For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గడ్డంపై బ్లాక్ హెడ్స్ ను తొలగించటానికి సహజ చిట్కాలు

గడ్డంపై బ్లాక్ హెడ్స్ ను తొలగించటానికి సహజ చిట్కాలు

|

చనిపోయిన చర్మకణాలు తొలగించబడకుండా ఉంటే అవి పేరుకుపోయి బ్లాక్ హెడ్స్ గా మారతాయి. ఇవి సాధారణంగా ముక్కు,బుగ్గలు,నుదురుపై కన్పిస్తాయి. అలాగే, ఇవి భుజాలు,చేతులు, వీపు, మెడపై కూడా రావచ్చు. ఈరోజు మనం గడ్డం ప్రాంతంలో వచ్చే బ్లాక్ హెడ్స్ ఎలా నయం చేసుకోవచ్చో చర్చిద్దాం.

బ్లాక్ హెడ్స్ చాలా కారణాల వల్ల, అంటే ఎండలో ఎక్కువ తిరగటం, భారీ మేకప్, సరిపడినంత ఎక్స్ ఫోలియేషన్ లేకపోవటం, ప్రెగ్నెన్సీ మొదలైనవాటి వలన కూడా రావచ్చు.

Natural Remedies To Remove Blackheads On Chin


బ్లాక్ హెడ్స్ ను నయం చేయడానికి మార్కెట్లో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో ఇవి హానికరం కావచ్చు. ఇంట్లోనే సింపుల్ ఇంటి చిట్కాలు వాడి బ్లాక్ హెడ్స్ ను నయం చేసుకోండి.

అవేంటో, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవిరి పట్టడం

బ్లాక్ హెడ్స్ ను తొలగించేముందు చర్మాన్ని సిద్ధం చేయటం చాలా ముఖ్యం. దీనివలన గడ్డం ప్రాంతంలో బ్లాక్ హెడ్స్ ను వేగంగా తొలగించగలుగుతారు.

మీరు చేయాల్సిందల్లా ఒక బౌల్ లో నీటిని వేడిచేయండి. దానిపైకి ఆవిరి మీ ముఖానికి తగిలేలా వంగండి. మీ తలను శుభ్రమైన తువ్వాలుతో కప్పుకోండి. కనీసం 10-15 నిమిషాలు ఆవిరిపట్టండి.కావాలంటే, కొన్నిచుక్కల టీ ట్రీ నూనెను గోరువెచ్చని నీటిలో కలపవచ్చు.

బ్లాక్ హెడ్స్ వద్ద పిండవద్దు

మనందరికీ బ్లాక్ హెడ్స్ ను ఊరికే ముట్టుకుంటూ,వాటిని పిండే అలవాటు ఉంటుంది. అలా చేయటం అలన మీ చర్మం మరింతగా పాడవుతుంది. మీరు ఊరికే వాటిని ముట్టుకుంటే బ్లాక్ హెడ్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఓట్మీల్ తో రుద్దండి

మీరు చేయాల్సిందల్లా 2చెంచాల ఓట్మీల్ పౌడర్ ను రోజ్ వాటర్ ను కలిపి స్క్రబ్ చేయటమే.

పద్ధతి ;

1.రోజ్ వాటర్, ఓట్మీల్ పౌడర్ ను పేస్టులా కలపండి.

2.దీన్ని మీ గడ్డం ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

3.వారానికి మూడుసార్లు ఈ మాస్క్ ప్రయత్నించి మెరుగైన ఫలితాలు పొందండి.

పసుపు

పసుపులో వుండే వాపు వ్యతిరేక లక్షణాలు బ్లాక్ హెడ్స్ ను సమర్థవంతంగా నయం చేస్తాయి.

పద్ధతి ;

1.ఒక చెంచా పసుపును 1చెంచా పుదీనా రసంతో బాగా కలపండి.

2.దీన్ని మీ గడ్డంపై రాసుకుని 15-20 నిమిషాలు ఉండనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ప్రతిరోజూ నిద్రపోయేముందు ఇలా చేయండి.

రోజ్ వాటర్ వాడండి

రోజ్ వాటర్ మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుచుకోటంలో సాయపడుతుంది.

పద్ధతి

1.ఒక చెంచా రోజ్ వాటర్ ను 1 చెంచా నిమ్మరసంతో కలపండి.

2.సమస్య ఉన్నచోట దూదితో దీన్ని పట్టించి 10-12 నిమిషాలు అలా వదిలేయండి.

3.మీ ముఖాన్ని నీళ్లతో కడుక్కోండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మెరుగైన, వేగవంతమైన ఫలితాలు చూస్తారు.

ఎక్స్ ఫోలియేషన్ కోసం చక్కెర

చర్మంపై చక్కెర స్క్రబ్ వలన చనిపోయిన మృతకణాలు ఎక్స్ ఫోలియేట్ అయి తొలగించబడతాయి.

పద్ధతి ;

1.ఒక చెంచా చక్కెర, తేనె కలపండి.

2.కొన్ని చుక్కల నిమ్మరసం కూడా జత చేయండి.

3.దీన్ని నెమ్మదిగా మీ గడ్డం ప్రాంతంలో గుండ్రంగా రుద్దుతూ రాయండి.

4.మరికొన్ని నిమిషాలు అలా వదిలేసి తడిగుడ్డతో తుడిచేయండి. తర్వాత మొహం కడుక్కోండి.

ఇలా వారానికి ఒకసారో రెండుసార్లో క్రమం తప్పకుండా చేయండి.

కొంచెం ఆలోవెరా జెల్ తో రుద్దండి

ఆలోవెరాలో అద్భుతమైన శుభ్రపరిచే లక్షణాలు ఉండటం వలన బ్లాక్ హెడ్స్ ను తొలగించటంలో సాయపడుతుంది.

పద్ధతి ;

1.ఒక చెంచా తాజా ఆలోవెరా జెల్ ను ఆకునుంచి తీసుకుని బాగా కలపండి.

2.1చెంచా నిమ్మరసాన్ని జతచేసి బాగా కలపండి.

3.సమస్య ఉన్న చోట నెమ్మదిగా 3-4నిమిషాలతో మసాజ్ చేయండి.

4.10 నిమిషాలు అలా వదిలేసి మొహాన్ని నీటితో కడుక్కోండి.

వారానికి మూడుసార్లు కనీసం చేసి మెరుగైన ఫలితాలు పొందండి.

బ్లాక్ హెడ్స్ తొలగించటానికి నిమ్మరసం

కావాల్సిన వస్తువులు

½ చెంచా నిమ్మరసం

1చెంచా ఉప్పు

నీరు

పద్ధతి

1.నిమ్మరసం, ఉప్పు,నీటిని కలపండి.

2.మీ గడ్డం ప్రాంతంలో పట్టించండి.

3.గుండ్రంగా నెమ్మదిగా రుద్దండి.

4.5-10 నిమిషాలు అలానే వదిలేసి మామూలు నీటితో కడిగేయండి.

ప్రతిరోజూ పడుకునే ముందు ఇలా రిపీట్ చేయండి.

కొబ్బరినూనెను రాయండి

కొబ్బరినూనె బ్లాక్ హెడ్స్ ను తొలగించటంలో సాయపడుతుంది.

పద్ధతి

1.1-2 చుక్కల నూనెను శుభ్రమైన వేలుపై వేసుకుని సమస్య వున్న చర్మంపై మసాజ్ చేయండి.

2.కొన్ని గంటలు వదిలేయండి. ప్రతిరోజూ పడుకునేముందు ఇలా చేయండి.

గుడ్డు తెల్లసొన

గుడ్ల తెల్లసొనలోని విటమిన్లు, పోషకాలు బ్లాక్ హెడ్స్ తొలగించటంలో సాయపడతాయి.

పద్ధతి ;

1.గుడ్డు నుంచి తెల్లసొనను తీయండి. దీన్ని మీ గడ్డం ప్రాంతంపై రాయండి.

2.తెల్లసొన రాసిన పొరపై ఒక టిష్యూ పేపర్ పెట్టండి.30 నిమిషాలు ఆగండి.

3.30 నిమిషాల తర్వాత పొర లాగేసి చల్లనీరుతో కడిగేయండి.

English summary

Natural Remedies To Remove Blackheads On Chin

When the dead skin cells remain uncleaned, it leads the way to blackheads. They usually appear on the nose, cheeks and forehead. However, there are chances that it can appear on the shoulder, arms, back and neck. Today, we'll discuss on how to cure blackheads appearing on the chin.
Story first published:Tuesday, July 3, 2018, 8:09 [IST]
Desktop Bottom Promotion