For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ హెడ్స్ ని వదిలించుకోవడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలి

మీ చర్మ రంధ్రాలను సమర్ధవంతంగా అడ్డుకొని, వైట్ హెడ్స్ ని తొలగించే ఒక చర్మ సంరక్షణ పదార్ధం యాపిల్ సైడర్ వెనిగర్. ఎసిటిక్ యాసిడ్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ మీ చర్మ రంధ్ర

By Gandiva Prasad Naraparaju
|

చిన్న తెల్ల గడ్డలుగా ఉండే వైట్ హెడ్స్ మీ ముఖం, గడ్డం, నుదుటి భాగంలో తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఈ గడ్డలను మూసిన కోమేడోన్స్ అనికూడా అంటారు. ఇది ప్రకృతి సహజ౦ అయినప్పటికీ, మీ చర్మం అనారోగ్యంగా, అసహ్యంగా కనిపించేట్టు చేస్తాయి.

బ్లాక్ హెడ్స్ లాగా కాకుండా, ఈ గడ్డలు రంధ్రాల లోపల మూయబడి ఉంటాయి. వైట్ హెడ్స్ గా భావించే ఇవి అంత తేలికైన విషయమేమీ కాదు.

how to use apple cider vinegar to get rid of whiteheads

వైట్ హెడ్స్ ని వదిలించుకోవడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలి

చనిపోయిన చర్మ కణాలు, మలినాలు, చర్మ రంధ్రాలు మూసుకుపోయినపుడు ఈ గడ్డలు ఏర్పడతాయి. రంధ్రాలను అడ్డుకోకుండా ఉండడమే ఈ చికిత్సకు ఉత్తమ మార్గం.

మీ చర్మ రంధ్రాలను సమర్ధవంతంగా అడ్డుకొని, వైట్ హెడ్స్ ని తొలగించే ఒక చర్మ సంరక్షణ పదార్ధం యాపిల్ సైడర్ వెనిగర్.

ఎసిటిక్ యాసిడ్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ మీ చర్మ రంధ్రాలను బైటకు పంపి, అద్భుతమైన రీతిలో వైట్ హెడ్స్ సమస్యను నిరోధిస్తాయి.

అంతేకాకుండా, ఈ చర్మ సంరక్షణ పదార్ధాన్ని వైట్ హెడ్స్ చికిత్సకి అనేక మార్గాలలో ఉపయోగిస్తారు. బోల్డ్ స్కై ప్రకయం, మీ చర్మ౦ నుండి వైట్ హెడ్స్ ని తొలగించడానికి మీరు ;ఉపయోగించే యాపిల్ సైడర్ వెనిగర్ మార్గాల జాబితా కోసం మేము ఎదురుచూస్తున్నాము.

దీన్ని అంతే సమానమైన ప్రయోజనాలు కలిగిన సహజ పదార్ధాలతో కలపడం ద్వారా తక్షణ ఫలితాలను పొందవచ్చు. మీచర్మం నుండి వైట్ హెడ్స్ ను తొలగించి, శుభ్రంగా, స్పష్టంగా కనిపించడానికి మీ వారపు చర్మ సంరక్షణ మార్గాలలో ఏదోకటి మార్గాన్ని జతచేయండి.

నిలిచిపోయిన వైట్ హెడ్స్ ని తొలగించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ని ఉపయోగించే అత్యంత అద్భుతమైన మార్గాల గురించి ఇక్కడ చదివి తెలుసుకోండి:

గమనిక: ఈ కింద ఇచ్చిన మిశ్రమాలను మీ ముఖంపై అప్లై చేసేముందు, మీ చర్మ రకానికి ఈ పదార్ధం పడుతుందో లేదో పరీక్షించి ;చూసుకోవడం మంచిది.

1.నీటితో యాపిల్ సైడర్ వెనిగర్

1.నీటితో యాపిల్ సైడర్ వెనిగర్

1 టేబుల్ స్పూన్ డిస్టిల్డ్ వాటర్ తో 4 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి. మీ ముఖంపై ఉన్న వై హెడ్స్ పై ఈ మిశ్రమాన్ని రాయండి. 5 నిమిషాల తరువాత, చల్లని నీటితో ఈ మిశ్రమాన్ని కడిగేయండి.

2.స్త్రాబెర్రీస్ తో యాపిల్ సైడర్ వెనిగర్

2.స్త్రాబెర్రీస్ తో యాపిల్ సైడర్ వెనిగర్

2 పండిన స్త్రాబెర్రీలను మాష్ చేసి, 5-6 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపి పేస్ట్ తయారుచేయండి. మీ ముఖంపై ఉన్న వైట్ హెడ్స్ పై ఈ మిశ్రమ౦తో సున్నితంగా మర్దనా చేయండి. చల్లని నీటితో మీ చర్మాన్ని కడిగేయండి. ఆరిన తరువాత, తేలికపాటి స్కిన్ టోనర్ ని మీ ముఖంపై అప్లై చేయండి.

3.కొబ్బరి నూనె, బేకింగ్ సోడా తో యాపిల్ సైడర్ వెనిగర్

3.కొబ్బరి నూనె, బేకింగ్ సోడా తో యాపిల్ సైడర్ వెనిగర్

1 టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తో ½ టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని, చిటికెడు బేకింగ్ సోడా ని కలపండి. మీ ;చర్మంపై ఉన్న వైట్ హెడ్స్ పై ఈ మిశ్రమాన్ని పూయండి. కొన్ని నిమిషాల తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

4.బ్రౌన్ షుగర్, నిమ్మరసం తో యాపిల్ సైడర్ వెనిగర్

4.బ్రౌన్ షుగర్, నిమ్మరసం తో యాపిల్ సైడర్ వెనిగర్

1 టీస్పూన్ బ్రౌన్ షుగర్, 2 టీస్పూన్ల నిమ్మరసంతో ½ టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి. మీ ముఖంపై ఉన్న వైట్ హెడ్స్ పై ఈ మిశ్రమాన్ని పూయండి. తడి బట్టతో తుడిచే ముందు 5 నిమిషాల పాటు వదిలేయండి.

5.ఓట్మీల్ & గ్రీన్ టీ తో యాపిల్ సైడర్ వెనిగర్

5.ఓట్మీల్ & గ్రీన్ టీ తో యాపిల్ సైడర్ వెనిగర్

4-5 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్, 2 టీస్పూన్ల ఓట్మీల్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ కలిపి మిశ్రమంలా తయారుచేయండి. సమస్య ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయండి. కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

6.ఆలివ్ ఆయిల్ తో యాపిల్ సైడర్ వెనిగర్

6.ఆలివ్ ఆయిల్ తో యాపిల్ సైడర్ వెనిగర్

2-3 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తో 4-5 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి. ప్రభావిత ప్రదేశంలో ఈ ఫలితాన్ని ఇచ్చే మిశ్రమాన్ని రాయండి. కొద్ది నిమిషాల పాటు అలా వదిలేసి, మీ చర్మాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి.

7.శాండల్ వుడ్ పౌడర్, అలోవేర జెల్ తో యాపిల్ సైడర్ వెనిగర్

7.శాండల్ వుడ్ పౌడర్, అలోవేర జెల్ తో యాపిల్ సైడర్ వెనిగర్

5-6 చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్, ½ టీస్పూన్ శాండల్ వుడ్ పౌడర్, 3 టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. మీ ముఖ చర్మంపై ఈ పదార్ధాన్ని రాసి, 5-10 నిమిషాల పాటు ఉండేట్టు చూడండి. తరువాత, శుభ్రమైన తడి బట్టతో ఈ మిశ్రమాన్ని తుడవండి.

English summary

how to use apple cider vinegar to get rid of whiteheads | benefits of apple cider vinegar in skin care

The best way to treat whiteheads is by unclogging your pores.One skin care ingredient that can effectively unblock your skin pores, thereby banishing whiteheads, is apple cider vinegar.
Story first published:Monday, January 8, 2018, 12:30 [IST]
Desktop Bottom Promotion