For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ డి-టానింగ్ కోసం టమోటాను ఎలా ఉపయోగించాలి?

|

సహజసిద్ధమైన చర్మపు వర్ణాన్ని మనమందరం కోల్పోవటమే మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద చర్మపు సమస్య. సూర్యుని నుండి వెలువడుతున్న వేడి మన చర్మాన్ని తాగడం వల్ల మన చర్మం యొక్క వర్ణాన్ని కోల్పోవడమే కాక, ఇతర చర్మ సమస్యలైన పిగ్మెంటేషన్, పొడిచర్మం, మచ్చలు వంటివి ఇంకెన్నో ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి మార్కెట్లో దొరికే సన్స్క్రీన్ లోషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి మీ సమస్యలను పూర్తిగా మాత్రం పరిష్కరించలేదు.

మీరు ఇతర చర్మ సమస్యలను దూరం చేసే పరిష్కార మార్గాలను కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించడంవల్ల మీ స్కిన్ టాన్ను సమర్థవంతంగా & శాశ్వతంగా నిర్మూలించడంలో సహాయపడగలదు. అందుకోసం మీ వంటగదిలోనే సరైన పరిష్కార మార్గాలు కలిగిన కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిగి ఉన్నాయి, అందులో టమాటా ఉందని తెలిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు !

How To Use Tomato For De-tanning The Skin?

టమోటాకు అనేక సౌందర్య ప్రయోజనాలను కలుగచేసే లక్షణాలను కలిగి ఉన్నది, అందువల్ల దీనిని ఫేస్ ప్యాక్స్ & మాస్క్లలో ఎక్కువగా వాడతారు. టమోటాలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని తేమగా & హైడ్రేటింగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ టమోటాలో విటమిన్-సి అధికంగా ఉన్న కారణంగా చనిపోయిన చర్మకణాలను తొలగించి, మీ చర్మాన్ని కాపాడటంలో బాగా సహాయపడుతుంది. ఈ టమోటాను మీరు తరచుగా ఉపయోగించినప్పుడు, సన్-టాన్ను తొలగించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.

1. టమోటా + పెరుగు

1. టమోటా + పెరుగు

కావలసినవి :

1 టమోటా (మీడియం సైజులో ఉన్న)

1 టేబుల్ స్పూన్ పెరుగు

తయారీ విధానం :

మొదటగా టమోటాను రెండు ముక్కలుగా చేసి, మైక్రోవేవ్లో పెట్టి కొన్ని సెకన్లపాటు వేడి చేయాలి. ఆ తర్వాత దానిని చల్లార్చి మెత్తని పేస్టులా తయారు చేసుకున్నాక దానికి పెరుగును కూడా జోడించి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని మెడ & ముఖ భాగాలలో అప్లై చేసి, ఒక 20 నిమిషాలపాటు అలాగే బాగా ఆరనివ్వాలి. చివరిగా, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకుని మీ ముఖాన్ని పొడిగా మార్చుకోవాలి.

2. టమోటా + బంగాళదుంప

2. టమోటా + బంగాళదుంప

కావలసినవి :

టమోటా ¼ భాగం

1 బంగాళాదుంప

తయారీ విధానం :

బంగాళదుంప & టమాటాల పై ఉన్న తొక్కను తీసేసి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలన్నింటిని గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి.

ఇలా తయారైన మిశ్రమాన్ని పరిశుభ్రమైన కాస్మెటిక్ బ్రష్తో మీ ముఖము & మెడ భాగాలలో సమాంతరంగా అప్లై చేసుకోవాలి. 30 నిమిషాలపాటు ఈ ఫేస్ ప్యాక్ ను బాగా ఆరినిచ్చిన తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మీరు బయట వాతావరణం నుంచి ఇంటికి వచ్చిన ప్రతిరోజు ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించడం చాలా మంచిది. ఈ ఫేస్ ప్యాక్ ను మొదటిసారి ఉపయోగించినప్పుడు మీ చర్మంపై కాస్త చికాకు కల్గించవచ్చు కానీ మీరు ఏ మాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

3. టమోటా - నిమ్మరసం - ఓట్మీల్

3. టమోటా - నిమ్మరసం - ఓట్మీల్

కావలసినవి :

1 టేబుల్ స్పూన్ టమోటా రసం

1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

1 టేబుల్ స్పూన్ ఓట్మీల్

తయారీ విధానం :

టమోటా నుంచి తాజా రసాన్ని సేకరించాలి. దానికి నిమ్మరసాన్ని కలపాలి. ఓట్మీల్ను శుభ్రం చేసుకొని, దానిని గ్రైండర్లో వేసి పొడిగా చేసుకోవాలి. చివరిగా ఈ మూడు పదార్థాలను బాగా కలిపి చిక్కని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

ఈ ప్యాక్ను మీ శుభ్రమైన ముఖము & మెడ భాగాలలో అప్లై చేయాలి. ఈ ప్యాక్ను అప్లై చేసేటప్పుడు మీ చేతివేళ్ల సహాయంతో మీ ముఖంపై కొన్ని సెకన్లపాటు వృత్తాకార కదలికలు నెమ్మదిగా స్క్రబ్ చేయండి. 15-20 నిమిషాలపాటు బాగా ఆరిన తరువాత మీ ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. సన్ టాన్ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం కోసం వారంలో ఒక్కసారి ఈ చిట్కాను అమలుపరచండి.

4. టమోటా - శనగపిండి - తేనె - పెరుగు

4. టమోటా - శనగపిండి - తేనె - పెరుగు

కావలసినవి :

1 టమోటా

2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి

1 టేబుల్ స్పూన్ పెరుగు

½ స్పూన్ తేనె

తయారీ విధానం :

టమాటాని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని, దానికి శనగపిండి + తేనె + పెరుగును కలిపి బాగా మిక్స్ చేయాలి.

మీ ముఖం & మెడ భాగాలలో ఈ మందపాటి ప్యాక్ను ఒక పొరలా ఉండేలా అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఫేస్ ప్యాక్ బాగా ఆరేంత వరకు వేచి ఉన్న తర్వాత సాధారణమైన నీటితో మీ శరీర భాగాలను శుభ్రం చేసుకోండి.

5. టమోటా + దోసకాయ

5. టమోటా + దోసకాయ

కావలసినవి :

1 టమోటా

½ దోసకాయ

కొన్ని చుక్కల పాలు

తయారీ విధానం :

మొదటిగా మీరు టమోటాను & దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఒక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

ఒక దూది పింజను ఈ పేస్ట్ లోకి ముంచి, మీ ముఖము & మెడ భాగాలలో అప్లై చేయండి. 15 నిమిషాలపాటు బాగా ఆరనిచ్చిన తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించవచ్చు.

English summary

How To Use Tomato For De-tanning The Skin?

Skin tan is one of the most common skin issues that all of us face. One should also use other remedies alternatively that will help in getting rid of tans permanently and effectively. Tomato can be used for solving this issue. Being a rich source of Vitamin C, it helps in removing the dead skin cells and brightening the skin.
Story first published: Monday, August 6, 2018, 14:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more