ఈ చిన్న మాయిశ్చరైజర్ పొరపాట్ల వలన మీ చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మాయిశ్చరైజర్ అనేది మనందరి రోజువారీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో మనందరికీ బాగా తెలుసు. ఇది చర్మం మీద ఒక రక్షిత పొరలా ఏర్పడి మన చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఇది మన చర్మం నిర్జలీకరణం మరియు నిస్తేజంగా మారకుండా నిరోధిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా చర్మ సంరక్షణ నిపుణులు తమ చర్మం ఎల్లవేళలా బాగా తేమగా ఉండేలా నిర్ధారించుకోవాలని మహిళలను ప్రోత్సహిస్తున్నారు. అది కేవలం అన్నివేళలా చర్మాన్ని రక్షించడమే కాకుండా, మీ చర్మం ఆరోగ్యకరంగా మరియు యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.

Moisturizer Mistakes That Make Your Skin Age Faster

ప్రతిరోజూ మీ చర్మం తేమగా ఉండకపోయినా, సరిగ్గా మాయిశ్చరైజర్ వాడకపోవడం లాంటివి చేయడం వలన మీ చర్మం వయస్సును వేగవంతం చేస్తుంది మరియు వృద్ధాప్యం యొక్క అకాల సంకేతాలు ముడుతలతో మరియు సున్నితమైన గీతల తో మీ చర్మం నిండిపోతుంది.

మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని మాయిశ్చరైజర్ తప్పులు చేసేస్తుంటాం. మనంచేసే ఈ చిన్ని పొరపాట్లు కూడా మన చర్మం యొక్క వయస్సును వేగవంతం చేస్తాయి. ఇవాళ బోల్ద్ స్కై లో, మీ చర్మం వాస్తవంగా కనిపించే దానికంటే,అత్యంత సాధారణ మాయిశ్చరైజర్ పొరపాట్లను గురించి మేము మీకు తెలియచేస్తాము.

ఇంకా మీ చర్మం అన్ని సమయాల్లో రిఫ్రెష్ గా మరియు యవ్వనంగా కనిపించేలా ఉండాలనుకుంటే ఈ తప్పులను నివారించండి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

డ్రై స్కిన్ మీదే మాయిశ్చరైజర్ ని రాయడం

డ్రై స్కిన్ మీదే మాయిశ్చరైజర్ ని రాయడం

పొడిబారిన చర్మం మీదనే మాయిశ్చరైజర్ క్రీం ని రాయడం అనేది మనలో చాలా ఎక్కువ మంది చేసే పొరపాటు. ఇలా పొడిబారిన చర్మం మీద మాయిశ్చరైజర్ ని రాయడం వలన చర్మం పొడిబారిపోయే అంత సమర్థవంతంగా మీ చర్మం మీద ప్రభావితం చేయదు.

కాబట్టి మాయిశ్చరైజర్ పూర్తిగా మీ చర్మం గ్రహించడానికి, మీ చర్మం పూర్తిగా ఎండిపోయే పొడిబారకుండా కొంచం తడిగా చూసుకోవడం ఎంతో అవసరం.

మాయిశ్చరైజర్ ని సమానంగా అప్లై చేయకపోవడం

మాయిశ్చరైజర్ ని సమానంగా అప్లై చేయకపోవడం

అవును ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఎల్లప్పుడూ ఎదో ఒక ఒత్తిడిల కారణం వలన మరియు, చర్మం మీద మాయిశ్చరైజర్ ని రాసుకొనేటప్పుడు కొన్ని భాగాలలో ఎక్కువగా మరియు కొన్ని భాగాలలో తక్కువగా రాసుకొనే సందర్భాలు చాలానే వున్నాయి.

ఈ అస్థిరత చర్మం యొక్క పరిస్థితి మీ చర్మం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సో, మీ చర్మం మీద అన్ని ప్రాంతాలలో సమానంగా మాయిశ్చరైజర్ ని రాసుకునేలా నిర్దారించుకోండి.

నెక్ ప్రాంతంలో మర్చిపోవడం

నెక్ ప్రాంతంలో మర్చిపోవడం

మనలో చాలామంది మన జీవితంలో ఏదో ఒక సమయంలో లేదా మరొకరికి కట్టుబడి వుంటూ పొరపాట్లు చేస్తూవుంటాం అందులో ఇది ఒకటి. మన ముఖం మీద మాత్రం అదనపు శ్రద్ధ చూపిస్తాము. కానీ వెనుకల వున్న మెడ ప్రాంతాన్ని మాత్రం వదిలేస్తుంటాం పెద్దగా పట్టించుకోము ఎందుకు?

ఈ అలవాటు మీ చర్మం యొక్క మెడ భాగం వయస్సును వేగంగా చేస్తుంది మరియు మీ ముఖ చర్మం కంటే ముదురు రంగులో కనిపిస్తుంది.

మాయిశ్చరైజర్ను అప్లై చేసిన తరువాత మేకప్ ని వాడటం

మాయిశ్చరైజర్ను అప్లై చేసిన తరువాత మేకప్ ని వాడటం

ఇది మనందరం కచ్చితంగా నివారించాల్సిన అతి పెద్ద పొరపాటు. మీ చర్మం మీద మాయిశ్చరైజర్ను అప్లై చేసిన తరువాత చర్మం బయటి పొరను ఏర్పరుచుకోవటానికి సుమారు 10-15 నిమిషాల పాటు ఆర్నివ్వాల్సి ఉంటుంది. మీరు మొదట మాయిశ్చరైజర్ను రాసుకొని కొంచం గ్యాప్ తర్వాత మేకప్ ని అప్లై చేసుకోవడం వలన మేకప్ ఉత్పత్తుల్లో వుండే కఠినమైన రసాయనాలు మీ చర్మం మీద ప్రభావాన్ని చూపించవు.

కావలసిన మాయిశ్చరైజర్ ఇంగ్రిడియెంట్స్ మీద శ్రద్ధ చూపించకపోవడం

కావలసిన మాయిశ్చరైజర్ ఇంగ్రిడియెంట్స్ మీద శ్రద్ధ చూపించకపోవడం

మీరు ఎప్పుడైనా కొనుగోలు చేసేముందు మీరు ఉపయోగించే మాయిశ్చరైజర్ ఇంగ్రిడియెంట్స్ మీద శ్రద్ధ చూపించారా? ఒకవేళ లేదు అయితే, అప్పుడు మాయిశ్చరైజర్ ని కొనుగోలు చేయడానికి ముందు లేబుల్ ని బాగా పరిశీలించి దానిలో వుండే ఇంగ్రిడియెంట్స్ తెలుసుకొని వాడటం మీద కొంచం సమయాన్ని కేటాయించండం అవసరం.

టన్నుల రసాయనాలతో కూడిన ఏదైనా మాయిశ్చరైజర్, మీ చర్మానికి మేలు కంటే ఎక్కువ హాని నే చేయగలదు మరియు అది వయస్సు ని వేగవంతం చేస్తుంది.

మీ స్కిన్ టైప్ కి సరిపడే మాయిశ్చరైజర్ ని ఉపయోగించక పోవడం

మీ స్కిన్ టైప్ కి సరిపడే మాయిశ్చరైజర్ ని ఉపయోగించక పోవడం

ప్రత్యేకంగా చెప్పాలంటే మన చర్మ రకం కోసం తయారు చేసిన మాయిశ్చరైజర్ ని ఉపయోగించకపోవడం చర్మం వయస్సు వేగవంతం కావడానికి మనం చేస్తున్న పొరపాట్ల లో ఒకటి. ఎందుకంటే ఒక్కొక్కరి చర్మం ఒక్కో విధంగా ఉంటుంది. అలాంటప్పుడు మీ చర్మ రకాన్ని తెలుసుకొని దానికి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తిని ఉపయోగించడం చాలా ముఖ్యం.

జిడ్డుగల చర్మంపై మాయిశ్చరైజర్ ని రాసుకోకపోవడం

జిడ్డుగల చర్మంపై మాయిశ్చరైజర్ ని రాసుకోకపోవడం

వృద్ధాప్య అకాల సంకేతాలను కలిగించే మరొక సాధారణ మాయిశ్చరైజర్ పొరపాటు ఇది. మీరు ఒకవేళ ఆయిలీ స్కిన్ ని కలిగినప్పటికీ, మాయిశ్చరైజర్ ని రాయడం ఎంతో అవసరం.

మాయిశ్చరైజర్ కొరత అన్ని చర్మ రకాల మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వారి కోసం తయారు చేసిన మాయిశ్చరైజర్ ని వాడటం మంచిది.

మీ స్కిన్ ని ఎక్సఫోలియాటింగ్ చేయకపోవడం

మీ స్కిన్ ని ఎక్సఫోలియాటింగ్ చేయకపోవడం

మీ స్కిన్ ని ఎక్సఫోలియాటింగ్ చేయకపోవడం వలన చర్మం మీద మృతకణాలు మరియు మచ్చలు పేరుకుపోతాయి. మీ చర్మ రం ధ్రాలలో నిండిపోయిన మలినాలను దాటి మీ చర్మపు లోపలి పొరలకు చేరుకోవడానికి మాయిశ్చరైజర్ కష్టతరం అవుతుంది మరియు, చర్మం మాయిశ్చర్ ని కోల్పోవడం వలన అభివృద్ధి చెందుతున్న వృద్ధాప్యం యొక్క అకాల సంకేతాలకు కారణం కావచ్చు.

English summary

Moisturizer Mistakes That Make Your Skin Age Faster

Moisturizer Mistakes That Make Your Skin Age Faster,A moisturizer is an essential skin care product that creates a protective layer of moisture on your skin, thereby preventing it from getting dehydrated and looking dull.
Story first published: Wednesday, January 24, 2018, 9:00 [IST]
Subscribe Newsletter