మృదువైన‌, కోమ‌ల‌మైన పెదాల కోసం 7 స‌హ‌జ చిట్కాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

పెదాల‌కు ఎక్కువ‌గా లిప్‌స్టిక్స్‌, కృత్రిమ లిప్‌బామ్స్ రాస్తున్నారా? ఇవి మీ పెదాల‌ను అప్ప‌టిక‌ప్పుడు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా చేయొచ్చు. కానీ త‌ర్వాత‌ర్వాత పొడిబారిన‌ట్టు, వడ‌లిపోయిన‌ట్టుగా చేయ‌గ‌ల‌వు!. అందుకే పెదాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలి. చ‌ర్మంపైనుండే మృత‌క‌ణాల‌ను త‌ర‌చూ తొల‌గించాల్సిన అవ‌స‌ర‌ముంది. దీని వ‌ల్ల చ‌ర్మంలోని మ‌లినాల‌న్నీ తొల‌గి శుభ్రంగా త‌యార‌వుతుంది.

ఇది ఇంట్లోనూ త‌క్కువ ఖ‌ర్చుతో చేసుకోవ‌చ్చు. మీక్కావ‌ల‌సింద‌ల్లా పెదాల స్క్ర‌బ్‌. దీన్ని వాడ‌టం వ‌ల్ల పెదాలు మృదువుగా త‌యార‌వుతాయి. బ‌య‌ట దొరికేవి కాకుండా ఇంట్లోనే స‌హ‌జ‌మైన ప‌దార్థాల‌తో లిప్ స్క్ర‌బ్ త‌యారుచేసుకోవ‌చ్చు. బోల్డ్ స్కైలో కొన్ని ర‌కాల లిప్ స్క్రైబ్‌లను త‌యారుచేసే విధానంతో పాటు వాటిని ఎలా ఉప‌యోగిస్తే ఫ‌లితాలుంటాయో అనే విష‌యాల‌ను తెలియ‌జేయ‌బోతున్నాం. అవేమిటో ఒక్కొక్క‌టిగా చూద్దాం...

1. తేనె, చ‌క్కెర‌ల‌తో...

1. తేనె, చ‌క్కెర‌ల‌తో...

* కావ‌ల‌సిన‌విః అర టీస్పూన్ ముడి చ‌క్కెర‌, ఒక టీ స్పూన్ తేనె.

* ఉప‌యోగించే విధానంః చ‌క్కెర‌, తేనెను క‌లిపి పెదాల‌కు స్క్ర‌బ్‌లా ఉప‌యోగించ‌వ‌చ్చు. చేతి వేళ్ల‌తో కొన్ని నిమిషాల‌పాటు పెదాల‌ను సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగి ఆ త‌ర్వాత పెట్రోలియం జెల్లీ రాస్తే స‌రిపోతుంది.

* మృదువైన పెదాలు సొంతం కావాలంటే వారానికి ఒక్క‌సారైనా ఇలా చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది!

2. ఓట్‌మీల్, లావెండ‌ర్ ఆయిల్‌తో...

2. ఓట్‌మీల్, లావెండ‌ర్ ఆయిల్‌తో...

* కావ‌ల‌సిన‌విః 1 టీస్పూన్ ఓట్‌మీల్‌, 2-3 చుక్క‌ల లావెండ‌ర్ ఆయిల్‌, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌

* ఉప‌యోగించే విధానంః పైన తెలిపినవ‌న్నీ బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌పై 5-10 నిమిషాల‌పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసి పెదాల‌కు పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.

* ఇలా వారానికోసారి చేస్తే మృదువైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మైన పెదాలు మీ సొంత‌మ‌వుతాయి!

3. కాఫీ గింజ‌లు, క‌ల‌బంద‌ల‌తో...

3. కాఫీ గింజ‌లు, క‌ల‌బంద‌ల‌తో...

* కావ‌ల‌సిన‌విః అర టీస్పూన్ కాఫీ గింజ‌లు, 1 టీస్పూన్ క‌ల‌బంద గుజ్జు

* వాడే విధానంః పైన పేర్కొన్న పదార్థాల‌ను మిశ్ర‌మంగా క‌లుపుకోవాలి. దీన్ని పెదాల‌పై రాసుకొని కొన్ని నిమిషాల‌పాటు చేతి వేలితో మృదువుగా మ‌ర్ద‌నా చేయాలి. ఆ త‌ర్వాత ఎప్ప‌టిలాగే గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసి లిప్ బామ్ రాసుకుంటే స‌రిపోతుంది.

* ఇంట్లో తయారుచేసుకునే ఈ మిశ్ర‌మాన్ని క‌నీసం వారానికోసారి పెదాల‌కు రాస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

4. ఆల్‌మండ్ పౌడ‌ర్‌, బీట్‌రూట్ జ్యూస్‌ల‌తో...

4. ఆల్‌మండ్ పౌడ‌ర్‌, బీట్‌రూట్ జ్యూస్‌ల‌తో...

కావ‌ల‌సిన‌విః 1 టీస్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌, అర టీస్పూన్ ఆల్‌మండ్ పౌడ‌ర్‌

ఉప‌యోగించే విధానంః ఈ రెండింటిని బాగా క‌ల‌పి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని పెదాల‌పై రాసుకొని కొన్ని నిమిషాల‌పాటు చేతి వేలితో మృదువుగా మ‌ర్ద‌నా చేయాలి. ఆ త‌ర్వాత ఎప్ప‌టిలాగే గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసి లిప్ బామ్ రాసుకుంటే స‌రిపోతుంది.

* ఈ మిశ్ర‌మాన్ని క‌నీసం వారానికోసారి పెదాల‌కు రాస్తే మృదువుగా, ఎర్ర‌గా మార‌తాయి.

5. కోకో పౌడ‌ర్‌, ట‌మోట గుజ్జుల‌తో..

5. కోకో పౌడ‌ర్‌, ట‌మోట గుజ్జుల‌తో..

* కావ‌ల‌సిన‌విః ట‌మాట గుజ్జు- 2 టీస్పూన్లు

1 టీస్పూన్‌- కోకో పౌడ‌ర్‌

* వాడే విధానంః ట‌మాట గుజ్జులో కోకో పౌడ‌ర్ వేసి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని పెదాల‌కు బాగా ప‌ట్టించి 15 నిమిషాల‌పాటు అలాగే వ‌దిలేయాలి. ఆ త‌ర్వాత తొల‌గించి గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి.

* ఇలా వారానికి రెండు సార్లు చేస్తే అత్యంత మృదువుగా పెదాలు అవుతాయి.

6. షియా బ‌ట‌ర్‌, రోజ్‌వాట‌ర్‌ల‌తో...

6. షియా బ‌ట‌ర్‌, రోజ్‌వాట‌ర్‌ల‌తో...

కావల‌సిన‌విః షియా బ‌ట‌ర్‌- ½ టీ స్పూన్‌, స్ట్రాబెర్రీ-1, రోజ్ వాట‌ర్‌- 1 టీ స్పూన్‌

ఉప‌యోగించే విధానంః ఈ ప‌దార్థాల‌న్నీ ఒక గిన్నెలో వేసి బాగా గిల‌కొట్టాలి. మిశ్ర‌మమంతా ఒకే మాదిరిగా ఉండాలి. దీన్ని తీసుకొని చేతివేలితో పెదాల‌పై మ‌ర్ద‌న చేయాలి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేస్తే స‌రి.

* మృదువైన, కోమ‌ల‌మైన పెదాల‌కోసం వారానికోసారి ఇలా చేయాలి.

7. బ్రౌన్ షుగ‌ర్‌, బేకింగ్ సోడాల‌తో...

7. బ్రౌన్ షుగ‌ర్‌, బేకింగ్ సోడాల‌తో...

* కావాల్సిన‌విః బ్రౌన్ షుగ‌ర్‌- అర టీ స్పూన్‌, చిటికెడ్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కొబ్బ‌రినూనె.

* ఎలా వాడాలి?- పైన పేర్కొన్న ప‌దార్థాల‌న్నీ మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని పెదాల పై రాసుకొని 10 నిమిషాలు ఉంచాలి. ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగి లిప్ బామ్ రాసుకోవాలి.

* ఇలా వారానికోసారి చేసుకుంటే మృదువైన పెదాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

English summary

natural lip scrub | homemade lip scrub | lip scrub

There are different types of lip scrubs available in beauty stores, it is always wise to prepare your own lip scrub at home by using 100% natural ingredients that are loaded with exfoliating properties.
Story first published: Monday, February 5, 2018, 12:06 [IST]
Subscribe Newsletter