For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిడ్డు చర్మంతో భాదపడుతున్నారా? పసుపుతో ఈ పద్దతులను అనుసరించండి.

|

ఈ ప్రపంచంలో ఎవరు కూడా జిడ్డు చర్మాన్ని కోరుకోరు, అలాంటిది ప్రతిరోజూ అదే సమస్యతో జీవనాన్ని కొనసాగించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ఒక జిడ్డు చర్మంతో వ్యవహరించాలి అంటే, మనం అందం, ఇతరులతో వ్యవహరించే విధానం, నడవడిక వంటి అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఈ జిడ్డు చర్మం భాదితులు అయిన ఎడల, దాన్ని వదిలించుకోవడానికి పరిష్కార మార్గాలను చూడక తప్పదు. జిడ్డుగల చర్మం మరిన్ని క్రిములను ఆకర్షించి, బాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్రమంగా మొటిమలు వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఒకవేళ మీకు సమస్య ఇదివరకే ఉంటే, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

కానీ మీ వంటగదిలో కొలువు తీరిన అనేక ఉపయోగరమైన అంశాలలో ఒకటి ఈ విషయంలో మీకు ఉత్తమంగా సహాయపడుతుందని తెలుసా ? అవును, అది మరేదో కాదు పసుపు.

How To Use Turmeric For Oily Skin?

పసుపు స్వతహాగానే అనేక ఔషధ విలువలను కలిగి ఉంటుంది, ఆహారంలో రుచి మరియు రంగును జోడించడం దగ్గర నుండి, గాయాలను తొలగించుటలో మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది కూడా.

జిడ్డు చర్మానికి పసుపు యొక్క ప్రయోజనాలు :

జిడ్డు చర్మానికి పసుపు యొక్క ప్రయోజనాలు :

• ఇది మీ చర్మానికి మరింత హాని కలిగించే బ్యాక్టీరియా ఉత్పత్తికి దారితీసే చర్మరంధ్రాలను మరియు బ్రేక్అవుట్లను వదిలించుకోవడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. • చర్మాన్ని శుభ్రపరచే క్లెన్సర్ వలె పనిచేస్తుంది. • మీ చర్మంమీద అధికంగా పేరుకుని పోయిన జిడ్డును తొలగించి, ముఖాన్ని తాజాగా ఉంచడంలో సహాయం చేస్తుంది. • శ్లేషపటలం నుండి నూనెల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా చర్మంపై జిడ్డు చేరకుండా నివారించడంలో పసుపు సహాయపడుతుంది.

జిడ్డు చర్మం కోసం పసుపుతో కూడిన వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ :

జిడ్డు చర్మం కోసం పసుపుతో కూడిన వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ :

పసుపు, నిమ్మరసం మరియు సెనగ పిండి ఫేస్ ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి

• 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

• 2-3 టేబుల్ స్పూన్లు సెనగ పిండి

 తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

1. ఒక గిన్నె తీసుకొని పసుపు, సెనగ పిండి, నిమ్మ రసం వేసి కలపండి.

2. తదనుగుణంగా పాక్షికంగా నీటిని వేసి మందపాటి మిశ్రమం వచ్చేలా కలపండి. నీటి పరిమాణం ఎక్కువ కాకూడదని నిర్ధారించుకోండి, లేనిచో మిశ్రమం మెడ భాగాలకు కూడా చేరి అసౌకర్యం కలిగిస్తుంది.

3. ముఖం మీద ఫేస్ ప్యాక్ బ్రష్ సహాయంతో మిశ్రమాన్ని వర్తించండి. 12 నుండి 15 నిముషాల పాటు అలాగే వదిలివేయండి.

4. ముఖంపై మిశ్రమం పొడిబారిన తర్వాత, చల్లటి నీటితో సున్నితంగా కడిగి, ఒక టవల్తో ముఖం మీది నీటిని తొలగించండి.

5. వారానికి కనీసం రెండుసార్లు, ఈ పద్దతిని అనుసరించిన ఎడల మీ చర్మం మీద జిడ్డు తగ్గుదలను గమనించవచ్చు.

6. హెచ్చరిక - కొందరు వ్యక్తులు పసుపు అలర్జీ కలిగి ఉంటారు. ఇవి దురద మరియు లేత పసుపు రంగులోకి చర్మం మారడం వంటి సమస్యలుగా ఉంటాయి. కాబట్టి, మొదట మీ చర్మం రకాన్ని తెలుసుకుని, మోచేతి మీద మిశ్రమాన్ని పరీక్షించిన తర్వాతనే ఫేస్ పాక్ ఉపయోగించండి.

ఈ ఫేస్ ప్యాక్ లోని నిమ్మకాయ యొక్క ఆమ్ల స్వభావం అధిక చమురును తొలగించడంలో సహాయపడుతుంది మరియు పైన పేర్కొన్న విధంగా, పసుపు సహజమైన ఎక్స్ఫోలియేటర్ వలె పనిచేస్తుంది.

Most Read: నా మరదలితో చాలా కెమిస్ట్రీ నడిచింది, అమ్మ లేచిపోవడంతో మామయ్యకు నచ్చలేదు, వేరొకరితోపెళ్లి

పసుపు, నిమ్మ మరియు పెరుగు ఫేస్ ప్యాక్ :

పసుపు, నిమ్మ మరియు పెరుగు ఫేస్ ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

• ½ టేబుల్ స్పూన్ పసుపు పొడి

• 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

• 1 ½ టేబుల్ స్పూన్ పెరుగు

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

1. ఒక బౌల్ తీసుకుని అందులో పసుపు పొడి, పెరుగు మరియు నిమ్మ రసం వేసి మిశ్రమంగా కలపండి.

2. పెరుగు సాధారణంగానే సెమీ ద్రవరూపంలో ఉన్నందున నీరు అవసరం ఉండదు. కావున, ఒక మందపాటి పేస్ట్ వలె తయారు చేసి, ముఖంపై ఫేస్ ప్యాక్ బ్రష్ సహాయంతో నలువైపులా సమానంగా విస్తరించునట్లు వర్తించండి.

3. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

4. ముఖం మీది మిశ్రమం ఆరిపోయిన తర్వాత, చల్లని లేదా మోస్తరు వేడి నీటితో పూర్తిగా శుభ్రపరచి, తాజా టవల్తో ముఖంపై నీటిని తుడవండి.

5. ఈ ఫేస్ ప్యాక్ ను తరచుగా వారానికి రెండు నుండి మూడు సార్లు అనుసరిస్తున్న ఎడల, గొప్ప ప్రభావాలను చూపగలదు.

నిమ్మకాయ, విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇది మృత చర్మంతోపాటు చర్మ రంధ్రాలను కూడా తొలగిస్తుంది క్రమంగా జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది. యోగర్ట్ లేదా పెరుగు కూడా చర్మ రంధ్రాలు తొలగిపోవడంలో సహాయపడే తత్వాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ముఖం మీద చేరే అధిక జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది.

పసుపు మరియు కీరాదోస ఫేస్ ప్యాక్ :

పసుపు మరియు కీరాదోస ఫేస్ ప్యాక్ :

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి

• ½ కప్ కీరాదోస రసం

Most Read: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ టమోటా హెయిర్ - ప్యాక్ మీకు సహాయం చేయగలదు.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

1. ఒక గిన్నెను తీసుకొని, అందులో పసుపు పొడి, దోసకాయ రసాన్ని వేసి మిశ్రమంగా కలపాలి.

2. ముఖం మీద ఫేస్ పాక్ బ్రష్ సహాయంతో నలువైపులా విస్తరించునట్లు దరఖాస్తు చేసుకోవాలి. 12 నుండి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.

3. ముఖం మీది మిశ్రమం ఆరిపోయిన తర్వాత, చల్లని లేదా మోస్తరు నీటితో శుభ్రంగా కడిగి, శుభ్రమైన టవల్తో ముఖం మీది నీటిని తొలగించండి.

4. ఈ ఫేస్ ప్యాక్ వారానికి మూడుసార్లు కనీసం అనుసరిస్తున్న ఎడల, మీ చర్మంపై ఒక పునరుజ్జీవన ప్రభావాన్ని చూపగలదు.

ఈ ఫేస్ ప్యాక్ కీరా దోసకాయ యొక్క హైడ్రేటింగ్ లక్షణాల కారణంగా పనిచేస్తుంది. కీరా దోసకాయ 90 శాతం నీటిని కలిగి ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను, మృత కణాలను తగ్గిస్తుంది మరియు చర్మం నుండి అదనపు నూనె ఉత్పత్తిని నివారించడంలో సహాయపడుతుంది.

English summary

How To Use Turmeric For Oily Skin?

None of us want an oily skin, but what happens when we have to deal with oily skin every day? Oily skin attracts germs and leads to acne and pimples. Turmeric has its own medicinal values and besides adding flavour and colour to the food, curing cuts, boosting the body's immunity, etc., it helps in getting rid of oily skin.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more