మొటిమలను చిదమడం వంటి ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేయాలి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చర్మ సంరక్షణకు సంబంధించి మనకు తెలియకుండానే మనం అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఈ స్కిన్ కేర్ మిస్టేక్స్ ని సులభంగానే అవాయిడ్ చేయవచ్చు.

కొన్ని స్కిన్ కేర్ మిస్టేక్స్ అనేవి సాధారణంగా జరిగేవి మరికొన్ని కావాలని చేసుకునేవి. అటువంటి కొన్ని స్కిన్ కేర్ మిస్టేక్స్ ని మనం చేయకుండా ఉండలేము. ఇటువంటి స్కిన్ కేర్ మిస్టేక్స్ ని మనం నిరోధిస్తే మన చర్మం మరింత ఆరోగ్యంగా మారుతుందని మీకు తెలుసా?

ఈ రోజు మీ సౌలభ్యం కోసం అటువంటి మిస్టేక్స్ తో కూడిన జాబితాను ఈ ఆర్టికల్ లో పొందుపరిచాము. వీటిని చదివి మీరు ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం ద్వారా చర్మాన్ని మరింతగా సంరక్షించుకోవచ్చు. కాబట్టి, ఈ మిస్టేక్స్ ని చేయడం మాని మీ చర్మానికి తగిన సంరక్షణని అందించండి.

స్కిన్ కేర్ విషయంలో ఈ చెడు అలవాట్లని మానుకోవడం ద్వారా ముందుగానే వచ్చే ఏజింగ్ లక్షణాలని అరికట్టవచ్చని మీకు తెలుసా? ముందుగానే ఏజింగ్ లక్షణాలు కనిపించాలని ఎవరు కోరుకుంటారు? చర్మం మరింత యవ్వనంగా ఉండేందుకు రకరకాల ప్రోడక్ట్స్ ని అలాగే హోమ్ రెమెడీస్ ని వాడడంతో పాటు ఈ మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తే అందమైన చర్మం మీ సొంతం.

చికిత్స కంటే నివారణ ముఖ్యమన్న సూక్తిని గుర్తించి స్కిన్ కేర్ విషయంలో మీరు చేస్తున్న ఈ పొరపాట్లను సరిదిద్దుకోండి. తద్వారా, చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి.

1. మొటిమలను నలపడం లేదా చిదమడం:

1. మొటిమలను నలపడం లేదా చిదమడం:

మొటిమలనగానే కొందరిలో ఆందోళన అధికమవుతుంది. మొటిమలను చిదిమే వరకూ వారికి నిద్రపట్టదు. ఇలా చేస్తే సమస్య పరిష్కారమవుతుందని వారు నమ్ముతారు. అయితే, మొటిమలను నలపడం వలన మొటిమల చారలు అలాగే ముఖంపై నిలిచిపోతాయి.

2. వేడినీటిని చర్మ సంరక్షణకు వాడటం:

2. వేడినీటిని చర్మ సంరక్షణకు వాడటం:

చల్లటి వాతావరణంలో ఈ పొరపాటును చర్మ సంరక్షణలో భాగంగా చేస్తారు. వేడినీటితో చర్మాన్ని కడగటం వలన చర్మరంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ విధంగా మరింత దుమ్ము చర్మం లోపలికి పేరుకుంటుంది. దుమ్మూ ధూళితో చర్మ రంధ్రాలు మూసుకుంటాయి. ఇందుకు బదులుగా గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రంచేసుకుని ఆ తరువాత చల్లటి నీటిని వాడితే చర్మరంధ్రాలు మూసుకుంటాయి.

3. ముఖాన్ని తరచూ టచ్ చేస్తూ ఉండటం

3. ముఖాన్ని తరచూ టచ్ చేస్తూ ఉండటం

తరచూ ముఖాన్ని టచ్ చేయడం ద్వారా మీ చేతులలోంచి క్రిములు ముఖంపైకి బదిలీ అవుతాయి. ఈ విధంగా మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.

4. చర్మంపై ఎక్కువ ఒత్తిడి కలిగించడం:

4. చర్మంపై ఎక్కువ ఒత్తిడి కలిగించడం:

ఈ పొరపాటు నిద్రలో జరుగుతుంది. సరైన విధంగా నిద్రపోకపోవటం, చర్మంపై ఒత్తిడి పడేలా నిద్రపోవటం వంటివి చర్మాన్ని సాగదీసి ఏజింగ్ లక్షణాలు త్వరగా కనిపించేలా చేస్తాయి. ఇది, సాధారణంగా జరిగే స్కిన్ కేర్ మిస్టేక్.

5. టోనింగ్ చేసుకోకపోవడం:

5. టోనింగ్ చేసుకోకపోవడం:

ముఖాన్ని కడిగిన ప్రతిసారి టోనింగ్ చేసుకోవాలి. తద్వారా, కోల్పోయిన పిహెచ్ లెవెల్స్ మళ్ళీ సాధారణ స్థాయికి చేరుకుంటాయి. అలాగే, పెద్దగా ఉన్న పోర్స్ చిన్నగా మారతాయి.

6. ఆయిలీ స్కిన్ పై మాయిశ్చరైజర్ ను అవాయిడ్ చేయడం:

6. ఆయిలీ స్కిన్ పై మాయిశ్చరైజర్ ను అవాయిడ్ చేయడం:

ఆయిలీ స్కిన్ కలిగిన వారు మాయిశ్చరైజర్ వాడనవసరం లేదని మీరు భావించవచ్చు. అయితే, మీ అభిప్రాయం తప్పు. మీ చర్మం పొడిగా మారినప్పుడు మొటిమల సమస్య మరింతగా ఎదురవుతుంది. కాబట్టి, ఆయిలీ స్కిన్ కలిగిన వారు కూడా తగినంత మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి.

English summary

Popping Pimples And Other Bad Skin Habits

Popping Pimples And Other Bad Skin Habits,Here are some common bad skin habits including popping pimples
Story first published: Wednesday, January 24, 2018, 12:30 [IST]