For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ తో పొడిబారిన చర్మానికి చెక్ పెట్టొచ్చు..

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ తో పొడిబారిన చర్మానికి చెక్ పెట్టొచ్చని తెలుసా

|

హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పొడిబారిన చర్మాన్ని పునరుద్దరించేందుకు సహాయపడగల ఆరెంజ్ ఫేస్ ప్యాక్ గురించిన వివరాలను తెలుసుకుందాం. అనేకరకాల పండ్లు చర్మ సమస్యల దృష్ట్యా వివిధ ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మనకు తెలుసు.

How To Use Orange For Dry Skin?

క్రమంగా మనలో అనేకమంది, రసాయనాల దుష్ప్రభావాలతో కూడుకున్న కాస్మోటిక్స్ బదులుగా పండ్ల ఆధారిత ఫేస్ ప్యాక్లకు మారుతున్నారు. ఇవి చర్మానికి గ్లో అందివ్వడమే కాకుండా, అనేకరకాల సమస్యలకు పరిష్కారంగా కూడా ఉన్నాయి. అటువంటి పండ్లలో ఆరెంజ్ కూడా ఒకటి. పొడిబారిన చర్మాన్ని పునరుద్దరించడంలో సహాయపడే ఆరెంజ్ ఫేస్ ప్యాక్ మరియు దాని ప్రయోజనాలను గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ కోసం మనకు అవసరమయ్యే పదార్ధాలు :

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ కోసం మనకు అవసరమయ్యే పదార్ధాలు :

1/2 ఆరెంజ్ పల్ప్

2 టీస్పూన్స్ పెరుగు

ఆరెంజ్ ఫేస్-ప్యాక్ తయారీ విధానం :

ఆరెంజ్ ఫేస్-ప్యాక్ తయారీ విధానం :

ఒక గిన్నెలో సగానికి కోసిన నారింజ పల్ప్ తీసుకుని అందులో పైన సూచించిన మొత్తంలో పెరుగు లేదా యోగర్ట్ కలపండి. పూర్తిగా పదార్ధాలన్నీ మిశ్రమం అయ్యేలా మృదువుగా కలపండి.

మీ ముఖం మరియు మెడ మీద ఈ ముసుగును నలుపక్కలా విస్తరించునట్లు వర్తించి, 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి.

తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగి, తువాలుతో పొడిగా చేయండి.

 ఆరెంజ్ ఫేస్ ప్యాక్ పొడి చర్మాన్ని పునరుద్దరించడానికి ఎలా పనిచేస్తుంది ?

ఆరెంజ్ ఫేస్ ప్యాక్ పొడి చర్మాన్ని పునరుద్దరించడానికి ఎలా పనిచేస్తుంది ?

మీ పొడి చర్మాన్ని చల్లబరచి, సడలించడం ద్వారా ప్రభావాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మృదువైన మరియు మెరిసే ప్రకాశవంతమైన ఛాయని అందిస్తుంది.

నారింజ :

నారింజ :

నారింజ మీ చర్మానికి సహజసిద్దమైన బ్లీచ్ వలె పనిచేస్తుంది. క్రమంగా చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. రసాయన దుష్ప్రభావాలతో కూడిన బ్లీచ్ అనుసరించడం కన్నా, ఈ సహజ సిద్దమైన పదార్ధం ఏంతో ఉత్తమంగా పనిచేయగలదు.

ఇది చర్మాన్ని తాజాగా, మరియు ప్రకాశవంతంగా చేయడమే కాకుండా, విషతుల్య కణాలను తొలగించడంలో సహాయం చేసే డీటాక్సిఫై లక్షణాలను కలిగి ఉంటుంది.

నారింజ సిట్రస్ పండ్ల వర్గానికి చెందింది, క్రమంగా ఇది ఆక్నే సమస్యలను నివారించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ సహజ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది మరియు మొటిమలను పొడిగా చేసి తగ్గించడంలో.

పెరుగు :

పెరుగు :

• మీ చర్మాన్ని శుద్ధి చేసి, సహజ సిద్దమైన తేజస్సును అందిస్తుంది.

• వృద్ధాప్య చాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.

• మీ చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, మృతచర్మాన్ని తొలగించడంలో సహాయం చేస్తుంది.

• మీ టాన్ తొలగించడంలో సహాయపడుతుంది.

• ముడతలను, వలయాలను తొలగిస్తుంది.

• మచ్చలను తగ్గిస్తుంది.

పొడిబారిన చర్మానికి తిరిగి జీవంపోసేలా సహాయపడే ఈ నారింజ ఫేస్ ప్యాక్ని కనీసం వారానికి ఒకసారి అనుసరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందగలరని సూచిస్తున్నాము. ఏదిఏమైనా మీ ఆహార అలవాట్లు, వ్యాయామ, జీవన శైలి విధానాలు కూడా ప్రామాణికంగా ఉంటాయని మరచిపోకండి.

English summary

How To Use Orange For Dry Skin?

The winter season is here and so is the need to give a little extra pampering to your skin. This is the time when your skin becomes dry and flaky, thus making it look dull and lifeless. Moisturisers play an important role in protecting your skin from the winters. But you also need to take care of your skin with other alternatives.So in this article, we'll be introducing some basic winter face packs using orange. You can get variants of orange during the winters that are comparatively sweeter than the regular ones.
Desktop Bottom Promotion