For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వంటగదిలోని పదార్థాలతో అందమైన చర్మ నిగారింపు మీ సొంతం!

మొండి చర్మానికి దోహదపడే కొన్ని కారకాలు హానికరమైన UV కిరణాలు, పిగ్మెంటేషన్, మచ్చలు, చర్మ సంరక్షణ లేకపోవడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం మొదలైనవికి చర్మం బహిర్గతం అయేలా చేస్తాయి.

By Ashwini Pappireddy!
|

ప్రతి ఒక్కరూ ఒక అందమైన మరియు నిగారింపు చర్మాన్ని కలిగివుండాలి అని కోరుకుంటారు.

అందమైన సాఫ్ట్ మరియు ప్రకాశవంతమైన స్కిన్ ఎలాంటి వారినైనా ఆకర్షించేలా

చేస్తుంది.దురదృష్టవశాత్తు, కొన్ని కారకాలు మన చర్మంపై వున్న సహజమైన గ్లో ని తొలగించి, దానికి బదులుగా నిస్తేజమైన మరియు డల్ చర్మాన్ని మనకి అందిస్తున్నాయి.

మొండి చర్మానికి దోహదపడే కొన్ని కారకాలు హానికరమైన UV కిరణాలు, పిగ్మెంటేషన్,

మచ్చలు, చర్మ సంరక్షణ లేకపోవడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం మొదలైనవికి చర్మం బహిర్గతం అయేలా చేస్తాయి.

మొండి చర్మం మిమల్ని ఆనారోగ్యంగా కనిపించేలా చేస్తుంది మరియు మీ సహజ మైన గ్లో ని మీ చర్మం నుండి దూరం చేస్తుంది. అందువలన, ముఖం మీద కోల్పోయిన సహజ గ్లో తిరిగి తీసుకురావడానికి మీ చర్మం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

మార్కెట్లో అందానికి సంబంధించి మనకు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నప్పటికీ, అందులో వున్న కెమికల్స్ మీ చర్మాన్ని మరింత అధ్వాన్నంగా తయారుచేసి చర్మం పాడయేలా చేస్తాయి.

సో, దీని కోసం హోమ్ రెమెడీస్ వాడటం వలన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది బదులుగా మీ చర్మంపై గొప్ప గా పని చేసి మరియు మీకు ఎలాంటి ఖర్చు లేకుండా సహజమైన స్కిన్ టోన్ ని మీకు అందిస్తుంది.

ఇక్కడ పాడైన మీ చర్మానికి చికిత్స చేసి మరియు తిరిగి మీరు ప్రకాశవంతమైన చర్మాన్ని సౌందర్యాన్ని పొందడానికి అవసరమైన కొన్ని హోమ్ రెమిడీస్ జాబితాను తెలియజేశాము. దాని గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

మిల్క్

మిల్క్

పాలు మీ చర్మంపై అద్భుతాలు చేసి సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పాలు మీ చర్మం తేలికగా మరియు మృదువైన అద్భుతమైన నాణ్యతను కలిగి ఉంటుంది. చర్మంపై పాల ను పదేపదే అప్లై చేయడం వలన మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్లను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి సహజ గ్లో ని అందిస్తుంది.

పెరుగు:

పెరుగు:

గ్లో ని కోల్పోయిన మీ చర్మం తిరిగి ప్రకాశవంతంగా చేయడానికి యోగార్ట్ మంచి రెమెడీ గా చెప్పవచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసి సహజమైన నిగారింపునిస్తుంది. చర్మాన్ని ప్రభావవంతంగా ఎక్సఫోలియాట్స్ చేసి మరియు సూర్యుడి నుండి వచ్చే టాన్ ని తొలగించడం ద్వారా మీ స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తుంది.

వంట సోడా

వంట సోడా

బేకింగ్ సోడా ఒక సహజ ఎక్సఫోలియాటింగ్ ఏజెంట్. ఇది చర్మానికి ఎలాంటి హానిని కలిగించదు.బేకింగ్ సోడా మరియు రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ చేయండి మరియు శుభ్రంగా చేసుకున్న మీ ముఖం మీద రాసుకొని కొన్ని నిముషాల తరువాత కడిగేయండి. ఇలాచేయడం వలన పొడిబారిన మీ చర్మం తిరిగి నిగారింపుని పొందుతుంది.

కలబంద

కలబంద

అసమాన చర్మం టోన్ కోసం ఉత్తమ మరియు సమర్థవంతమైన పరిష్కారం అలో వేరా. అలో వేరా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది మరియు చర్మంపై నల్లటి ప్యాచ్లను తొలగిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం నేరుగా చర్మంపై ఈ అద్భుతమైన జెల్ అప్లై చేసుకోవచ్చు.

ఆరెంజ్

ఆరెంజ్

ఈ వండర్ ఫ్రూట్ సహజంగా మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల నారింజ రసం లో చిటికెడు పసుపుని కలిపి దీనిని ముఖానికి రాసుకోవడం ద్వారా మీ చర్మం టోన్ ని మారుస్తుంది మరియు చాలా సాఫ్ట్ గా ఉంటుంది.

హనీ

హనీ

హనీ చర్మానికి ఒక సహజమైన నిగారింపుని తీసుకువస్తుంది. ఇది చర్మం మీద వుండే టాన్ మరియు డిస్కోలరేషన్ తగ్గిస్తుంది మరియు ఇది కనిపించే ఫైరర్ చేస్తుంది. తేనె, నిమ్మరసం మరియు పసుపు మిశ్రమాన్ని సిద్ధం చేసుకొని దానిని ముఖానికి రాసుకొని 15 నిముషాల తర్వాత కడిగేయడం ద్వారా మీ చర్మంలో కలిగే మంచి వ్యత్యాసాన్ని మీరే గమనించవచ్చు.

English summary

ingredients that imparts glow on face

Everyone desires to have a glowing and flawless skin. Super soft, glowing and evenly toned skin can catch anyone's attention. Sadly, a few factors take away the natural glow on our skin and make it look dull and lifeless instead.Few factors that contribute to dull skin include exposure of the skin to harmful UV rays, pigmentation, scars, an improper skin care, poor diet, etc.
Story first published:Thursday, January 25, 2018, 14:21 [IST]
Desktop Bottom Promotion