For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మం పై తెల్లని మచ్చలను తొలగించే అల్లం రసం మరియు ఎర్రమట్టి మాస్క్.

|

మీ చర్మం మీద కొట్టొచ్చేటట్లు కనిపించే తెల్లని మచ్చలు ఉన్నాయా? అలా అయితే మీరు విటిలిగో అని పిలిచే వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రతి సంవత్సరం మిలియన్ కన్నా ఎక్కువమందికి సోకుతున్నట్లు సమాచారం.

మన చర్మం పిగ్మెంట్ కణాలను కోల్పోయినపుడు, చర్మం సహజంగా ఉండే రంగును సంతరించుకోవడాన్నే, బొల్లి వ్యాధి లేదా విటిలిగో అంటారు. ఈ వ్యాధి వలన మీ చర్మం యొక్క రంగు కోల్పోయి, తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ముఖ్యంగా నోరు మరియు ముక్కు వద్ద ఏర్పడతాయి.

చాలామందిలో, ఈ మచ్చలు నిరపాయకరమైనవి అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో తీవ్రతరమైన ఆరోగ్య సమస్యలకు చిహ్నంగా మారవచ్చు. మీ చర్మం పై తెల్ల మచ్చలు త్వరగా వ్యాపిస్తున్నట్లు అనిపిస్తే కనుక, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి.

Red Clay And Ginger Juice Mask To Treat White Patches On Your Skin

సాధారణంగా విటిలిగో చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. అయినప్పటికీ, దీనిని సమర్ధవంతంగా ఎదుర్కోడానికి, వీలయినంత త్వరగా చికిత్స ప్రారంభించాలి.

ఎన్నో రకాల కాస్మెటిక్ చికిత్సలు లభ్యతలో ఉన్నప్పటికీ, సహజ పద్ధతులను అనుసరించడం శ్రేయస్కరం. ఈరోజు ఈ వ్యాసం ద్వారా గృహవైద్యం ద్వారా విటిలిగోను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చో తెలుసుకుందాం.

ఈ చికిత్స కోసం మీకు రెండు పదార్థాలు అవసరమవుతాయి. అవి ఎర్ర మట్టి మరియు అల్లం రసం. ఖనిజాలు మరియు పోషకాలు పుష్కలంగా కలిగిన ఈ పదార్థాలను కలిపి వినియోగిస్తే, మీ చర్మం పై తెల్ల మచ్చలు తగ్గుముఖం పట్టడమే కాక, చర్మం తన పనిని తాను సక్రమంగా చేసుకుపోతుంది.

మీరు కోరుకున్న ఫలితాలు పొందడానికి అవసరమైన మాస్కు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం!

గమనిక: ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించడానికి ముందుగా, ఈ మిశ్రమాన్ని మీ చర్మం మీద చిన్న ప్రదేశంలో వినియోగించి, చర్మానికి ఎటువంటి నష్టం కలుగజేయట్లేదని నిర్ధారించుకోవాలి. మీ చర్మ తరహాకు ఈ పదార్థాలు సరిపడినట్లైతేనే, వాడాలి.

దీని తయారీ కొరకు మీకు కావలసిన పదార్థాలు:

దీని తయారీ కొరకు మీకు కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఎర్ర మట్టి

1 టేబుల్ స్పూన్ అల్లం రసం

 వాడే విధానం:

వాడే విధానం:

• అల్లం రసాన్ని ఒక గిన్నెలో పిండి, దానికి ఒక టేబుల్ స్పూన్ ఎర్ర మట్టిని కలపండి.

• ఈ రెండింటిని బాగా కలిపి మృదువైన మాస్కును తయారు చేయండి.

• ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో రాసుకోండి.

• కొద్ది నిమిషాలు పాటు మృదువుగా మర్దన చేసుకోండి.

• తరువాత మాస్కును పది నిమిషాలు పాటు ఆరనివ్వండి.

• బాగా ఆరాక, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

• మీ చర్మాన్ని పొడిగా తుడుచుకుని, మాయిశ్చరైజర్ రాసుకోండి.

ఎప్పుడు వాడాలి:

ఎప్పుడు వాడాలి:

చర్మం మీద ఏర్పడే తెల్లని మచ్చల నివారణకు, ఈ మాస్కును వారానికి 2-3 సార్లు వాడాలి.

ఇది ఎలా పనిచేస్తుంది:

ఇది ఎలా పనిచేస్తుంది:

ఎర్ర మట్టి మరియు అల్లం రసం కలిపి చర్మం పై వాడినపుడు, రక్తప్రసరణ మెరుగై,చర్మానికి లోపల నుండి పోషణ లభించి, సహజంగా మెలనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ మాస్కును క్రమం తప్పకుండా వినియోగిస్తే,తెల్లమచ్చలు నెమ్మదిగా తగ్గిపోతాయి.

ఎర్ర మట్టి చర్మానికి చేకూర్చే ప్రయోజనాలు:

ఎర్ర మట్టి చర్మానికి చేకూర్చే ప్రయోజనాలు:

• ఎర్రమట్టిలో ఉండే,వివిధ రకాల ఖనిజాలు విటిలిగో చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిని పూసుకున్నప్పుడు, మెలనిన్ ఉత్పత్తి పెరిగి, తెల్ల మచ్చలను స్పష్టంగా కనిపించకుండా చేస్తుంది.

• ఎర్రమట్టిలో ఉండే,వివిధ రకాల ఖనిజ ఆక్సైడ్లు, చర్మాన్ని శుద్ధి చేసి, మాలినాలు మరియు విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తాయి.

•దీనిలో ఉండే ఐరన్ ఆక్సైడ్, బలహీనమైన బంధనాలకు బలం చేకూరుస్తుంది. ఇది చర్మాన్ని పునరుత్తేజ పరచి, మేనిఛాయను తేలికపరుస్తుంది.

• ఎర్రమట్టి చర్మ కణాలను పునరుత్తేజితం చేస్తుంది కనుక, తెల్లని మచ్చల చికిత్సకు ఉపయోగపడుతుంది.

• ఎర్రమట్టిలోని యాస్ట్రిజెంట్ తత్వాలు మొటిమలను పరిష్కరించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

• ఖనిజాలు మెండుగా ఉండటం వలన, ఎర్రమట్టిని ఉపయోగిస్తే చర్మం నునుపుగా మరియు మృదువుగా మారుతుంది.

అల్లం రసం చర్మానికి చేకూర్చే ప్రయోజనాలు:

అల్లం రసం చర్మానికి చేకూర్చే ప్రయోజనాలు:

• అల్లం రసంలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపడతాయి.ఈ లక్షణాలు చర్మం పై మొటిమలు పదేపదే ఏర్పడకుండా చేస్తుంది.

• అల్లం రసాన్ని చర్మం పై పూసుకోవడం వలన రక్తప్రసరణను మెరుగుపరిచి, పిగ్మెంటేషన్ తో పోరాడుతుంది.

• అల్లం రసం నిర్జీవంగా కనిపించే చర్మానికి మెరుపును చేకూరుస్తుంది. చర్మానికి తేమనందించి కాంతివంతంగా తయారు చేస్తుంది.

• అల్లంరసం వయసు పైబడిన ఛాయలను తగ్గించడానికి ఉపయోగపడే సహజ పరిష్కారం.చర్మానికి యవ్వనాన్ని చేకూర్చి ముడతలు, గీతలను దరిచేరనివ్వదు.

ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ మాస్కు, మీ చర్మం మీద ఏర్పడిన తెల్లని మచ్చలతో పోరాడుతుంది. కనుక, అల్లం రసం మరియు ఎర్రమట్టిని, మీ చర్మ సంరక్షణ క్రమంలో భాగంగా మలచుకోండి.

మీ చర్మం పై తెల్లని మచ్చలను తొలగించే అల్లం రసం మరియు ఎర్రమట్టి మాస్క్.

English summary

Red Clay And Ginger Juice Mask To Treat White Patches On Your Skin

Red Clay And Ginger Juice Mask To Treat White Patches On Your Skin ,Do you have prominent white patches on your skin? If so, then there is a good chance that you’re suffering from a common skin conditions known as Vitiligo. It is a condition that affects more than a million people every year.
Story first published: Wednesday, June 27, 2018, 16:47 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more