For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి వినియోగం

మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి వినియోగం

|

సాధారణంగా మొటిమలు అనేవి, జీవితంలో కనీసం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే గడ్డు పరిస్థితిగా ఉంటుంది. కొంతమందికి దీర్ఘకాలిక సమస్యగా మిగిలిపోతే, కొందరికి వయసు దాటే కొద్దీ కనుమరుగవుతుంటాయి. మొటిమలకు ప్రధాన కారణం సెబాషియస్ గ్రంథుల నుండి స్రవించే అధిక చమురు. దీనిని సెబమ్ అని పిలుస్తారు. సెబమ్ చర్మంపై అధికంగా విస్తరించినప్పుడు, అది చర్మ రంధ్రాలకు అడ్డం పడుతుంది. ఈ అడ్డుపడే రంధ్రాలు సుదీర్ఘకాలం అపరిశుభ్రంగా ఉన్న ఎడల, క్రమంగా చర్మం పగుళ్ళకు మరియు మొటిమలకు దారితీస్తుంది.

మొటిమలు మరియు చర్మం బ్రేక్అవుట్లకు(పగుళ్ళు) కారణమయ్యే కొన్ని కారకాలుగా అపరిశుభ్రత, అసంబద్దమైన ఆహారం, హార్మోన్ల అసహజ మార్పులు, కొన్నిరకాల వ్యాధులు మొదలైనవిగా ఉన్నాయి. కావున తీవ్ర సమస్యలకు దారితీసే ముందుగానే మొటిమలకు సకాలంలో చికిత్స తీసుకోవడం అవసరం.

How To Use Garlic To Treat Pimples

ఈ వ్యాసంలో, మీకు అత్యంత సాధారణ వంటగది పదార్ధమైన, వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా మొటిమల నుండి ఎలా ఉపశమనం పొందవచ్చో చెప్పబడింది. వెల్లులి మొటిమలకు గొప్ప నివారణా మార్గంగా ఉంది. వెల్లుల్లి, బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే, వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్ వలె పనిచేస్తాయి, క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.

1. వెల్లుల్లి మరియు యోగర్ట్ :

1. వెల్లుల్లి మరియు యోగర్ట్ :

యోగర్ట్లో ఉండే లాక్టిక్ యాసిడ్, మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మం మీద పగుళ్ళను, మొటిమలను నివారించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

కావలసిన పదార్ధాలు :

4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు

1 టేబుల్ స్పూన్ యోగర్ట్

తయారుచేసే విధానం :

వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి, అందులో తాజా యోగర్ట్(లేదా పెరుగు) ఒక టేబుల్ స్పూన్ చేర్చండి మరియు ఈ పదార్ధాలను మిశ్రమంగా చేయండి. ప్రభావిత ప్రాంతాల్లో, శాంతముగా కనీసం ఒక నిమిషం పాటు మర్దన చేసి, కొన్ని నిమిషాలు వదిలివేయండి. పొడిగా మారిన తర్వాత, శుభ్రమైన చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచండి.

2. వెల్లుల్లి మరియు వెనిగర్ :

2. వెల్లుల్లి మరియు వెనిగర్ :

వెనిగర్ యొక్క శోథ నిరోధక తత్వాల కారణంగా, చర్మం మీద ఎటువంటి వాపునైనా తగ్గించడంలో సహాయపడగలవు. చర్మం యొక్క pH బ్యాలెన్స్ను నిర్వహించడంలో వెనిగర్ సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు

4 టేబుల్ స్పూన్లు వెనిగర్

తయారుచేసే విధానం :

వెల్లుల్లి రెబ్బలను మిక్స్ చేసి, అందులో వెనిగర్ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. మొటిమల ప్రభావిత ప్రాంతాల్లో దీన్ని వర్తించండి. ఈ మిశ్రమాన్ని దరఖాస్తు చేయడానికి ఒక కాటన్ బాల్ వినియోగించవచ్చు. ముఖం మీది మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు వదిలివేయండి, పొడిబారిన తర్వాత ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని అనుసరించవచ్చు.

Most Read:దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...Most Read:దసరా నవరాత్రులు: దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు ...

3. వెల్లుల్లి మరియు అలోవెరా (కలబంద) :

3. వెల్లుల్లి మరియు అలోవెరా (కలబంద) :

అలోవేరా, చర్మాన్ని చికాకు, వాపు, మొటిమల బారినుండి రక్షించడంలో, మరియు పూర్తిస్థాయిలో నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ముఖం మీద డార్క్ సర్కిల్స్, మృత కణాలను తొలగించడంలో ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

కావలసిన పదార్ధాలు :

3 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు

2 స్పూన్ల తాజా కలబంద గుజ్జు

తయారుచేయు విధానం :

వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. ప్రభావిత ప్రాంతాల్లో దీన్ని వర్తించి, 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో ఒకసారి అనుసరించండి.

4. వెల్లుల్లి మరియు ఎగ్ వైట్ (తెల్లగుడ్డు) :

4. వెల్లుల్లి మరియు ఎగ్ వైట్ (తెల్లగుడ్డు) :

ఎగ్ వైట్లో, చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు మరియు పోషకాలతో నిండి ఉంటాయి.

కావలసిన పదార్ధాలు :

4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు

1 ఎగ్ వైట్

తయారుచేసే విధానం :

ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్ను తెల్ల గుడ్డుకు జోడించి మిశ్రమంలా కలపండి. మొటిమల ప్రభావిత ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని వర్తించండి. కొన్ని నిమిషాల పాటు పొడిగా మారే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక, సాధారణ నీటితో కదిగివేయండి.

Most Read:యోని ఆకారంలోని కామెల్ టోయ్ ప్యాంటీలంటే పడి చచ్చిపోతున్నారు, చూస్తే మీరూ టెంప్ట్ అవుతారు Most Read:యోని ఆకారంలోని కామెల్ టోయ్ ప్యాంటీలంటే పడి చచ్చిపోతున్నారు, చూస్తే మీరూ టెంప్ట్ అవుతారు

5. వెల్లుల్లి మరియు ఆలివ్ ఆయిల్ :

5. వెల్లుల్లి మరియు ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ నూనె చర్మం మీద వాపును చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు రంధ్రాల తీసివేయడంలో ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

4 నుండి 5 వెల్లుల్లి లవంగాలు

4 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె

తయారుచేసే విధానం :

వెల్లుల్లి రెబ్బల తొక్కను తీసివేసి, అందులో ఆలివ్ ఆయిల్ జోడించి బ్లెండర్లో బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ మొటిమల ప్రభావిత ప్రాంతంలో వర్తించి, 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక చల్లని నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో కనీసం రెండు సార్లు చేయండి.

గమనిక : ఈ మిశ్రమాలలో మీకు అనువైన దానిని ఎంచుకుని, అనుసరించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆహార, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Garlic To Treat Pimples

All of us would have faced the problem of pimples or acne at least once in our life. The main cause of pimples is the excess oil produced by the sebaceous glands, called sebum. When sebum gets accumulated on the skin it leads to clogged pores. Garlic possesses antibacterial, antifungal and antiseptic properties that help in killing the bacteria causing pimples.All of us would have faced the problem of pimples or acne at least once in our life. The main cause of pimples is the excess oil produced by the sebaceous glands, called sebum. When sebum gets accumulated on the skin it leads to clogged pores. Garlic possesses antibacterial, antifungal and antiseptic properties that help in killing the bacteria causing pimples.
Desktop Bottom Promotion