ఈ సింపుల్ హ్యక్స్ తో చర్మ రంధ్రాల సమస్యను తొలగించుకోండి.

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

యాక్నే, డల్ స్కిన్ తో పాటు మరెన్నో స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్ అనేవి స్కిన్ పోర్స్ క్లాగ్ అవటం వలన తలెత్తుతాయి. అందుకే, స్కిన్ పోర్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం ముఖ్యం. లేదంటే, వివిధ రకాల స్కిన్ ప్రాబ్లెమ్స్ బారిన పడవలసి వస్తుంది.

స్కిన్ పోర్స్ ను శుభ్రం చేసుకోవాలని మీరు కూడా ఆశిస్తున్నట్టయితే ఈ పోస్ట్ అనేది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు బోల్డ్ స్కై లో వివిధ మార్గాల ద్వారా స్కిన్ పోర్స్ ను శుభ్రం చేసుకునే విధానం గురించి స్పష్టంగా వివరించాము. తద్వారా, మీరు మీ కాంప్లెక్షన్ ని మరింత బ్రైట్ గా మార్చుకోవచ్చు.

Say Goodbye To Pores Forever With These Simple Hacks

ట్రైడ్ అండ్ టెస్టడ్ మెథడ్స్ కాబట్టి ఇవి మీకు మెరుగైన ఫలితాలను అందిస్తాయని ఆశిస్తున్నాము. తద్వారా, మీ చర్మం కాంతివంతంగా అలాగే తేటగా మారుతుంది. ఈ మెథడ్స్ అనేవి మీ చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించి యాక్నే, డల్ స్కిన్ వంటి చర్మ సమస్యల నుంచి మీకు ఉపశమనం అందిస్తాయి.

ఈ మెథడ్స్ లో వేటినైనా పాటించి స్కిన్ పోర్స్ లో పేరుకుపోయిన దుమ్మును అలాగే టాక్సిన్స్ ను తొలగించుకోండి. తద్వారా, మీరెప్పటినుంచో కలవరిస్తున్న అందమైన చర్మాన్ని పొందవచ్చు.

వీటిని పరిశీలించండి మరి:

ఫేషియల్ స్టీమ్:

ఫేషియల్ స్టీమ్:

త్వరగా పోర్స్ ని అన్ క్లాగ్ చేసే ప్రక్రియ ఇది. స్టీమ్మింగ్ అనేది పోర్స్ లో పేరుకుపోయిన దుమ్మును ధూళిని తొలగించి చర్మాన్ని శుభ్రపరచి కాంతివంతంగా మారుస్తుంది. ఆశించిన ఫలితాలను అందుకోవాలంటే, స్టీమ్మింగ్ ను వారానికి రెండు సార్లు పాటించడం మంచిది. ఈ పద్దతి ద్వారా పోర్స్ అన్ క్లాగ్ అవటంతో పాటు బ్రేక్ అవుట్స్ సమస్య దరి చేరదు.

బేకింగ్ సోడా పేస్ట్:

బేకింగ్ సోడా పేస్ట్:

పోర్ క్లీనింగ్ ఇంగ్రిడియెంట్ గా బేకింగ్ సోడాను పేర్కొనవచ్చు. పోర్స్ లోకి చేరి అందులో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగిస్తుంది బేకింగ్ సోడా. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో కొంత నీటిని కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అయిదు నుంచి పది నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

స్క్రబ్

స్క్రబ్

ఎక్స్ఫోలియేషన్ అనేది ముఖ్యమైన స్కిన్ కేర్ మెథడ్. ఇది పోర్స్ ని శుభ్రపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్యూటీ స్టోర్స్ లో మీరు గనక చూస్తే అనేక స్క్రబ్స్ అందుబాటులో ఉంటాయి. పోర్స్ ని శుభ్రపరుస్తాయని వాటి గురించి ప్రకటనలు కూడా వెలువడతాయి. మీ స్కిన్ టైప్ కి సరిపోయే కమర్షియల్ స్క్రబ్ ను ఎంచుకోండి. అలాగే, కొనేముందు మీరు ఎంచుకోబోయిన స్క్రబ్ కి సంబంధించిన రివ్యూస్ ని కూడా పరిశీలించండి.

షుగర్ స్క్రబ్

షుగర్ స్క్రబ్

షుగర్ లో ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇది అద్భుతమైన స్కిన్ కేర్ ఇంగ్రీడియెంట్. ఈ నేచురల్ స్క్రబ్బింగ్ ఇంగ్రిడియెంట్ చర్మంలోకి చేరి డీప్ పోర్ క్లీన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ గ్రాన్యులేటెడ్ షుగర్ లో కాస్తంత నిమ్మరసాన్ని కలపండి. ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేయండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

లెమన్ ట్రీట్మెంట్:

లెమన్ ట్రీట్మెంట్:

లెమన్ అనేది క్లాగ్డ్ పోర్స్ సమస్యను అరికట్టేందుకు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. దీని ఎసిడిక్ ప్రాపర్టీస్ వలన పోర్స్ లో నున్న దుమ్మూ ధూళి తొలగిపోతాయి. చర్మం పిహెచ్ లెవెల్ అనేది బాలన్స్ అవుతుంది. మీ రెగ్యులర్ ఫేస్ మాస్క్ లో నిమ్మరసాన్ని కలపి లెమన్ లోని ప్రయోజనాలను పొందవచ్చు. లేదా తేనెలో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేసుకోవచ్చు.

రైస్ పౌడర్ స్క్రబ్:

రైస్ పౌడర్ స్క్రబ్:

చివరగా, రైస్ పౌడర్ స్క్రబ్ గురించి తెలుసుకుందాం. చర్మాన్ని శుభ్రపరచడానికి పోర్స్ ని అన్ క్లాగ్ చేయడానికి ఈ స్క్రబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్క్రబ్ ని ఇంటివద్దే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ స్క్రబ్ ద్వారా స్కిన్ పోర్స్ లో ఇరుక్కున్న ఇంప్యూరిటీస్ అలాగే టాక్సిన్స్ అనేవి తొలగిపోతాయి. చర్మం అందంగా తయారవుతుంది. అర టీస్పూన్ రైస్ పౌడర్ లో ఒక టీస్పూన్ మిల్క్ ను కలపాలి. ఈ పేస్ట్ ను ముఖంపై స్క్రబ్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకుంటే చర్మం తేటగా అలాగే కాంతివంతంగా మారుతుంది.

English summary

Say Goodbye To Pores Forever With These Simple Hacks

Dealing with skin problems, especially pores, can be quite frustrating. There are some simple and easy hacks which will keep your skin free from pores for a long time. Facial steam, baking soda paste, scrub, pore strip, activated charcoal mask, etc., could be some interesting hacks you might want to try.