For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పింక్ పెదవుల కోసం అప్పటికప్పుడు అద్భుతంగా పనిచేసే ఇంటిచిట్కాలు

|

ఆడవాళ్లు ప్రతి ఒక్కరికీ మెరిసే, పింక్ రంగు పెదవులు కావాలని ఉంటుంది. ముఖానికి సంబంధించిన అందంలో పెదవులు కూడా ఆకర్షణీయంగా కన్పించే భాగంగా అయిపోయాయి, ఇంకా మనందరం వాటిని ఎప్పుడూ గులాబీరంగులో ఉండాలని కోరుకుంటాం.

కానీ చాలామందికి రంగు పాలిపోయిన లేదా ముదురురంగు పెదవుల సమస్య ఉండి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువ కాఫీ లేదా టీ తాగటం, ఎండలో తిరగటం, పెదవులకి సరైన సంరక్షణ తీసుకోకపోవడం వలన పెదవులపై మచ్చలు ఏర్పడటానికి దారితీస్తుంది. దాన్ని నివారించటానికి, మనం రసాయన క్రీములపై ఇంకా ఇతర కృత్రిమ చికిత్సలపై ఆధారపడతాం. ఇవి దీర్ఘకాలంలో హాని కలిగించవచ్చు.

ముదురు రంగు పెదవులను ఎలా కాంతివంతంగా మార్చుకోవాలి

Instant Remedies To Brighten Your Lip Colour

ఇంట్లోనే సహజమైన సింపుల్ ఇంటిచిట్కాలు దొరుకుతున్నప్పుడు ఇక వాటిపై ఆధారపడాల్సిన అవసరం ఏముంటుంది? అవును మీరు చదివినది నిజమే! మనం కూడా మన ఇంటిలోనే దొరికే సహజమైన పదార్థాలతో ఆ మెరుస్తూ కన్పించే పింక్, మృదువైన పెదవులను సొంతం చేసుకోవచ్చు.

ఆ పదార్థాలు ఏంటో చూద్దాం ;

1.బాదం నూనె

1.బాదం నూనె

బాదం నూనెలో ఉండే గుణాలు చర్మంలో జీవాన్ని నింపుతాయి.ఇంకా బాదం నూనె లక్షణాలు పెదవుల రంగు పాలిపోవటాన్ని తగ్గించటంతో, అవి కాంతివంతంగా కన్పిస్తాయి. కొంచెం బాదం నూనెను తీసుకుని మీ పెదవులకి రాసుకుని రాత్రంతా అలా వదిలేయండి. రోజూ పడుకునేముందు ఇలా చేయండి.

2.నిమ్మ, తేనె

2.నిమ్మ, తేనె

నిమ్మరసం ట్యాన్ ను తొలగించి పెదవులను మరింత కాంతివంతంగా కన్పించేలా చేస్తుంది. తేనె పెదవులకి పోషణనిచ్చి, మృదువుగా , తేమగా ఉంచుతుంది. మీరు చేయాల్సిందల్లా కొన్ని చుక్కల తేనె, 1 చెంచా నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై అద్దుకుని 1 గంటపాటు అలానే వదిలేసి, తడిగుడ్డతో తుడిచేయండి.

3.బీట్ రూట్

3.బీట్ రూట్

బీట్ రూట్ మరక, మీ పెదవులను సహజంగా కాంతివంతంగా మారుస్తుంది, పింక్ రంగులో కనపడేలా చేస్తుంది. మీకు కావాల్సిందల్లా కొంత బీట్ రూట్ రసం,3-4 పుదీనా ఆకులు ఇంకా కొన్ని చుక్కల బాదం నూనె. బీట్ రూట్ ను చిన్నముక్కలుగా తరిగి రసం తీయండి. వడకట్టి, దానిలో పుదీనా ఆకులను, బాదం నూనె చుక్కలను వేయండి.

కాటన్ దూదిని అందులో ముంచి పెదవులపై అద్దుకోండి. ప్రతిరోజూ రెండుసార్లు ఇలానే చేయండి.

4.గ్లిజరిన్

4.గ్లిజరిన్

గ్లిజరిన్ చర్మంలో తేమను పట్టి వుంచటంలో సాయపడుతుంది. ఇది పెదవులను ఎండిపోకుండా చేసి మరింత కాంతివంతంగా కన్పడేలా చేస్తుంది. కొంచెం గ్లిజరిన్ ను పెదవులకి దూదిసాయంతో ప్రతిరోజూ పడుకునేముందు రాసుకోండి. ప్రతిరోజూ రాయడం వలన మీకు పింక్ మరియు మెరిసే పెదాలు సొంతమవుతాయి.

5.యాపిల్ సిడర్ వెనిగర్

5.యాపిల్ సిడర్ వెనిగర్

యాపిల్ సిడర్ వెనిగర్ సహజమైన కాంతినిచ్చే పదార్థం, ఇది మీ పెదవులపై రంగుమచ్చలను కూడా తొలగిస్తుంది. కొన్ని చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ ను నీళ్ళలో కలపండి.దీన్ని దూది సాయంతో మీ పెదవులకి అద్దుకుని 10-15 నిమిషాలు వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి. దీన్ని రాత్రంతా రాసుకుని ఉంచవద్దు, దీనిలోని యాసిడ్ మీ చర్మానికి హాని కలిగించవచ్చు.

6.వంట సోడా

6.వంట సోడా

బేకింగ్ సోడా మృతకణాలను తొలగించే పదార్థం, ఇది పెదవులపై ఉన్న మృతకణాలను, రంగు మచ్చలను తగ్గించి, మీ ముదురురంగు పెదవులను కాంతివంతంగా మారుస్తుంది. 1 చెంచా వంట సోడాకి కొంచెం నీరు కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ పెదవులకి రాసి, మెల్లగా గుండ్రంగా మసాజ్ చేయండి. 5 నిమిషాలు అలానే వదిలేసి, మామూలు నీరుతో కడిగేయండి. ఇలా రోజు విడిచి రోజు చేయండి.

7.రోజ్ వాటర్

7.రోజ్ వాటర్

ఇది మీ పెదవుల రంగును కాంతివంతంగా మారుస్తుంది. పెదవుల్లో రక్తప్రసరణ పెరిగేలా చేయటంతో మీ పెదవులు మరింత రంగును పొందుతాయి. మీరు చేయాల్సిందల్లా చల్లని రోజ్ వాటర్ ను దూదితో ఈ పెదవులకి రాసుకోవటమే. ఇలా పడుకునేముందు 2-3 సార్లు చేయండి.తెల్లవారాక కడిగేయండి.

8.ఆలోవెరా

8.ఆలోవెరా

ఆలోవెరా చర్మంలో మళ్ళీ జీవాన్ని నింపి, కాంతివంతంగా ఇంకా తేమగా ఉంచుతుంది. ఒక ఆలోవెరా ఆకును కోసి, అందులోని జెల్ ను బయటకి తీయండి.మీరు మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఆలోవెరా జెల్ ను కూడా వాడవచ్చు.కానీ తాజా ఆలోవెరా జెల్ ను వాడటమే మంచిది. దీన్ని మీ పెదవులపై రాసుకుని మెల్లగా మసాజ్ చేయండి. ప్రతిరోజూ ఒకసారి ఇలాచేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.

English summary

Instant Remedies To Brighten Your Lip Colour

Every woman loves to have glossy and pink lips. Excess tea or coffee intake, exposure to the sun, etc., leads to pigmentation of the lips. Some ingredients you can use to brighten your lip colour are almond oil, rose water, beetroot, etc. But most of us face the problem of discoloured or dark lips that makes us lose our confidence in the way we appear.
Desktop Bottom Promotion