For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెరచుకున్న చర్మ రంధ్రాలను నివారించడానికి పాటించదగిన గృహవైద్య నివారణలు

తెరచుకున్న చర్మ రంధ్రాలను నివారించడానికి పాటించదగిన గృహవైద్య నివారణలు

By Lekhaka
|

ఎవరు మాత్రం మచ్చలేని చర్మం కోరుకోరు? కానీ ఆ అదృష్టం ఎంతమంది కలిగి ఉంటారు? అవిశ్రాంత జీవనశైలి, కాలుష్యం, దుమ్ము, ఒత్తిడి వంటి అనేక కారణాల వలన చర్మంపై మొటిమలు, నిస్తేజం, మచ్చలు, తెరుచుకుని పెద్దవిగా మారిన రంధ్రాలు, మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అందువలన న సంభవించేలా ప్రభావితం చేస్తాయి. అటువంటి సందర్భంలో మనం ఏమి చేయాలి? ఈ సాధారణ సమస్యలను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మార్కెట్ లో లభించే సౌందర్య ఉత్పత్తుల నుండి ప్రభావవంతమైన సహజ నివారణల వరకు, అందమైన చర్మం కొరకు చేపట్టదగిన చర్మ సంరక్షణ చర్యలు అనేక రకాలు లభ్యతలో ఉన్నాయి.

ఈ వ్యాసం ద్వారా, వివిధ చర్మ సమస్యలలో ఒకటైన, తెరుచుకుని పెద్దవైన చర్మ రంధ్రాల నివారణకై చేపట్టే ప్రభావవంతమైన మార్గాలను గురించి తెలుసుకుందాం!

Worried Of Large Pores On Skin? Try Using This DIY Clay Scrub

పెద్ద చర్మ రంధ్రాలు ఏర్పడటానికి కారణాలు ఏమిటి?

ఈ రోజుల్లో, అనేక మంది పెద్ద చర్మ రంధ్రాలు సమస్యతో బాధపడుతున్నారు. ఇవి చర్మ సౌందర్యాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తారు. ఈ నేపధ్యంలో సాధారణంగా ఉదయించే ప్రశ్న ఏమిటంటే, అసలు చర్మ రంధ్రాలు అంటే ఏమిటి? దీనికి మనం అత్యంత సాధారణంగా వినే సమాధానం ఏమిటంటే - జన్యువులు. చర్మం యొక్క నాణ్యత నిర్ణయించడంలో, జన్యువులు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

తెరచుకున్న చర్మ రంధ్రాలను నివారించడానికి పాటించదగిన గృహాచికిత్స విధానాలు: పెద్దవిగా మారిన చర్మ రంధ్రాలను, సాధారణ స్థితికి తీసుకురావడానికి, మీ వంటగది అల్మారాలో లభించే పదార్థాలను ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. చర్మాన్ని శుభ్రపరచడానికి, టోనింగ్ కు, మృతచర్మకణాలను తొలగించడానికి, రంధ్రాలను బిగుతుగా మార్చడానికి మరియు మాయిశ్చరైజింగ్ చేసుకోవడానికి, సహజ నివారణలు చర్మం పాటించడం, సౌకర్యవంతమే కాక, చౌకగా ఉంటాయి మరియు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొన్ని నివారణ పదార్థాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోండి:

1. ఆపిల్ సిడర్ వినెగర్ -

1. ఆపిల్ సిడర్ వినెగర్ -

దీనిని నీటితో కలిపి పలుచన చేసి, చర్మంపై టోనర్ వలే చర్మం పైపూతగా ఉపయోగించడం వలన చర్మం బిగుతుగా మారి రంధ్రాలు మూసుకుంటాయి.

2. కలబంద గుజ్జు-

2. కలబంద గుజ్జు-

ఇది చర్మానికి తేమనందించి, శుభ్రపరచడమే కాక, పోషకాలను కూడా అందిస్తుంది. దీనిని నేరుగా చర్మానికి రాసుకోవచ్చు. ఇది చర్మంపై పేరుకున్న మురికి మరియు జిడ్డును తొలగించి, రంధ్రాల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

3. బేకింగ్ సోడా -

3. బేకింగ్ సోడా -

బేకింగ్ సోడాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను, మొటిమలు, మూసుకుపోయిన రంధ్రాలు, మృతచర్మకణాలు మొదలైన వివిధ చర్మ సమస్యలను పరిష్కరించి, చర్మ pH సమతులంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉత్తమ ఫలితాల కొరకు, బేకింగ్ సోడాకు గోరువెచ్చని నీటితో కలిపి, 25-30 సెకన్ల పాటు వలయాకార కదలికలతో చర్మంపై మర్దన చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు.

4. బొప్పాయి -

4. బొప్పాయి -

అద్భుత ఫలమైన బొప్పాయిని గుజ్జుగా చేసి చర్మానికి సమనంగా రాసుకుంటే, చర్మ రంధ్రాలు శుభ్రపరచి, వాటిలోని మలినాలను తొలగించడం ద్వారా బిగుతుగా మారుస్తుంది. ఇలా వారానికి 3-4 సార్లు చేయవచ్చు.

5. నిమ్మరసం తో దోసకాయ -

5. నిమ్మరసం తో దోసకాయ -

దోసకాయ ముక్కలను బ్లెండ్ చేసి, నిమ్మరసం కలిపి చర్మరంధ్రాలను సమర్థవంతంగా నివారించడానికి, వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన చూడటానికి చర్మం అద్భుతమైన మెరుపుతో ,మృదువుగా మారుతుంది .

6. రోజ్ వాటర్ లేదా పాలతో కలిపిన ముల్తానీ మట్టి-

6. రోజ్ వాటర్ లేదా పాలతో కలిపిన ముల్తానీ మట్టి-

రోజ్ వాటర్ లేదా పాలుతో ముల్తానీ మట్టి కలిపి పూసుకోవడం వలన, చర్మం నుండి స్రవింపబడే అదనపు జిడ్డును తొలగించి, రంధ్రాలను మూసివేస్తుంది. అంతేకాక, మేనిఛాయను మెరుగుపరుస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, వారానికి కనీసం రెండుసార్లు, ఈ చిట్కాను అనుసరించండి.

7. బ్రౌన్ షుగర్, తేనె మరియు నిమ్మరసం -

7. బ్రౌన్ షుగర్, తేనె మరియు నిమ్మరసం -

అన్ని పదార్ధాలను బాగా కలిపండి. ప్రభావిత చర్మాన్ని, ఈ మిశ్రమంతో 4-5 నిమిషాల పాటు రుద్దుకునే, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ అద్భుతమైన మిశ్రమం, చర్మంపై పెరుకున్న మృతచర్మ కణాలను తొలగిస్తుంది. చర్మం రంధ్రాలు శుభ్రపడి, మూసుకుపోతాయి . దీనిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.

8. ఆలివ్ నూనె -

8. ఆలివ్ నూనె -

ఆలివ్ నూనె యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిఆక్సిడెంట్ లక్షణాలు పొడిదనాన్ని, నిస్తేజాన్ని, పెద్దవైన చర్మ రంధ్రాలను, సరి చేయడం ద్వారా, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. 3-4 నిమిషాల పాటు వలయాకార కదలికలతో మర్దన చేసుకుని, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

9. పెరుగు-

9. పెరుగు-

ఈ చిట్కాను వారానికి 2-3 సార్లు ఉపయోగించడం ద్వారా, తెరచుకున్న చర్మ రంధ్రాల సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం, రంధ్రాలను బిగుతుగా మార్చి, చర్మాన్ని శుభ్రపరచేందుకు సహాయపడుతుంది. ప్రభావిత ప్రాంతం వద్ద పెరుగును రాసుకుని 15-20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత సాధారణ నీటితో దీనిని శుభ్రం చేసుకోవాలి.

10. బంక మట్టి-

10. బంక మట్టి-

పెద్దవిగా ఉన్న రంధ్రాల సమస్యను పరిష్కరించడానికి, కేవొలిన్ లేదా బెంటోనైట్ వంటి సౌందర్య చికిత్సల లో ఉపయోగించే బంకమట్టిని, రోజ్ వాటర్ లేదా పాలతో కలిపి, చక్కటి పేస్ట్ గా చేసి చర్మంపై రాసుకోవాలి. 15-20 నిముషాల పాటు ఆరిన తరువాత, చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. మీ చర్మ స్పందన ఎలా ఉందో గమనించుకుని, ఈ పద్ధతిని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ చిట్కా చర్మాన్ని, బిగుతుగా మార్చి, రంధ్రాలను మూసివేసి, శుభ్రపరుస్తుంది.

English summary

Worried Of Large Pores On Skin? Try Using This DIY Clay Scrub

Large skin pores can make the skin look dull, dark and rough. DIY clay scrubs in combination with activated charcoal are extremely effective in curing enlarged skin pores and result in a healthy and good-looking skin. The best DIY scrubs can be used with banana, cucumber, apple cider vinegar, etc.Large Pores: Causes and Home Remedies
Story first published:Wednesday, August 29, 2018, 16:21 [IST]
Desktop Bottom Promotion