For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానానికి ముందు ఆలివ్ అయిల్ తో అలా మసాజ్ చేస్తే...

చాలా మంది షాంపులను ఉపయోగించి తలస్నానం చేస్తుంటారు. అలాంటి వారు కాస్త ఆలివ్ ఆయిల్ ను ఒక పాత్రలో పోసుకుని అందులో షాంప్ కలుపుకుని దాంతో తలస్నానం చేయండి. దీంతో జుట్టు రాలదు. షాంప్ ఎఫెక్ట్ నేరుగా వెంట్రుకల

|

ఆలివ్ ఆయిల్‌ తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే ఆలివ్ ఆయిల్ ని తరుచూ ఉపయోగిస్తే చాలా మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు మరింత పెరుగుతుంది. అలాగే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ రావు.

ఆలివ్ ఆయిల్ తో బరువు కూడా అదుపులో ఉంటుంది. బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది.
అయితే ఆలివ్ ఆయిల్ ను స్నానం చేసే ముందు బాడీకి పూసుకుంటే చర్మానికి చాలా మంచిది. చలికాలంలో స్కిన్ పగిలిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆలివ్ ఆయిల్ పూసుకుంటే పగుళ్లు ఏర్పడవు.

ఇలా చేయాలి

ఇలా చేయాలి

రోజూ స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ బాడీ మొత్తాన్ని మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరగంటకు కాస్త గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే చర్మం అస్సలు పగలదు.

తెల్లగా అవుతుంటే

తెల్లగా అవుతుంటే

అలాగే కొందరికి సబ్బుతో రుద్దుకుంటే తెల్లగా మారిపోతూ ఉంటుంది. అలాంటి వారు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ను ఒంటికి పూసుకోండి. తర్వాత స్నానం చేయండి. అస్సలు తెల్లగా మారదు.

షుగర్

షుగర్

కొందరికి చర్మం గరుకుగా ఉంటుంది. అలాంటి వారు ఆలివ్ ఆయిల్ లో కాస్త షుగర్ కలిసి అది కరిగిపోయిన తర్వాత ఆ ఆయిల్ తో బాడీ మొత్తం మసాజ్ చేసుకోండి. దీంతో చర్మం మొత్తం కూడా స్మూత్ గా మారిపోతుంది.

వెంట్రుకలకు ఇలా పూసుకోండి

వెంట్రుకలకు ఇలా పూసుకోండి

ఆలివ్‌ ఆయిల్ ను ఎక్కువగా జుట్టుకు ఉపయోగిస్తుంటారు. వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిలో కాస్త గుడ్డు సోన కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి వెంట్రుకలకు పూసుకోవాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే మీ హెయిర్ మొత్తం పట్టులా మారుతుంది.

Most Read :బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే రోజూ ఇలా చేయండి, వీటిని తింటే చెడు కొవ్వు తగ్గిపోతుందిMost Read :బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే రోజూ ఇలా చేయండి, వీటిని తింటే చెడు కొవ్వు తగ్గిపోతుంది

షాంపుల్లో

షాంపుల్లో

చాలా మంది షాంపులను ఉపయోగించి తలస్నానం చేస్తుంటారు. అలాంటి వారు కాస్త ఆలివ్ ఆయిల్ ను ఒక పాత్రలో పోసుకుని అందులో షాంప్ కలుపుకుని దాంతో తలస్నానం చేయండి. దీంతో జుట్టు రాలదు. షాంప్ ఎఫెక్ట్ నేరుగా వెంట్రుకలపై పడదు. అలాగే డాండ్రఫ్ పూర్తిగా తగ్గుతుంది.

నిమ్మరసంతో

నిమ్మరసంతో

నిమ్మరసంలో కాస్త ఆలివ్ ఆయిల్ ను కలుపుకుని హెయిర్ కు పూసుకోండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. అలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు మొత్తం కూడా నిగనిగలాడిపోతుంది.

చిన్న పిల్లలకు

చిన్న పిల్లలకు

చిన్న పిల్లలకు కూడా రోజూ ఆలివ్‌ ఆయిల్‌ తో మసాజ్ చేస్తే చాలా మంచిది. రోజూ ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసి స్నానం చేయిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. చలాకీగా మారుతారు.

అల్లంలో కలిపి

అల్లంలో కలిపి

ఆలివ్ ఆయిల్ లో కాస్త అల్లం రసాన్ని కలిపి దాన్ని జుట్టుకు పూసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లు బాగా గట్టిగా మారుతాయి.

Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలుMost Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు

తేనె కలుపుకుని

తేనె కలుపుకుని

ఆలివ్‌ ఆయిల్‌ లో కాస్త తేనె కలుపుకుని ఫేస్ కు రాసుకుంటే చాలా మంచిది. ఇలా రెగ్యులర్ గా చేస్తే ఫేస్ మొత్తం చాలా అందంగా తయారవుతుంది.

పాల మీగడ

పాల మీగడ

ఆలివ్‌ నూనెలో పాలమీగడ కలుపుకుని బాడీ మొత్తం పూసుకుంటే చాలా ఫలితాలుంటాయి. అలా పూసుకున్న తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది.

గోళ్లకు

గోళ్లకు

ఆలివ్‌ నూనెను గోళ్లకు పూసుకుంటే వాటి అందం పెరుగుతుంది. గోళ్లు పెసులుబారవు. గట్టిగా మారుతాయి.

పెదాలకు రాసుకుంటే

పెదాలకు రాసుకుంటే

ఆలివ్‌ నూనెను రోజూ పెదాలకు రాసుకుంటే చాలా మంచిది. దీంతో పెదాలు మొత్తం కూడా పింక్ కలర్ లోకి మారుతాయి. రెగ్యులర్ గా పెదాలు పగిలే వారు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కాస్త వేడి చేసి

కాస్త వేడి చేసి

ఆలివ్‌ నూనెను కాస్త వేడి చేసి దాన్ని జుట్టు కుదుళ్లకు పూసుకుంటే మంచిది. ఇలా పూసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు గట్టిగా మారుతాయి.

జుట్టు నల్లగా మారుతుంది

జుట్టు నల్లగా మారుతుంది

ముందుగా వెల్లుల్లి పొట్టును కాల్చి దాని పౌడర్ ను రెడీ చేసుకోండి. దాన్ని ఆలివ్ నూనెలో కలపండి. తర్వాత ఆ ఆయిల్ ను కాస్త వేడి చేయండి. దాన్ని వెంట్రుకలకు పూసుకుంటే హెయిర్ నల్లగా మారుతుంది.

పసుపు

పసుపు

కొందరికి కాళ్ల వేలి మధ్యలో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఆలివ్‌ నూనెలో పసుపును కలుపుకుని దాన్ని పూసుకుంటూ ఉంటే అక్కడ పగుళ్లు తగ్గిపోతాయి.

Most Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలుMost Read :రోజూ నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు తింటే చాలు, కరివేపాకుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు

English summary

Olive Oil mix with Lemon Juice and honey ginger for amazing skin benefits

how to use olive oil for bathing
Desktop Bottom Promotion