For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంపరపనస-పంచదార స్క్రబ్ ను చర్మ సంరక్షణ కొరకు ఎలా ఉపయోగపడుతుంది?

పంపరపనస-పంచదార స్క్రబ్ ను చర్మ సంరక్షణ కొరకు ఎలా ఉపయోగపడుతుంది?

|

ప్రతి ఒక్కరూ మచ్చలేని మెరిసే చర్మాన్ని కోరుకున్నప్పటికి, అది అందరికీ లభించదు. దీనికి తోడు, కాలుష్యం, సూర్యుడి హానికరమైన కిరణాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తీసుకోవడం, ఒత్తిడి మొదలైన కారణాలు, మీ చర్మంను మరీంత అధ్వాన్నంగా, అనారోగ్యకరంగా, పొడిగా మరియు నిర్జీవంగా తయారు చేస్తాయి. చర్మంపై మృతచర్మ కణాలు పేరుకుపోవడం వలన పొడిగా, నిస్తేజంగా మరియు నల్లగా మారుతుంది. కనుక, మీ చర్మం ఆరోగ్యంగా, శుభ్రంగా, స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా కనపడాలంటే సరైన సంరక్షణ అవసరం.

మన చర్మంను ప్రకాశవంతంగా మార్చడానికి అనేక పండ్లను ఉపయోగించవచ్చు. ఖరీదైన ఉత్పత్తులు మరియు లోషన్ల పై చాలా ఖర్చు చేయడానికి బదులుగా, మీ చర్మసమస్యల చికిత్సకు పండ్లను వాడవచ్చు. పండ్లలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని మెరుగుపరిచి, కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెలనిన్ ఉత్పత్తిని (చర్మంను నల్లగా మార్చే వర్ణద్రవ్యం) నిరోధిస్తాయి.

పంపరపనస నిమ్మజాతి పండు, ఇది పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీనిని హిందీలో "చకోత్ర" అని పిలుస్తారు. చైనా, ఫ్లోరిడా, కాలిఫోర్నియా మరియు ఇతర మధ్యస్థ ఉష్ణమండల దక్షిణ రాష్ట్రాల్లో ఇవి విస్తృతంగా పండించబడుతున్నాయి. పంపరపనసలో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటిఆక్సిడెంట్లు ఉన్నాయి, వీటిని సముచితంగా వినియోగిస్తే, చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి.

How To Use Grapefruit Sugar Scrub For Skin Brightening

వివిధ రకాల పండ్లను ఉపయోగించి, మీ చర్మం ప్రకాశించేట్టు చేసే వివిధ గృహాచికిత్సా నివారణలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు మనం ఇంట్లో తయారు సులభంగా చేసుకోగలిగే పంపరపనస- పంచదార స్క్రబ్ గురించి తెలుసుకుందాం! ఇది మీ చర్మాన్ని శుభ్రం చేయడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. చదివి, ప్రయత్నించండి మరి!

చర్మం ప్రకాశవంతంగా చేసుకోవడం కొరకు ఇంటిలో తయారు చేసుకోగలిగే పంపర పనస, పంచదార స్క్రబ్:

 కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

• ½ కప్పు చక్కెర

• 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

• 1 టేబుల్ స్పూన్ తేనె యొక్క

• 2 చుక్కల నిమ్మ సుగంధ తైలం

• 2 చుక్కల పంపర పనస సుగంధ తైలం

• 1 పంపర పనస పండు

తయారీ విధానం:

తయారీ విధానం:

• ఒక శుభ్రమైన గిన్నెలో చక్కెర, తేనె కలపాలి.

• ఇప్పుడు తేనె మరియు చక్కెర మిశ్రమానికి కొబ్బరి నూనె, సుగంధ తైలాలను కలిపి, ఆపై సగం పంపర పనస పండు రసాన్ని అందులో పోయండి.

• అన్ని పదార్ధాలను బాగా కలపండి.

గమనిక:

గమనిక:

మీరు పంపర పనస- చక్కెర స్క్రబ్ ను ఉపయోగించాలను కున్నట్లయితే, అదే రోజు మీరు దాన్ని తయారు చేయాలి. తాజాగా పిండిన పంపర పనస రసంను ఉపయోగించాలి. కానీ మీరు స్క్రబ్ ను నిల్వ చేసి, తరువాత ఉపయోగించుకోవాలని అనుకున్నట్లైతే, అప్పుడు రసంను వాడకుండా కేవలం పంపర పనస సుగంధ తైలం మాత్రమే వాడండి. రసం కలిపి నిలువ చేస్తే, స్క్రబ్ పాడవుతుంది.

వాడే విధానం:

వాడే విధానం:

• మీ శరీరం అంతటికీ ఈ స్క్రబ్ ను పట్టించి, 5-10 నిమిషాలు పాటు వలయాకార కదలికలతో మృదువుగా మర్దన చేసుకోండి.

• ఇప్పుడు, నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకుని, మీ చర్మంను పొడిగా తుడుచుకోండి.

• ప్రకాశవంతమైన చర్మం పొందడానికి ప్రతి వారం ఈ స్క్రబ్ ను ఉపయోగించండి.

ఇది ఎందుకు పని చేస్తుంది?:

ఇది ఎందుకు పని చేస్తుంది?:

పంపర పనస, యాంటిఆక్సిడెంట్ గా పనిచేసే, విటమిన్ సి కలిగి ఉంటుంది కనుక ఇది కొల్లాజన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మానికి బిగుతుగా మారుస్తుంది. దీనిలోని రెటినోల్ అనే యాంటీఆక్సిడెంట్ , మీ చర్మంను మృదువుగా చేయడానికి దోహదపడుతుంది. దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి కోల్కొనేలా చేసి, పిగ్మెంటేషన్ సమస్యను నయం చేస్తుంది.

పంపర పనసలోని సాల్సిలిక్ ఆమ్లం కూడా మృతచర్మకణాలను తొలగిస్తుంది. పంపర పనస, డిటాక్సిఫై చేయటానికి, మృతచర్మకణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది.

చక్కెర విషయానికి వస్తే,

చక్కెర విషయానికి వస్తే,

ఇక చక్కెర విషయానికి వస్తే, చిన్న చిన్న రేణువుల కారణంగా, ఇది ఒక అద్భుతమైన ఎక్సఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఇది మృతచర్మ కణాలను తొలగించి, కింద ఉండే ఆరోగ్యకరమైన చర్మంను బహిర్గతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, చర్మంకు రక్త సరఫరాను మెరుగుపరిచి , తేమను చేకూరుస్తుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఇది చర్మంను తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ నూనెలోని లారిక్ ఆమ్లం, బ్యాక్టీరియాను చంపడానికి దోహదపడుతుంది. ఇది కూడా మేనిఛాయను తెలికపరచడానికి ఉపయోగపడుతుంది.

తేనెలోని బ్లీచింగ్ లక్షణాలు

తేనెలోని బ్లీచింగ్ లక్షణాలు

తేనెలోని బ్లీచింగ్ లక్షణాలు మేనిఛాయను తేలికపరిచేందుకు సహాయం చేస్తుంది. తేనెలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు, చర్మంపై బాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. తేనె మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరచి, చర్మాన్ని వివిధ సమస్యల నుండి చర్మంను రక్షిస్తుంది.

తేనెలో ఉండే కొన్ని ఎంజైములు, కణ పునరుత్పాదనను ప్రోత్సహించి, మేనిఛాయను తేలికపరచడానికి సహాయపడతాయి. ఇది సహజంగానే తేమను చేకూరుస్తున్నందున, చర్మం తేమగా, మెరుస్తూ మరియు మృదువుగా కనపడుతుంది.

సుగంధ తైలాలు

సుగంధ తైలాలు

సుగంధ తైలాలు, మొక్కల నుండి తీయబడిన గాఢమైన నూనెలు. ఈ నూనెలు సమస్యలు లేని, ప్రకాశించే చర్మాన్ని అందించడానికి సహాయపడతాయి. కానీ మీరు వీటిని వాడటానికి ముందు, ప్యాచ్ పరీక్ష చేసి, మీ చర్మానికి అవి నప్పుతాయో, లేదో నిర్ధారించుకోండి. ఎందుకంటే ఇవి కొన్నిసార్లు, అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి.

ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ లలో

ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ లలో

మీరు ఇంట్లో తయారుచేసిన స్క్రబ్ లలో పంపర పనస తొక్కలను కూడా ఉపయోగించవచ్చు. పంపర పనస తొక్కలు, మృతచర్మకణాలను తొలగించి, కొత్త కణాలు ఏర్పడటానికి కూడా సహాయపడతాయి. పంపర పనస ఉన్న పొటాషియం ఒక అతినీలలోహిత కిరణాల నుండి కాపాడే కవచంగా పనిచేస్తుంది మరియు చర్మంపై ముడుతలు మరియు సున్నితమైన గీతలను పోగొడుతుంది.

English summary

How To Use Grapefruit Sugar Scrub For Skin Brightening

Not everybody is blessed with a flawless skin. And to add to that, we have other factors that make our skin worse, like pollution, harmful rays of the sun, unhealthy and improper diet, less intake of water, stress and so on. All these factors cause our skin to look unhealthy, dark, dehydrated and dull. The skin becomes dry, dull and pigmented mainly due to the accumulation of dead skin cells. So, a proper care is necessary in order to keep your skin looking healthy, clean, clear and bright
Desktop Bottom Promotion