For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  లెమన్ పీల్ పౌడర్, మిల్క్ ఫేస్ ప్యాక్ తో ట్యాన్ ను ఈజీగా తొలగించేయొచ్చు

  |

  ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అందంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అందం విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. అయితే, స్పా లేదా సెలూన్ కు వెళ్లే సమయం అందరికీ దక్కడం లేదు. బిజీ లైఫ్ స్టైల్స్ వలన ఈ సమస్య ఎదురవుతోంది. ఇది ఖర్చుతో కూడిన విషయం కూడా.

  కొన్ని సార్లు, బ్యూటీ ట్రీట్మెంట్స్ వలన తాత్కాలిక ఫలితాలు మాత్రమే దక్కుతున్నాయన్న భావన కూడా మహిళలను వేధిస్తోంది. మరి ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ కి అయ్యే ఖర్చు గురించి అసలు చెప్పనవసరం లేదు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని మీరనుకుంటే మీరు హోంమేడ్ బ్యూటీ ప్యాక్స్ లేదా మాస్క్ లను ప్రయత్నించాలి. స్పా మరియు సెలూన్ లలో అఫర్ చేస్తున్న వివిధ బ్యూటీ ట్రీట్మెంట్స్ కి ఇవి నమ్మదగిన ప్రత్యామ్నాయాలు.

  tan removal face pack at home

  ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో

  చాలామటుకు హోంమేడ్ ప్యాక్స్ లో ఇంట్లో రెడీగా ఉన్న పదార్థాలనే వినియోగించడం జరుగుతుంది. ప్రతి కిచెన్ లో విరివిగా లభించే పదార్థాలతోనే ఎక్కువగా ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ అనేవి తయారవుతాయి. కిచెన్ లో భద్రపరచుకునే ఫుడ్ ఐటమ్స్ లో పోషక విలువలు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో మిల్క్ మరియు లెమన్ లను ట్యాన్డ్ స్కిన్ సమస్యను తొలగించుకునేందుకు తయారుచేసే ఫేస్ ప్యాక్ లలో వాడవచ్చు.

  1. ట్యాన్ అంటే ఏంటి?

  1. ట్యాన్ అంటే ఏంటి?

  ఎండలో ఎక్కువ సేపు ఉండటం వలన చర్మం అనేది రెండు షేడ్స్ డార్కర్ గా మారుతుంది. దీనిని స్కిన్ ట్యానింగ్ అనంటారు. ట్యానింగ్ అనేది అత్యంత హానికరం కాదు. సన్ బర్న్ సమస్య మాత్రం హానీకరమే. స్కిన్ ట్యానింగ్ అనే ప్రక్రియ ద్వారా చర్మం తనని తాను సన్

  2. డ్యామేజ్ నుంచి రక్షణ

  2. డ్యామేజ్ నుంచి రక్షణ

  డ్యామేజ్ నుంచి రక్షించుకుంటోంది. సూర్యరశ్మిలోంచి వెలువడే అల్ట్రా వయొలెట్ రేస్ అనేవి చర్మాన్ని తాకగానే చర్మంలోకి చొచ్చుకుని పోతాయి. ఇది మెలనిన్ (డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండే ఒక పిగ్మెంట్) ప్రొడక్షన్ ను ప్రేరేపిస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి అనేది సూర్యుని హానీకర కిరణాల నుంచి చర్మాన్ని రక్షించే షీల్డ్ గా పనిచేస్తుంది.

  3. డార్క్ గా మారుతుంది

  3. డార్క్ గా మారుతుంది

  మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన చర్మం డార్క్ గా మారుతుంది. దీనినే మనం ట్యానింగ్ అని అంటాము. కాలక్రమేనా ట్యానింగ్ అనేది మాయమవుతుంది. చర్మం మళ్ళీ సాధారణంగా మరి తన సహజ షేడ్ ని సంతరించుకుంటుంది. కొంతమంది ట్యాన్ ను హెల్తీ గ్లో కోసం భావిస్తారు.

  4. ట్యానింగ్ లాంప్స్

  4. ట్యానింగ్ లాంప్స్

  మరికొంతమంది ఆర్టిఫీషియల్ గా ఇన్డోర్ ట్యానింగ్ బెడ్స్, ట్యానింగ్ లాంప్స్ లేదా మిగతా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ద్వారా ట్యానింగ్ ను ప్రిఫర్ చేస్తారు. ఈ ఆర్టిఫీషియల్ ట్యానింగ్ మెథడ్ ని సన్ లెస్ ట్యానింగ్ గా పేర్కొంటారు. అయితే, ట్యానింగ్ కు ఎక్కువగా గురి కావడం వలన చర్మంపై దుష్ప్రభావం కలిగే సూచనలు ఉన్నాయి. దీని వలన ప్రాణాపాయ సమస్యలు కూడా సంభవించే అవకాశాలు కలవు. స్కిన్ క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉంది.

  5. గుర్తించదగినంతగా కనిపించదు

  5. గుర్తించదగినంతగా కనిపించదు

  మీడియం నుంచి డార్కర్ స్కిన్ టోన్ కలిగిన వారిలో ట్యానింగ్ అనేది గుర్తించదగినంతగా కనిపించదు. అయితే, కొన్ని గంటల తరువాత స్కిన్ టోన్ లో తేడా రావచ్చు. స్కిన్ కొంచెం సెన్సిటివ్ గా మారినట్టు కనిపిస్తుంది.

  స్కిన్ ట్యాన్ పై అవగాహన

  అతిగా ట్యాన్ కు గురవడానికి అలాగే హెల్తీ ట్యాన్ కు గల తేడాను తెలుసుకోవడం ద్వారా స్కిన్ ట్యాన్ కు చికిత్స చేయడం సులభతరం అవుతుంది.

  6. అతిగా ట్యాన్ అవుతుంది

  6. అతిగా ట్యాన్ అవుతుంది

  ఎక్కువగా ఎండలో ఉండటం వలన చర్మం అతిగా ట్యాన్ అవుతుంది.

  ఆరోగ్యకరమైన ట్యానింగ్ వలన గ్రీక్ గాడెస్ గ్లో లభిస్తుంది. అయితే, అతిగా స్కిన్ ను ట్యాన్ చేయడం వలన చర్మం నిస్తేజంగా, పొడిగా అలాగే నిర్జీవంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, ట్యానింగ్ సమస్య విపరీతంగా మారినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించడం ఉత్తమం. హోమ్ రెమెడీస్ ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

  మార్కెట్ లో ఈ సమస్యను పరిష్కరించేందుకు అనేక ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

  7. చర్మానికి హానీ

  7. చర్మానికి హానీ

  అయితే, ఈ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన వీటివలన చర్మానికి హానీ కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి, కెమికల్ ప్రోడక్ట్స్ నుంచి దూరంగా ఉండటం మంచిది. తద్వారా, భవిష్యత్తులో కొన్ని చర్మ సమస్యలు ఎదురవకుండా జాగ్రత్త పడవచ్చు.

  ట్యాన్ స్కిన్ కలిగిన వ్యక్తి ఈ కెమికల్ ట్యాన్ రిమూవల్ ప్రోడక్ట్స్ ని వాడటం ద్వారా స్కిన్ అలర్జీలతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.

  అటువంటి సినారియోలలో హోంమేడ్ ఫేస్ ప్యాక్ ల ను వాడి ట్యాన్ ను తొలగించుకోవడం ఉత్తమం.

  ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సమస్య తలెత్తదు. వీటిలో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. అటువంటి ఒక అద్భుతమైన రెమెడీని ఇప్పుడు మీకోసం వివరిస్తున్నాము. ప్రయత్నించండి మరి!

  8. లెమన్ పీల్, మిల్క్ ఫేస్ ప్యాక్

  8. లెమన్ పీల్, మిల్క్ ఫేస్ ప్యాక్

  ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ అనేది ట్యాన్ ను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్ధంగా తొలగిస్తుంది.

  కావలసిన పదార్థాలు: ఒక టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్

  ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు.

  తయారుచేసే విధానం: పచ్చి పాలను అలాగే లెమన్ పీల్ పౌడర్ ను కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఒకవేళ ఈ మిశ్రమం కొంచెం పలచగా మారితే మరికాస్త లెమన్ పీల్ పౌడర్ ను జోడించండి.

  9. పేస్ట్ ను అప్లై చేయండి

  9. పేస్ట్ ను అప్లై చేయండి

  ఒకసారి ఈ పేస్ట్ తయారవగానే ముఖంపై ఈ పేస్ట్ ను అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు దీనిని ఆరనివ్వండి. నీళ్లతో ఈ మిశ్రమాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వాడితే సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఎండిన లెమన్ పీల్ ను వాడినట్లయితే పాలను జోడించిన తరువాత ఈ రెండిటినీ ఫుడ్ మిక్శ్చర్ లో తురమండి.

  10. జాగ్రత్తగా గమనించండి

  10. జాగ్రత్తగా గమనించండి

  ఈ ఫేస్ ప్యాక్ ను తక్కువ మొత్తంలో వినియోగించడం మంచిది. తద్వారా, లెమన్ పీల్ పౌడర్ చర్మంపై కఠినంగా వ్యవహరించకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ ప్యాక్ ను పగిలిన అలాగే ఇరిటేటెడ్ చర్మానికి నేరుగా అప్లై చేయకూడదు. తద్వారా, చర్మం మరింతగా దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు.

  11. లెమన్ పీల్ పౌడర్, మిల్క్ ఫేస్ ప్యాక్ ద్వారా లభించే ప్రయోజనాలు

  11. లెమన్ పీల్ పౌడర్, మిల్క్ ఫేస్ ప్యాక్ ద్వారా లభించే ప్రయోజనాలు

  ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్డ్ స్కిన్ పై అద్భుతాలను చూపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ లో వాడిన పదార్థాల వలన ఈ ప్యాక్ కు అంతటి అద్భుతమైన గుణాలు సొంతమయ్యాయి.

  ఈ ఫేస్ ప్యాక్ లో మిల్క్ అనేది ముఖ్యపదార్థంగా వాడబడినది. మిల్క్ అనేది చర్మాన్ని మృదువుగా అలాగే కోమలంగా మార్చుతుంది. ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియ ద్వారా ట్యాన్డ్ స్కిన్ సమస్యను పరిష్కరిస్తారు. మిల్క్ అనేది ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇందులో లభించే లాక్టిక్ యాసిడ్ సహజసిద్ధమైన ఎక్స్ఫోలియెంట్ గా పనిచేస్తుంది.

  12. సన్ ట్యాన్ తొలగించగలదు

  12. సన్ ట్యాన్ తొలగించగలదు

  మిల్క్ అనేది సౌందర్య సాధనంగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రాచుర్యంలో ఉంది. క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ లో మిల్క్ ప్రధాన పాత్ర పోషించిందని వార్తలు ప్రాచుర్యం పొందాయన్న విషయం తెలిసిందే. వివిధ చర్మ సమస్యల నుంచి ఉపశమనం అందించేందుకు మిల్క్ అనేది ఏజ్ ఓల్డ్ రెమెడీగా ప్రసిద్ధి చెందింది. సన్ బర్న్ స్కిన్ సమస్యను పరిష్కరించేందుకు మిల్క్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  మిల్క్ లో లభించే లాక్టిక్ యాసిడ్ అనేది సన్ ట్యాన్ ను అతి తక్కువ సమయంలోనే తొలగించగలదు.

  13. స్కిన్ ట్యానింగ్ ను తగ్గిస్తాయి

  13. స్కిన్ ట్యానింగ్ ను తగ్గిస్తాయి

  ఫేస్ ప్యాక్ లో మిల్క్ ను చేర్చినపుడు స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది. అలాగే డ్రై మరియు డిహైడ్రేటెడ్ స్కిన్ ను నరిష్ చేయడానికి మిల్క్ తోడ్పడుతుంది. యాక్నే, ఫ్రెకిల్స్ మరియు డార్క్ స్పాట్స్ సమస్యను తగ్గించేందుకు మిల్క్ తోడ్పడుతుంది. లెమన్ పీల్ లో సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి లభిస్తాయి. ఇవి స్కిన్ లైటెనింగ్ కు తోడ్పడతాయి. తద్వారా, స్కిన్ ట్యానింగ్ ను తగ్గిస్తాయి.

  14. లెమన్ పీల్ తప్పనిసరి

  14. లెమన్ పీల్ తప్పనిసరి

  స్కిన్ వైటనింగ్ అలాగే బ్లీచింగ్ ఏజెంట్ గా లెమన్ పీల్ ప్రసిద్ధి చెందింది. కాబట్టి వీటిని ఫేస్ ప్యాక్ లో వాడటం ద్వారా అద్భుతమైన ఫలితాలను గుర్తించవచ్చు. సన్ ట్యాన్డ్ స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు లెమన్ పీల్ ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.

  15. ఇంటి వద్దే సులభంగా

  15. ఇంటి వద్దే సులభంగా

  స్కిన్ ట్యానింగ్ అనే సమస్య నుంచి ఉపశమనం పొందాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ముఖ్యంగా, వేసవి కాలంలో సన్ ట్యాన్ సమస్య విపరీతంగా వేధిస్తుంది. కాబట్టి, ఇటువంటి అద్భుతమైన హోమ్ రెమెడీస్ తో సన్ ట్యాన్ సమస్య నుంచి పరిష్కారాన్ని ఇంటి వద్దే సులభంగా పొందవచ్చు. కాబట్టి, వేసవిలో వెకేషన్ కు వెళ్లినా చర్మం గురించి దిగులు చెందనవసరం లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి.

  English summary

  Lemon Peel Powder And Milk Face Pack For Removing Tan

  This artificial form of tanning is known as sunless tanning. However, excessive skin tanning can affect your skin negatively and can cause life-threatening worries such as the increased risk of being affected by skin cancer. People who have medium to darker skin tones might not visibly notice any form of tan on their skin. However, signs may show up a few hours later, where the skin might look flushed and tender.
  Story first published: Tuesday, June 5, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more