For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన షేవింగ్ చిట్కాలు

|

శరీరంపై అవాంఛిత వెంట్రుకలను తొలగించుకోటానికి రెండు చవకైన పద్ధతులున్నాయి – ఒకటి వ్యాక్సింగ్ మరియు ఇంకోటి షేవింగ్. వాక్సింగ్ చాలా నొప్పి కలిగిస్తుంది కాబట్టి చాలామంది అమ్మాయిలు తమ శరీర వెంట్రుకలను రేజర్ సాయంతోనే తొలగించుకుంటారు.

షేవింగ్ మెరుగైన ఆప్షన్ ఎందుకంటే అది మీ ఇంట్లోనే మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు, ఇది సరిగా చేస్తే శరీరంపై వెంట్రుకలను కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది.

మీరు షేవింగ్ కోసం రేజర్ ను వాడుతున్నట్లయితే, మీకు ఇక్కడ షేవింగ్ మృదువుగా సాగటానికి కొన్ని సులువైన చిట్కాలను, సలహాలను అందిస్తున్నాం. అవేంటో చదవండి.

ఈ షేవింగ్ చిట్కాలను అందరు స్త్రీలను తెలుసుకోవాలి.

1.తడి షేవింగ్ ను ఎంచుకోండి

1.తడి షేవింగ్ ను ఎంచుకోండి

మీరు ఎప్పుడైనా షేవ్ చేసేటప్పుడు రేజర్ ను వాడితే, ఎప్పుడూ తడి షేవింగ్ నే ఎంచుకోండి. తడి షేవింగ్ తో రేజర్ మృదువుగా కదులుతుంది, అలా మీకు ఏ గాట్లు లేకుండా శుభ్రంగా షేవ్ అవుతుంది. మీకు కావాల్సిందల్లా లిక్విడ్ సోప్,దాన్ని నురగగా మీరు షేవ్ చేయాలనుకుంటున్న భాగంపై పోసి,రేజర్ తో షేవ్ చేయంది. నీరు లేదా లిక్విడ్ సోప్ వాడటం వలన రేజర్ మృదువుగా కదిలి, ఏ గాట్లు పడకుండా షేవ్ అవుతుంది.

2.మీ చర్మాన్ని తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోండి

2.మీ చర్మాన్ని తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోండి

రేజర్ తో షేవింగ్ లో మరో ముఖ్యమైన చిట్కా, షేవింగ్ అవగానే మంచి మాయిశ్చరైజర్ ను మీ చర్మానికి రాసుకోవడం. షేవింగ్ వలన మీ చర్మంపై తేమ హరించుకుపోయి, ఎండిపోతుంది. అందుకని మంచి మాయిశ్చరైజర్ వలన మీ చర్మంకి కావాల్సిన తేమ అంది మెత్తగా మారుతుంది. కొంచెం కొబ్బరినూనె లేదా ఆలోవెరా జెల్ తీసుకుని షేవింగ్ చేసిన ప్రాంతంలో మసాజ్ చేయండి.

 3.గోరువెచ్చని నీటిని వాడండి

3.గోరువెచ్చని నీటిని వాడండి

మీరు మరీ చల్లని లేదా మరీ వెచ్చని నీటిని షేవింగ్ చేసేటప్పుడు వాడకూడదు. దీనివలన చర్మంపై ర్యాషెస్ రావచ్చు. గోరువెచ్చని నీటిని వాడండి ఎందుకంటే అది ఉపశమనంగా ఉంటుంది మరియు మీ శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. మీరు సాధారణంగా కూడా ఎప్పుడూ మీ శరీర ఉష్ణోగ్రత కన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న నీటిని వాడాలి.

4.షేవింగ్ ఎప్పుడూ ఒకే దిశలో చేయండి

4.షేవింగ్ ఎప్పుడూ ఒకే దిశలో చేయండి

ఇది మీ మొదటి షేవ్ అయితే, మీరు ఒకే దిశ నుంచి మొదలుపెట్టాలని గుర్తుంచుకోవాలి. ఒక దిశలోనే షేవింగ్ చేయటం వలన మీకు సరైన ఫలితాలు వచ్చి, వెంట్రుకలు కూడా సరిగా షేవ్ అవుతాయి. మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ వెంట్రుకలు పెరిగే దిశకి వ్యతిరేకంగా షేవింగ్ చేయాలి.

5.కొత్త బ్లేడ్ పై ధ్యాస పెట్టండి

5.కొత్త బ్లేడ్ పై ధ్యాస పెట్టండి

మీరు రేజర్లో కొత్త బ్లేడ్ వాడుతుంటే, షేవింగ్ చేసేటప్పుడు కూడా అదనంగా శ్రద్ధ అవసరం. మీ రేజర్ ను ఒక దిశలో షేవ్ చేయటం వల్ల, చర్మంపై ఎక్కువ వత్తిడి ఉండదు. తడి చర్మంపై రేజర్ వాడటం మర్చిపోవద్దు, అలా అయితేనే బ్లేడు సులభంగా కదిలి, మంట మరియు గాట్లు పడకుండా ఉంటుంది.

6.ఒకే ప్రదేశంలో మళ్ళీ షేవ్ చేయవద్దు

6.ఒకే ప్రదేశంలో మళ్ళీ షేవ్ చేయవద్దు

ఒక మంచి చిట్కా ఏంటంటే, షేవింగ్ చేసేటప్పుడు అదేచోట మళ్ళీ షేవ్ చేయవద్దు. అప్పుడే షేవ్ చేసిన చర్మంపై మళ్ళీ షేవింగ్ బ్లేడ్ ను రాయటం వలన చర్మం మంటపుట్టి, వాస్తుంది. ఇంకా, తాజాగా షేవ్ చేసిన చర్మంపై షేవింగ్ మళ్ళీ చేయటం వలన చర్మం గాయాలు, గాట్లు పడతాయి.చర్మం ఎర్రగా మారటం మరియు వాచకుండా ఉండటం కోసం ఇలా చేయవద్దు.

 7.షేవ్ చేయటానికి మంచి సమయం

7.షేవ్ చేయటానికి మంచి సమయం

రేజర్ ను వాడుతూ షేవ్ చేయటానికి మంచి అనుకూల సమయం ఎంచుకోండి. నిపుణుల ప్రకారం, మీ చర్మం తడిగా ఉన్నప్పుడు షేవ్ చేయటం మంచిదని చెప్తున్నారు. మీరు స్నానం చేసే సమయంలో షేవ్ చేయటం మంచిది. గోరువెచ్చని నీరు జుట్టు కుదుళ్ళను మెత్తన చేస్తుంది, అలా షేవ్ చేసినప్పుడు మంచి ఫలితం కన్పడుతుంది. అధికంగా వేడి లేదా చల్లని నీరును షేవింగ్ చేసేటప్పుడు వాడవద్దు.

8.షేవింగ్ వాడాక రేజర్ శుభ్రపర్చండి

8.షేవింగ్ వాడాక రేజర్ శుభ్రపర్చండి

మీరు చర్మాన్ని షేవ్ చేసాక, రేజర్ ను శుభ్రం చేసి, ఆరనివ్వండి. తర్వాతసారి వాడేందుకు పొడి ప్రదేశంలో ఉంచండి. కానీ మీరు వాడగానే బయటపడేసే రేజర్లను కూడా వాడవచ్చు. ఒక్కో రేజర్ 3-5సార్లు వాడాక బయటపారేయచ్చు.అందుకని అధికంగా వాడవద్దు లేకపోతే మెల్లమెల్లగా సరిగా పనిచేయవు.

 9.షేవింగ్ క్రీమ్ ప్రత్యామ్నాయం

9.షేవింగ్ క్రీమ్ ప్రత్యామ్నాయం

మీ షేవింగ్ క్రీం అయిపోతుంటే,మీరు చర్మాన్ని షేవ్ చేయటానికి అనేక సహజపదార్థాల ప్రత్యామ్నాయాలు కూడా వాడవచ్చు. తేనె, ఆలోవెరా జెల్, షాంపూనీరు, షియా బటర్, కొబ్బరినూనె వంటివి కొన్ని సాధారణంగా వాడే ప్రత్యామ్నాయాలు.

English summary

shaving tricks | shaving tricks for women | important shaving tricks

Here are some important shaving tricks that every woman must know, take a look.
Desktop Bottom Promotion