Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ప్రతి రోజూ ఉదయం మేకప్ లేకుండా సహజ సౌందర్యంతో మెరవడానికి చిట్కాలు
ప్రతి రోజూ ఉదయం మేకప్ లేకుండా సహజ సౌందర్యంతో మెరవడానికి చిట్కాలు
కొంతమందికి పగటిపూట మేకప్ ధరించడం ఇష్టం ఉండదు,మరికొందరికి సమయం ఉండదు. మన దైనందిన జీవితంలో చాలా సార్లు మనకు మేకప్ పై దృష్టి సారించడానికి తగిన వీలు చిక్కదు. కానీ మనం గుమ్మం దాటేటప్పుడు ఇతరులకు చూడముచ్చటగా ఉండే వేషధారణ ఎంతైనా ఆవశ్యకం. కాదంటారా?
ప్రతి ఒక్కరు వివిధ మేకప్ చిట్కాలతో ప్రయోగాలు చేసి తమ అందాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఇష్టపడతారు. రకరకాల వన్నెలున్న లిప్ స్టిక్లు,మస్కారాలు,ఐ షాడోలు వాడి చూడాలనే కుతూహలం అందరిలో ఉంటుంది.

ప్రతి సందర్భంలోను అందంగా కనిపించడానికి మేకప్ ధరించాల్సిన అవసరం లేదు. అవును, మీరు చదివింది నిజమే! ఎటువంటి మేకప్ లేకుండా సహజమైన అందంతోనే ఆకట్టుకోవచ్చు.
ఇక్కడ మీరు చూడబోయే చిట్కాలు పొద్దుటి పూట మేకప్ ధరించడానికి తగిన సమయం లేనప్పుడు చాలా ఉపయోగపడతాయి. వీటిని అనుసరిస్తే మేకప్ లేకుండా కూడా మీరు అందాలు విరాజిమ్మవచ్చు.

1. టూత్ బ్రష్ తో మీ పెదవులపై ఉన్న మృత కణాలను తొలగించవచ్చు:
పొద్దుట మీరు బ్రష్ చేసుకున్న తరువాత అదే బ్రష్ తో మీ పెదవులపై సున్నితంగా మర్దన చేయండి. ఇలా చేయడం వలన, మీ పెదవులపై పేరుకున్న మృత కణాలు తొలగిపోయి మెరుపు సంతరించుకుంటాయి. మృదువుగా మర్దన చేయాలని మరువకండి.

2. సున్నితమైన స్క్రబ్ ను ఉపయోగించి మీ ముఖంపైఉన్న మృత కణాలను తొలగించవచ్చు:
మీ చర్మం సహజంగా, తాజాగా మరియు స్వచ్ఛంగా కనిపించడానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. దీనివలన మీ ముఖచర్మం పై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. మృదువైన స్క్రబ్ తో మీ ముఖాన్ని సున్నితంగా మర్దన చేయండి. మర్దన చేయడానికి మసాజర్ లేదా బ్రష్ ను వాడవచ్చు.

3. మీ చర్మం కాంతివంతంగా కనపడేటట్టు చేయండి:
ఇది చాలా ముఖ్యమైన విషయం. చర్మాన్ని మృదువుగా తడుతూ ముఖంపై రాసుకోవాలి. చెక్కిళ్ళను లాగుతూ రాసుకోండి. ఇలా చేస్తే మీ చర్మాన్ని రక్త ప్రసరణ మెరుగై తాజాగా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది.

4. మాయిశ్చరైజర్ రాసుకోండి:
మేకప్ వేసుకున్నా, వేసుకోకున్నా మాయిశ్చరైజ్ చేసుకోవడం తప్పనిసరి! సాధారణమైన మాయిశ్చరైజర్ రాసుకుని, అది చర్మంలోకి పూర్తిగా ఇంకేటట్టు మృదువుగా ఒత్తాలి. మీ పెదవుల మాయిశ్చరైజింగ్ కై లిప్ బామ్ వాడండి.

5. మీ కనుబొమ్మలను పాలిష్ చేసుకోండి:
మీరు మేకప్ ధరించనట్లైతే, ఇలా తప్పక చేయాలి. బయట అడుగు పెట్టేముందు మీ కనుబొమ్మలను తీర్చిదిద్దడం మరువకండి. తయారు అయిన తరువాత మీ కనుబొమ్మలను పైవైపుగా బ్రష్ చేసుకుంటే పాలిష్ చేసినట్లుగా కనిపిస్తాయి.

6. మీ కనురెప్పలను కర్ల్ చేసుకోండి:
మేకప్ లేకుండా సహజంగానే అందంగా కనిపించాలి కనుక మస్కారా రాసుకునే అవకాశం లేదు.ఇలాంటి సమయంలో కనురెప్పలను కర్లర్ తో మెలితిప్పితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెండుసార్లు చేయడం వల్ల రెప్పలు మంచి రూపు సంతరించుకుంటాయి.



Click it and Unblock the Notifications
