మీ జుట్టుకుదుళ్ళను తేమగా ఉంచే సహజ పదార్థాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ తలపై చర్మాన్ని ఆరోగ్యంగా,తేమగా ఏడాది పొడుగునా ఉంచుకోవటం, మీ జుట్టు పాయలను అన్ని సమయాలలో అందంగా ఉంచుతుంది.

కానీ, మనలో చాలామంది తలపై మాడుకి తక్కువ శ్రద్ధ చూపిస్తారు. మాడుకి సరైన సంరక్షణ లేకపోవటం వలన అన్ని రకాల సమస్యలైన దురద, చుండ్రు,పొడి జుట్టు వంటి సమస్యలన్నీ వస్తాయి.

పైన చెప్పిన జుట్టు సమస్యలన్నిటితో పోరాడటానికి, ఎప్పుడూ మీ జుట్టు కుదుళ్ళను తేమగా ఉంచుకోవటం మంచిది.

How to moisturize your scalp naturally

బ్యూటీ షాపుల్లో దొరికే అనేక క్రీములకి ప్రత్యామ్నాయంగా మీరు ఎప్పుడూ చవకైన, ఎక్కువ ప్రభావవంతమైన సహజ పదార్థాలను ఉపయోగించవచ్చు.

అందుకని, ఈ రోజు బోల్డ్ స్కైలో మీ తలను, వెంట్రుక కుదుళ్ళను తేమగా ఉంచే సహజ పదార్థాలు మరియు దురద పుట్టే వెంట్రుక కుదుళ్ళ సమస్యను నివారిస్తుంది.

ఇక్కడ తెలిపిన అన్ని పదార్థాలు మీ మాడు యొక్క ఆరోగ్యాన్ని పెంచే పోషకాలతో నిండి వున్నవి మరియు మీ జుట్టు సహజ అందంతో మెరిసేలా చేసేవి.

1.ఆలివ్ నూనె

1.ఆలివ్ నూనె

తలపై జుట్టు కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చే ప్రభావవంతమైన సాంప్రదాయ చిట్కా ఆలివ్ నూనె. ఈ సహజనూనె తలకి రక్తప్రసరణను పెంచి, ఎక్కువసేపు తేమగా ఉండేట్లా చేస్తుంది. వెచ్చని ఆలివ్ నూనెను వారానికోసారి మీ తలకి రాసుకుంటే దురద మరియు పొడిబారినతనాన్ని తగ్గిస్తుంది.

2.ఆలోవెరా జెల్

2.ఆలోవెరా జెల్

ఆలోవెరా జెల్ తలను తేమగా, హైడ్రేటడ్ గా ఉంచే అన్నిటికన్నా ప్రభావవంతమైన సహజ పదార్థం అని భావిస్తారు. ఒక చెంచా జెల్ ను ఆలోవెరా మొక్కనుంచి తీసి, మెల్లగా మీ తలంతా మాడుపై పట్టించండి. ఈ సింపుల్ మరియు ప్రభావవంతమైన ఇంటిచిట్కా మీ తలపై అద్భుతాలు చేస్తుంది.

3.కొబ్బరినూనె మరియు తేనె కండీషనర్;

3.కొబ్బరినూనె మరియు తేనె కండీషనర్;

కొబ్బరినూనెలో ఉండే తేమగుణాలు పొడిబారిన జుట్టుకుదుళ్ల సమస్యతో పోరాడే మరో మంచి సహజమైన పదార్థం. గోరువెచ్చని కొబ్బరినూనెతో మీ తలను మసాజ్ చేయటం ప్రాచీనకాలం నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతి, దీని ద్వారా కుదుళ్ళు తేమగా, మృదువుగా ఉంటాయి.

4.అరటిపండు

4.అరటిపండు

అరటిపండును పొడిజుట్టు మరియు జుట్టుకుదుళ్ళకి ప్రభావవంతంగా తేమ అందించటానికి వాడతారు. చాలామంది తమ ఇంటిలోనే అరటిపండు హెయిర్ ప్యాక్ ను తమ కుదుళ్ళు మరియు జుట్టు పాయలకోసం తయారుచేసుకుంటారు. అందుకని ఈ సహజ పదార్థాన్ని ప్రయత్నించి ఆరోగ్యకరమైన మరియు సరైన తేమ ఉండే జుట్టు కుదుళ్ళను పొందండి.

5.తేనె

5.తేనె

తేనె అద్భుతమైన ఒక సహజపదార్థం, ఇందులో అధికంగా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుండి, తల మాడుకి మంచి తేమను అందిస్తుందని ప్రసిద్ధి. మీరు నేరుగా మాడుపై తేనెను రాసుకోవచ్చు లేదా ఇతర పదార్థాలతో కలిపి హెయిర్ ప్యాక్ లా తయారుచేసుకోవచ్చు.

6.ఉల్లిరసం

6.ఉల్లిరసం

ఉల్లిరసంలో ఉండే యాంటీసెప్టిక్ ఏజెంట్లు మీ జుట్టు కుదుళ్ళ వద్ద ఇన్ఫెక్షన్లు రాకుండా మరియు తేమగా ఉండేలా చేస్తాయి. మీరు మీ తలను తాజా ఉల్లిరసంతో తలంటుకోవచ్చు లేదా ఇతర సహజ పదార్థాలతో కలిపి ప్రయత్నించవచ్చు. దీనిద్వారా మీ జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

7.సుగంధ నూనెలు

7.సుగంధ నూనెలు

లావెండర్, బాదం, జొజుబా వంటి సుగంధ ద్రవ్యనూనెల్లో తలకి చల్లదనాన్నిచ్చే ఉపశమనపు లక్షణాలుండి ఎక్కువసేపు తేమగా కూడా ఉంచుతాయి. ఏ సుగంధ ద్రవ్యనూనెని అయినా ఒక సహజపదార్థంతో కలిపి వారానికోసారి మీ తలను తేమగా ఉండేలా బాగుచేసుకోండి.

8.యాపిల్ సిడర్ వెనిగర్

8.యాపిల్ సిడర్ వెనిగర్

స్వభావం ఘాటుగా ఉన్నా, యాపిల్ సిడర్ వెనిగర్ పొడి తల చర్మంను బాగుచేసే శక్తివంతమైన సహజ పదార్థాలు ఉంటాయి. దాన్ని నేరుగా నీటితో కలిపి తలంటుకోండి. ఇలా వారానికోసారి చేయటం వలన మీ తల తేమగా, హైడ్రేటడ్ గా, మరియు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.

English summary

Natural ingredients to moisturize your scalp | Best remedies to moisturize your scalp | How to moisturize your scalp naturally

Natural ingredients to moisturize your scalp, Best remedies to moisturize your scalp, How to moisturize your scalp naturally
Story first published: Thursday, February 15, 2018, 7:00 [IST]