకు, మీ ఆనందానికి సంబంధం ఉంది. అదెలా అంటారా? ఎక్కువగా నవ్వటం వలనఈ ముడుతలు లోతుగా ఏర్పడతాయనే నమ్మకమున్నందున, ఇవి మీలో ఆనందానికి ప్రతీక.

ఇవేకాకుండా, ఎందుకు బహిర్గతం అవడం, జన్యుపరమైన లక్షణాలు, చర్మం పొడిబారడం, పోషకాహార లోపం, హఠాత్తుగా బరువు తగ్గడం మరియు ధూమపానం వంటి ఇతర కారణాల మూలంగా కూడా ఈ ముడుతలు ఏర్పడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికిని,వయసు పెరుగుతున్న కొద్దీ, ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా ఇవి కళ్ళు, నుదురు మరియు నీరు వంటి సున్నితమైన భాగాలలో కనిపిస్తాయి.
కనుక, ఈ వ్యాసం ద్వారా, మీకు ఏ విధంగా నోటి చుట్టూ లోతైన ముడుతలను నివారించవచ్చో తెలియజేస్తున్నాం. కొన్ని రకాల గృహవైద్య చికిత్సలతో , ఈ ముడుతలను పూర్తిగా తొలగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాటిని పాటిస్తే, మార్పు మీ ముంగిట్లోనే సాధ్యమవుతుంది.

కలబంద గుజ్జు:
కలబంద గుజ్జును అన్ని రకాల చర్మ మరియు కేశ సమస్యలకు ఏకైక సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా పొడిబారిన చర్మానికి ప్రయోజనకారి. చర్మం పొడిబారడం, ముడుతలకు ముఖ్య కారణం. దీనికి విరుగుడుగా కలబంద గుజ్జును ప్రభావిత ప్రదేశంలో రాసుకుని ముప్ఫై నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి.

తేనె మరియు నిమ్మరసం:
ఈ అద్భుతమైన సమ్మేళనం మానవ శరీరం లోపలి నుండి మరియు బయట నుండి ప్రభావం చూపుతుంది. వీటికి లోతైన ముఫుతలను అరికట్టే సామర్థ్యం ఉంది. వీటిలోని పోషకాలు మరియు విటమిన్లు, మీ చర్మ రూపురేఖలను మెరుగుపరుస్తాయి. నిమ్మరసంలోని సుగుణాలు మీ చర్మం మీది ఫ్రీరాడికల్స్ తో పోరాడి, నష్టం కలుగకుండా చేస్తాయి. తేనె మీ చర్మానికి తేమను అందించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

టమాటో రసం:
టమాటో రసం వయసు పైబడిన ఛాయలను సమర్ధవంతంగా నెమ్మదింపజేస్తుంది. ఇది నోటి చుట్టూ ఏర్పడిన ముడుతలను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా, దీనిలోని విటమిన్ ఎ, సి,బి6, బీటా కేరోటీన్,మరియు లైకోపీన్ మీకు ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తాయి. ప్రభావిత ప్రదేశంలో టమాటో రసంతో మర్దన చేసుకుంటే, రక్తప్రసరణ మెరుగై , కొత్త కణాలు, ఏర్పడతాయి. కొద్ది సమయం అనంతరం, నీటితో ముఖాన్ని కడిగేయాలి. ప్రభావిత ప్రదేశంలో టమాటో రసంతో మర్దన చేసుకోవడమే కాక, తాగితే కూడా అత్యధిక ఫలితాలు ఉంటాయి.

కోడిగుడ్డు తెల్లసొన+కొబ్బరినూనె:
కోడిగుడ్డు తెల్లసొన మరియు కొబ్బరినూనె యొక్క జోడి చర్మాన్ని బిగుతుగా మరియు తేమగా ఉంచుతుంది. మీ నోటి చుట్టూ ముడుతలు ఏర్పడటానికి ప్రధాన కారణం చర్మం పొడిబారడం. ఈ మిశ్రమం, మీ చర్మాన్ని పొడిబారనివ్వకుండా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ గుడ్డు తెల్లసొనలో,బొక్క టీ స్పూన్ కొబ్బరినూనె కలిపి, ప్రభావిత ప్రదేశంలో రాసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి.

బొప్పాయి:
బొప్పాయిలో వయస్సు మీద పడినట్లు కనపడకుండా చేసే లక్షణాలు ఉంటాయి. దీనిలో చర్మం యొక్క సాగే గుణాన్ని పెంపొందించే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి యవ్వనంతో కూడిన మెరుపును చేకూరుస్తుంది. అప్పటికే ఉన్న ముడుతలను తొలగించి, కొత్తగా ముడుతలు ఏర్పడకుండా చేస్తుంది. ప్రభావిత ప్రదేశంలో బొప్పాయి గుజ్జు రాసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి కడిగేయండి.

నోటి చుట్టూ ముడుతలను నివారించడానికి చిట్కాలు:
నోటి చుట్టూ ముడుతలు ఏర్పడకుండా ఉండటానికి మీరు పాటించవలసిన కిన్ని చిట్కాలను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాము.
• ధూమపానం ఈ ముడుతలు ఏర్పడటానికి ఒక ముఖ్య కారణం కనుక, ధూమపానానికి దూరంగా ఉంటే, వీటిని తేలికగా నివారించవచ్చు. .
• ఎండకు ఎక్కువగా బహిర్గతం అవకండి. ఎక్కువ సమయం ఎందుకు గురైతే, వయసు పైబడటం, నోటి చుట్టూ ముడుతలు ఏర్పడటం, వంటివి జరుగుతాయి. మీరు ఒకవేళ తప్పనిసరిగా ఎండలో పని చేయవలసి వస్తే, సన్ స్క్రీన్ క్రీమ్ రాసుకోండి.



Click it and Unblock the Notifications











