వివిధ రకాల చర్మ తత్వానికి అద్భుతమైన సెనగపిండి ఫేస్ మాస్క్ లు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

బేసన్(సెనగపిండి), ఒక సాంప్రదాయ చర్మ సంరక్షణ పదార్ధం, ఇది వివిధ చర్మ రకాలపై అద్భుతంగా పనిచేస్తుందని చెప్తారు. ఈ పదార్ధం మీ చర్మ స్ధితిని మార్చి, చర్మాన్ని మృదువు చేసే లక్షణానికి శక్తివంతమైనది.

ప్రాచీన కాలం నుండి, భారతదేశంలోని స్త్రీలు అనేకరకాల చర్మ చికిత్సలకు ఈ సహజ పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. సన్ టాన్, యాక్నే లేదా డల్ నెస్ వంటివి ఏసమస్యైనా, సెనగపిండి మీ చర్మ పరిస్ధితులకు ఉపశమనం కలిగించి, మీ చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది.

face masks for different skin types

వివిధ రకాల చర్మాలకి ఫేస్ మాస్క్ లు

అందువల్ల, మీ చర్మ సంరక్షణకి ప్రయత్నించిన, పరీక్షించిన పదార్ధాలను వాడడం మంచిది. అయితే, మీ చర్మానికి ఉపశమనం కలిగించే శనపిండిని ఉపయోగించే మార్గం మీకు తెలీకపోతే, మేము మీకు చెప్తాము.

ఈరోజు మేము వివిధ రకాల చర్మాలకు ఉపయోగించే శేనగపిండి ఫేస్ మాస్క్ ల జాబితాని ఇక్కడ తెలియచేసాము. అద్భుతంగా, గుర్తించదగ్గ ఫలితాల కోసం మీ చర్మ రకానికి సరిపోయే దాన్ని ఎన్నుకోండి.

ఈ అద్భుతమైన ఫేస్ మాస్క్ లపై దృష్టి పెట్టండి:

1. అన్ని రకాల చర్మ తత్వాలకు

1. అన్ని రకాల చర్మ తత్వాలకు

మీకు ఏమి అవసరం:

½ టీస్పూన్ సెనగపిండి

1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్

½ టీస్పూన్ నిమ్మరసం

ఉపయోగించడం ఎలా:

ఈ పదార్ధాలను అన్నిటినీ కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖం మీద ఉన్న చర్మానికి పట్టించండి. ఈ మాస్క్ అద్భుతంగా పనిచేయడానికి గోరువెచ్చని నీటితో కడిగే ముందు, 10-15 నిమిషాల పాటు ఉంచండి. మీ చర్మం ఆరోగ్యంగా తయారవడానికి వారానికి ఒకసారి ఈ మాస్క్ ని ఉపయోగించండి.

2.యాక్నే-ప్రోన్ చర్మం

2.యాక్నే-ప్రోన్ చర్మం

మీకు ఏమి అవసరం:

1 టీస్పూన్ సెనగపిండి

2 టీస్పూన్స్ గ్రీన్ టీ

ఉపయోగించడం ఎలా:

ఈ పదార్ధాలతో ఒక మిశ్రమాన్ని తయారుచేయండి. మీ ముఖ్యం మొత్తం దీనితో సున్నితంగా మర్దనా చేయండి. అలా 10 నిముషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వారానికి ఒకసారి ఈ ఇంట్లోతయరుచేసిన మాస్క్ ని ఉపయోగించండి.

3.పొడి చర్మం కోసం

3.పొడి చర్మం కోసం

మీకు ఏమి అవసరం:

½ టీస్పూన్ సెనగపిండి

1 టీస్పూన్ అలోవేరా జెల్

ఉపయోగించడం ఎలా:

ఈ పదార్ధాలను అన్నిటినీ కలిపి, ఆ మిశ్రమాన్ని మీ ఫేస్ పై రాయండి. 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ ని ఉపయోగించడం వల్ల మీ చర్మం తేమగా, హైడ్రేటెడ్ గా ఉండడానికి సహాయపడుతుంది.

4.సున్నితమైన చర్మం కోసం

4.సున్నితమైన చర్మం కోసం

మీకు ఏమి అవసరం:

1 టీస్పూన్ సెనగపిండి

1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

ఉపయోగించడం ఎలా:

పైనచెప్పిన పదార్ధాలను ఒక మిశ్రమంలా తయారుచేయండి. అయిన తరువాత, మీ ముఖ చర్మంపై ఈ మాస్క్ ను మందంగా వేసి, అలా 15 నిమిషాలపాటు వదిలేయండి. తరువాత, గోరువెచ్చని నీటితో మీ చర్మం నుండి ఈ మిశ్రమాన్ని తొలగించండి. అద్భుతమైన ఫలితాల కోసం ఈ మాస్క్ ని వారానికి 2-3 సార్లు వాడండి.

5.జిడ్డు చర్మం కోసం

5.జిడ్డు చర్మం కోసం

మీకు ఏమి అవసరం:

1 టీస్పూన్ సెనగపిండి

2-3 టీస్పూన్ల చమోమిల్ టీ

ఉపయోగించడం ఎలా:

ఈ పదార్ధాలను అన్నిటినీ బ్లెండ్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ ముఖం, మెడ భాగంలో రాయండి. కొన్ని నిమిషాల పాటు అలా ఉంచి, కొద్దిగా ఫేస్ వాష్, గోరువెచ్చని నీటితో కడిగి జిడ్డుతనాన్ని, గ్రీజీనేస్ ని పోగొట్టుకోండి. వారానికి ఒకసారి ఈ ఫేస్ మాస్క్ ఉపయోగించి జిడ్డును, గ్రీజ్ ని పోగొట్టుకోండి.

6.సాధారణ చర్మం కోసం

6.సాధారణ చర్మం కోసం

మీకు ఏమి అవసరం:

½ టీస్పూన్ సెనగపిండి

1 టీస్పూన్ ముల్తాని మట్టి

1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్

ఉపయోగించడం ఎలా:

ఈ పదార్ధాలను కలిపితే చాలు మాస్క్ తయారవుతుంది. అయిన తరువాత, మీ ముఖంపై ఒక పొరలాగా ఈ మిశ్రమాన్ని పూయండి, అలా 15 నిమిషాల పాటు ఉంచండి. ఈ మిశ్రమాన్ని కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. ప్రతి వారం ఈ మాస్క్ ని అప్లై చేస్తే అందమైన చర్మాన్ని పొందవచ్చు.

7.టాన్ చర్మానికి

7.టాన్ చర్మానికి

మీకు ఏమి అవసరం:

1 టీస్పూన్ సెనగపిండి

½ టీస్పూన్ నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు

ఉపయోగించడం ఎలా:

తరువాతి ఫేస్ మాస్క్ తయారుచేయడానికి ఈ పదార్ధాలను ఒకదానితో ఒకటి బాగా కలపాలి. తరువాత, ముఖం మొత్తం, మెడ మీద ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. 15 నిముషాలు అలా ఉంచాలి. మీ చర్మాన్ని తేలికైన ఫేస్ వాష్ తో, గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. మీ చర్మం మీద ఉన్న టాన్ పోవాలంటే ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేయండి.

8.డల్ స్కిన్ కి

8.డల్ స్కిన్ కి

మీకు ఏమి అవసరం:

1 టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె

1 టీస్పూన్ శేనగపిండి

ఉపయోగించడం ఎలా:

పైచెప్పిన పదార్ధాలను ఒకదానితో ఒకటి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై సమాంతరంగా రాయండి. 10 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని కడగండి. మీ చర్మం కాంతివంతంగా మెరవాలి అంటే ఈ ఫేస్ మాస్క్ ని మీరు వారానికి ఒకసారి ప్రయత్నించాలి.

English summary

Incredible Besan Face Masks For Different Skin Types

Besan, aka gram flour, is a traditional skin care ingredient that is known to work magically well on different skin types. This age-old ingredient is a powerhouse of skin-nourishing properties that can transform the state of your skin.
Story first published: Saturday, January 6, 2018, 18:30 [IST]