For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసే చర్మం కొరకు పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్

మెరిసే చర్మం కొరకు పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్

|

మీ చర్మం మెరుపును కోల్పోతుందని భావిస్తున్నారా? మీ ముఖం మీద మొటిమలు, మచ్చలు వలన మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందా? మీ చర్మ సంరక్షణకై పార్లర్లకు వెళ్లఫానికి బద్దకిస్తున్నారా?

కాలుష్యం, వేడి, అసమంజసమైన ఆహారపు అలవాట్లు సర్వసాధారణం అయిపోయిన ఈ రోజుల్లో, మీరు తీసుకునే ఆహారం మరియు మీ జీవనశైలి , మీలో తలెత్తే వివిధ చర్మ సమస్యలకు దోహదపడుతున్నాయి. మీ చర్మం లో మెరుపును మొటిమలు మరియు మచ్చలు దూరం చేస్తాయి.

Milk And Honey Face Pack For Glowing Skin

ఇటువంటి పరిస్థితుల్లో మీకు సరైన తరుణోపాయం కావాలంటే, అది మా దగ్గర ఉంది. పాలు మరియు తేనెలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్, మీ చర్మ సమస్యలున్నింటికి సరైన పరిష్కారం చూపిస్తుంది.

తేనె పలు చర్మ సమస్యల చికిత్సలో ఔషధంగా వాడతారని మనకందరికీ తెలిసినదే! అయితే, తేనె మొటిమలపై అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనదంటే, పొడిబారిన మరియు కాంతివిహీనమైన చర్మాన్ని ఇట్టే మరమ్మత్తు చేస్తుంది. దీనిలో తేమను పునరుద్ధరించే లక్షణముంటుంది.తేనెను పాలతో కలిపినపుడు, యాంటీబాక్టీరియల్ లక్షణాలు పెంపొందించబడి, చర్మాన్ని లోతుగా పరిశుభ్రం చేస్తుంది.

పాలు సహజ క్లెన్సర్ మాస్త్రమే కాదు చర్మాన్ని మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. ఇది చర్మానికి కీడు చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడి, చర్మాన్ని నునుపుగా మరియు మృదువుగా మారుస్తుంది.

ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

1/2 -1/3 కప్ పాలు

3-4 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ తేనె

పాలు మరియు తేనె చర్మానికి కలుగజేసే మేలును గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు వాటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

 తయారీ విధానం:

తయారీ విధానం:

ఒక గిన్నెలో 1/2 -1/3 కప్ పాలు తీసుకుని దానికి 3-4 టేబుల్ స్పూన్ల తేనె కలిపి బాగా కలపాలి.

3-4 నిమిషాల పాటు గిలాక్కోడితే, బాగా కలుస్తుంది.

అప్లై చేసుకునే విధానం:

అప్లై చేసుకునే విధానం:

ఇప్పుడు మేకప్ బ్రష్ ను ఉపయోగించి లేదా చూపుడు వేలు మధ్యవేలు ఉపయోగించి,ముఖమంతా సమానంగా రాసుకోండి.

చెంపల వద్ద మరియు మొటిమలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు ప్రధాన్యతనిస్తూ రాసుకోండి.

మరీ పల్చగా లేదా దలసరిగా పూసుకోకండి. ముఖంతో పాటుగా మెడకు కూడా రాసుకోండి.

పదిహేను నిమిషాలు పాటు ఆరనివ్వండి. పొడిబారినట్టు అనిపించినపుడు, తడి స్పాంజితో

రుద్దుకుని తరువాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోండి. పొడి తువ్వాలతో శుభ్రంగా తుడుచుకోండి.

చిట్కాలు:

చిట్కాలు:

మీరు ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల తాజా రోజ్ వాటర్ ను కలపడం వలన చక్కని మీ ముఖానికి, సువాసన మరియు తాజాదనం లభిస్తుంది.

ముఖాన్ని కడుక్కున్నాక, మాయిశ్చరైజర్ ను రాసుకోకండి, ఎందుకంటే పాలను చర్మం గ్రహించుకుని, అది సహజ మాయిశ్చరైజర్ వాలే పని చేయడానికి కొంత సమయం అవసరమవుతుంది.

ముఖాన్ని కడుక్కునేటప్పుడు సబ్బును ఉపయోగించకండి. మీరు రాసుకున్న సహజ పదార్థాలను పనిచేయనివ్వండి.

ఇదే మిశ్రమాన్ని మీ చర్మం మెరుపు మరియు తేమ కోల్పోయిన శరీర భాగాలన్నింటికి, మీ వీపు, మోచేతులు, పాదాలు, మోకాళ్లకు కూడా పూయవచ్చు.

ముఖం కడుక్కున్నాక రోజ్ వాటర్ ముఖానికి రాసుకుంటే, టోనర్ వాలే పనిచేస్తుంది. రాసాయనిక టోనర్ కంటే ఇది మంచిది. రోజ్ వాటర్ నే వాడండి..

పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్ కలుగజేసే ప్రయోజనాలు:

పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్ కలుగజేసే ప్రయోజనాలు:

సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది: అవును, పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్, సహజ మాయిశ్చరైజర్ గా పనిచేసి, ఒకటి రెండు రోజుల్లో దాని ఫలితం చూపిస్తుంది. విశేషమైన కాంతి మూడురోజుల అనంతరం నుండి కనిపిస్తుంది.

పగిలిన చర్మము మరియు పెదవులకు వరం:

పగిలిన చర్మము మరియు పెదవులకు వరం:

పగిలిన పెదవులు లేదా మడమలకు శీతాకాలంలో ఈ ప్యాక్ ను పూసుకుంటేచాలా మేలు చేస్తుంది.

పొడిబారిన చర్మము, పగిలిన పెదవులు లేదా మడమలు త్వరలో తిరిగి సాధారణం స్థితికి వస్తాయి. క్రమం తప్పకుండా వాడితే చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

 పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది:

పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది:

పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్ చర్మంలో మలినాలను బయటకు నెట్టేసి, మచ్చలను మరియు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.మొటిమలను సమర్ధవంతంగా తొలగిస్తుంది. అంతేకాక చర్మం తెగినప్పుడు అయ్యే గాయాలను, గాట్లను,ఆట్లమ్మ మరియు చిన్నమ్మవారు మచ్చలను కూడా తగ్గిస్తుంది.

వృద్ధాప్య ఛాయాలను దరిచేరనివ్వదు:

వృద్ధాప్య ఛాయాలను దరిచేరనివ్వదు:

అవును, తేనె పాలలో దాగిఉండే అద్భుతమైన గుణాలు, వృద్ధాప్య ఛాయాలతో పోరాడతాయి. పాలు మరియు తేనెల ఫేస్ ప్యాక్ క్రమం తప్పకుండా వాడితే, చిన్న వయసులో చర్మంపై ఏర్పడే ముడుతలు మరియు సన్నని గీతలు నివారింపబడి, చర్మం బిగుతుగా మారుతుంది.

మొటిమలను తగ్గిస్తుంది:

మొటిమలను తగ్గిస్తుంది:

మొటిమలనేవి మీకు పెద్ద సమస్యగా మారి, ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకుండా ఉంటే, ఈ ఫేస్ ప్యాక్ అద్భుతమైన సమాధానం చెప్తుంది. తేనె మొటిమలను నివారిస్తుంది. దీని సామర్థ్యం పాలతో కలిపి వాడినపుడు ఇంకా పెరుగుతుంది.

ఖరీదైన సెలూన్లో డబ్బు, సమయం వెచ్చించే కన్నా

ఖరీదైన సెలూన్లో డబ్బు, సమయం వెచ్చించే కన్నా

ఖరీదైన సెలూన్లో డబ్బు, సమయం వెచ్చించి కృత్రిమ నివారణ చర్యలు చేపట్టడం కన్నా, ఇంట్లో ఉండే సహజ వనరులను ఉపయోగించి, చర్మాన్ని 2-3 రోజులలో కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. తప్పక మీ చర్మానికి తాజాదనం తిరిగి చేకూరుతుంది.

English summary

Milk And Honey Face Pack For Glowing Skin

Due to the diet that we follow in this era of pollution, heat, ineffective eating habits, etc., we face a lot of issues with our skin. The glow of the skin is gone and often pimples, acne, dark spots, amd blemishes take up the place. Well, we have the right solution for you. Milk and honey face pack is the remedy.
Story first published:Monday, May 28, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion