For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాశ్వతంగా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకునే ఇంటి స్ట్రిప్స్ చిట్కాలు

శాశ్వతంగా బ్లాక్ హెడ్స్ ను తొలగించుకునే ఇంటి స్ట్రిప్స్ చిట్కాలు

|

మనం సాధారణంగా ముక్కు,గడ్డం, భుజాలు, చేతులపై చూసే చిన్న పొక్కులలాంటి వాటిని బ్లాక్ హెడ్స్ అంటారు. అవి మొటిమల్లా కన్పిస్తాయి కానీ కావు. బ్లాక్ హెడ్స్ కి ఒక కారణం మొటిమలు ఏర్పడటం, చర్మం ఎక్కువ నూనె స్రవించటం. మీరు సరిగ్గా సంరక్షణ తీసుకోకపోతే, చెమట, మురికి, నూనె చర్మంపై రంథ్రాల్లో లోపలిదాకా పోయి, రంథ్రాలు మూసుకుపోయేలా చేసి ,బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి.

అవును, గోళ్లతో వాటిని గిల్లటం మంచి పద్ధతి కాదు, లేకపోతే మీ చర్మంపై మచ్చపడిపోతుంది. కాలుష్యం పెరుగుతున్నకొద్దీ, మన ముఖం ఎప్పుడూ దాని వలన మురికిగా మారి, బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. ఇతరకారణాలు హార్మోన్ల అసమతుల్యత, మానసిక వత్తిడి, పోషకాహార లోపం వంటివి.

Homemade Strips To Remove Blackheads Forever

బ్లాక్ హెడ్స్ ను తొలగించటానికి మీరు ఈ ఆర్టికల్ చదువుతూనే ఉండాలి ఎందుకంటే మేము మీకు సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగించే వివిధ పద్దతులను తెలపబోతున్నాం. అవేంటో చూద్దాం.

1.ఎక్స్ ఫోలియేషన్

1.ఎక్స్ ఫోలియేషన్

అందరూ పాటించాల్సిన ముఖ్యమైన రొటీన్ ఎక్స్ ఫోలియేషన్, ఇది గడ్డంపై మృతకణాలను తొలగించి మీ చర్మం గాలిపీల్చుకునేలా చేసి, చర్మగ్రంథులలో మురికి తొలగిస్తుంది. కానీ అతిగా చేయవద్దు, అలాగే చర్మంపై గట్టిగా రుద్దవద్దు లేకపోతే ఈ సమస్య ఎక్కువవుతుంది. మెల్లగా స్క్రబ్బర్ ను వాడండి.

గమనిక ; స్క్రబ్ చేసేటప్పుడు ఎక్కువగా,గట్టిగా రుద్దవద్దు లేకపోతే చర్మం మంట పుడుతుంది. స్క్రబ్ చేసేటప్పుడు నెమ్మదిగా చేయండి.

2.ఆవిరి

2.ఆవిరి

బ్లాక్ హెడ్స్ ను తీసేముందు మీ మొహానికి ఆవిరి పట్టండి. మీరు చేయాల్సిందల్లా కొంచెం గోరువెచ్చని నీరును బౌల్ లో పోసి కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను వేయండి. ఇప్పుడు దానిపై వంగి మీ తలను టవల్ తో కప్పండి.ఈ ఆవిరి చర్మగ్రంథులను తెరచి మీకు బ్లాక్ హెడ్స్ తొలగించటం సులభమవుతుంది.

3.గిల్లడం, లాగటం చేయవద్దు

3.గిల్లడం, లాగటం చేయవద్దు

ఎంత చేయాలనిపించినా, బ్లాక్ హెడ్స్ ను మీ గోళ్ళతో గిల్లవద్దు, ఇది మరింత తీవ్రంగా సమస్యను పెంచుతుంది.

4.బ్లాక్ హెడ్స్ స్ట్రిప్స్ వాడండి

4.బ్లాక్ హెడ్స్ స్ట్రిప్స్ వాడండి

మార్కెట్లో బ్లాక్ హెడ్స్ ను తొలగించే చాలా ఉత్పత్తులను మీరు ప్రయత్నించవచ్చు. ఇలా చేస్తే మీ చర్మంపై మచ్చలు పడకుండా ఉంటుంది.

5.మైక్రోబీడ్స్, సీసాల్ట్ ను వాడండి

5.మైక్రోబీడ్స్, సీసాల్ట్ ను వాడండి

మైక్రోబీడ్స్ అనే చిన్న ప్లాస్టిక్ బీడ్స్ ఎక్స్ ఫోలియేషన్ కు చక్కగా పనికొస్తాయి. వీటి చిన్న బీడ్స్ రంథ్రాల్లో లోపలివరకు వెళ్ళగలవు కాబట్టి చర్మాన్ని శుభ్రం చేసి, తాజాగా ఉండేలా చేస్తాయి. మైక్రోబీడ్స్ ఉన్న ఫేస్ స్క్రబ్ ను ఎంచుకోండి.

సీసాల్ట్ చర్మరంథ్రాలలో మురికిని తొలగించి బ్లాక్ హెడ్స్ ను తన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో తొలగిస్తుంది. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని సీసాల్ట్ బౌల్ లో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ గడ్డంపై కొన్ని నిమిషాలు రుద్దండి.

బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఇంటి స్ట్రిప్స్ చిట్కాలు

బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఇంటి స్ట్రిప్స్ చిట్కాలు

కమలాపళ్ల తొక్కలను వాడటం

ఆరెంజి తొక్కలో విటమిన్ సి, ఇతర పోషకాలుండి మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి వివిధ చర్మసమస్యలతో బాగా పోరాడతాయి.

ఎలా వాడాలి

-కమలాపళ్ల తొక్కలను ఎండలో ఎండబెట్టి మిక్సీ సాయంతో మెత్తని పొడిలా చేయండి.

-1 చెంచా ఆరెంజి పొడిని 2 చెంచాల రోజ్ వాటర్ తో బౌల్ లో కలపండి.

-మెత్తని పేస్టులా చేయండి.

-దీన్ని మీ గడ్డంపై రాసి ఎండనివ్వండి.

-తడిచేతులతో మెల్లగా తీసేయండి.

-మీ మొహాన్ని చల్లనీరుతో కడగండి.

ఆలోవెరా

ఆలోవెరా

ఆలోవెరాలోని యాంటీబయాటిక్ లక్షణాలు చర్మం లోపాలను తొలగించేలా సాయం చేస్తాయి. ఇది చర్మానికి ఉపశమనాన్ని ఇస్తుంది,ఎక్కువ నూనెలు ఉత్పత్తి అవకుండా చూస్తుంది, గ్రంథులని శుభ్రపరుస్తుంది, అలా మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా చూస్తుంది. మీరు ఆలోవెరా జెల్ ను నేరుగా గడ్డంపై రాసుకుని 10-15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి.

నిమ్మ

నిమ్మ

నిమ్మకాయ గ్రంథులు ముడుచుకునేట్లా చేసి, బ్లాక్ హెడ్స్ ను నయం చేస్తుంది. ఇది చర్మంపై మచ్చలు, చారలు కూడా రాకుండా చేస్తుంది.

ఎలా వాడాలి

-దూదిని తీసుకొని దానిపై నిమ్మకాయను పిండండి.

-దీన్ని నేరుగా బ్లాక్ హెడ్స్ పై రాయండి. ఎండిపోనివ్వండి.

-గోరువెచ్చని నీరుతో మొహం కడుక్కోండి.

-ఈ పద్ధతిని వారంలో 2-3 సార్లు రిపీట్ చేయండి.

English summary

Homemade Strips To Remove Blackheads Forever

Blackheads are small bumps that are commonly seen on areas like the nose, chin, shoulders, and arms. It looks like pimples but actually it is not. One of the reasons behind blackheads is acne and excessive oil secretion from the skin. To get rid of blackheads permanently, try steam, blackhead removal strips or use microbeads and sea salt.
Story first published:Monday, May 21, 2018, 16:41 [IST]
Desktop Bottom Promotion