For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళ కింద సన్నని ముడుతలు మరియు నల్లని వలయాలు తగ్గేదెలా?

|

నల్లని వలయాలు, సన్నని ముడుతలు, కంటి కింద సంచులు - ఇవి చాలామందిలో సాధారణంగా తలెత్తే సమస్యలు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు లేదా నిద్ర అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి, అధిక ఔషధ ఉపయోగం మొదలైన కారణాల వలన ఈ సమస్యలు పెద్ద మరియు పిన్న అందరిలో కనిపిస్తున్నాయి. నల్లని వలయాలు మరియు సన్నని ముడుతలు గురించి, ప్రత్యేకంగా ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లని వలయాలు మరియు సన్నని ముడుతలు అనగా ఏమిటి?

ముప్పై సంవత్సరాల వయస్సు దాటినాక, సన్నని ముడుతలు లేదా గీతలు, సాధారణంగా కళ్ళు మరియు నోటి చుట్టూ ఏర్పడతాయి. చర్మంలోని కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్, సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావం వలన సహజాంగా విచ్ఛిన్నం అయినందున సన్నని గీతలు ఏర్పడతాయి.

Coffee Under-eye Cream For Fine Lines And Dark Circles

వయస్సు పెరగడం మరియు చర్మం పలుచబడటం వలన నల్లని వలయాలు, స్త్రీ పురుషులలో, కొన్ని సందర్భాల్లో పిల్లలలో కూడా ఏర్పడతాయి. నిద్ర లేకపోవడం, ఒత్తిడి, సూర్యుని ప్రతాపం, వారసత్వం మొదలైనవి ఖచ్చితమైన కారణాలు కావచ్చు.

నల్లని వలయాలు మరియు సన్నని ముడుతల నివారణకు సహజ పరిష్కారాలు:

మీరు కనుక కళ్ళు కింద నల్లని వలయాలు మరియు సన్నని ముడుతల వంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే,ఎప్పుడు సహజ మార్గాల్లో వీటి నివారణకు ప్రయత్నించడం మంచిది. దీనికై మీకు ఉపయోగపడే కొన్ని ఉత్తమ పదార్థాలను గురించి ఇప్పుడు మేము తెలియ చేయబోతున్నాము. ఆలస్యం చేయకుండా చదివేయండి ఇక!

1. దోసకాయ ముక్కలు:

1. దోసకాయ ముక్కలు:

దోసకాయలలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, చల్లదనం అందించే గుణం కలిగి ఉన్నందున, కళ్ళు చుట్టూ ఉబ్బడాన్ని మరియు నల్లని వలయాలను తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కేవలం 4-5 నిమిషాల పాటు, మీ కనురెప్పల మీద సన్నని దోసకాయ ముక్కలను ఉంచుకుని, వాటి చల్లదనాన్ని ఆస్వాదించండి!

2. కలబంద:

2. కలబంద:

యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నందున, మీ రెండు కళ్ళు చుట్టూ కలబంద గుజ్జుని రాసుకోండి.

3. పాలు:

3. పాలు:

పాలలోని విటమిన్ ఎ మరియు విటమిన్ బి 6 , నూతన కణాల నిర్మాణంలో మరియు విటమిన్ బి12 మేనిఛాయను తేలికపరచడంలో సహాయపడతాయి. మీ కళ్లపై పాలల్లో ముంచిన దూది ఉండలను పెట్టుకుని, 15-20 నిమిషాలు పాటు వాటిని అలానే ఉంచుకుని, తరువాత శుభ్రపరచుకోవాలి.

4. బంగాళదుంప:

4. బంగాళదుంప:

అవును, మీరు చదివింది నిజమే! చాలా రకాల భారతీయ కూరలకి రుచిని చేకూర్చే బంగాళాదుంపను చర్మసంరక్షణ కొరకు కూడా వాడవచ్చు. ఇది సహజమైన బ్లీచ్ గా పనిచేసి, మేనిఛాయను తేలికపరచడంలో సహాయపడుతుంది. మీ కళ్ళ చుట్టూ ఉబ్బటం తగ్గుతుంది. ఫ్రిజ్ నుండి తీసిన బంగాళాదుంపలను తురిమి, ఫాని నుండి రసంను వెలికితీయాలి. ఈ రసంలో దూది ఉండలను ముంచి, కళ్ళ మీద 15-20 నిమిషాలు పాటు ఉంచుకోవాలి.

5. చల్లబరిచిన టీ బ్యాగులు:

5. చల్లబరిచిన టీ బ్యాగులు:

చల్లని లేదా రిఫ్రిజిరేటెడ్ టీ బ్యాగులలో ఉన్న కెఫిన్ ఉబ్బిన రక్తనాళాలను సాధారణ స్థితికి తీసుకువస్తుంది. తద్వారా కణజాలంలో నీటి నిలుపుదల తగ్గుతుంది.

6. రోజ్ వాటర్:

6. రోజ్ వాటర్:

రోజ్ వాటర్ లోని చల్లబరిచే గుణం మరియు క్రిమినాశక లక్షణాలు, అలసిన మరియు నిస్తేజమైన కళ్ళకు అద్భుతమైన చికిత్స. చల్లని రోజ్ వాటర్ లో దూది ఉండలను ముంచి, కళ్ళ మీద పెట్టుకుని, 5-10 నిమిషాలు తరువాత శుభ్రం చెసుకుంటే, ప్రభావవంతమైన మరియు తక్షణ ఫలితాలు లభిస్తాయి.

7. పుదీనా ఆకులు:

7. పుదీనా ఆకులు:

పుదీనా ఆకులలోని విటమిన్ సి, చర్మంను ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. వీటిలోని మెంథాల్ చర్మానికి చల్లదనం చేకూర్చి, తాజాదనం చేకూరుస్తుంది. మంచి ఫలితాల కొరకు, క్రమం తప్పకుండా ఈ పద్ధతిని ఆచరించండి.

కాఫీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు:

కాఫీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు:

కాఫీ వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి! ఇది పునరుత్తేజం కలిగించి, క్రుంగబాటును తగ్గిస్తుంది. ఏకాగ్రతతో, చురుకుగా ఉండటాన్ని ప్రోత్సాహిస్తుంది. హృద్రోగ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మనసును తెలికపరచి, కొవ్వును కరిగించి తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కాఫీ తాగితే చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కాఫీ తాగితే చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

కాఫీలో ఉండే వివిధ యాంటిఆక్సిడెంట్లు సమర్థవంతంగా ఫ్రీ రాడికల్స్ తటస్థీకరిచి, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. కాఫీలో ఉండే కెఫిన్ కళ్ళు చుట్టూ ఉండే నల్లని వలయాలు మరియు ఉబ్బడాన్ని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

English summary

Coffee Under-eye Cream For Fine Lines And Dark Circles

Fine lines or wrinkles usually occur around the eyes and mouth, and after the age of thirty. The benefits of coffee are many! The presence of antioxidants in coffee help in neutralizing free radicals and reducing oxidative stress. Caffeine a fantastic option for reducing puffiness around the eyes and dark circles, while enhancing blood circulation.
Story first published: Thursday, July 26, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more