ఈ చిట్కాలతో నల్లని మోచేతులు, మోకాళ్ళకు సెలవు చెప్పండి

Subscribe to Boldsky

సర్వసాధారణంగా ప్రతిఒక్కరికి మోచేతులు, మోకాళ్ళు నల్లగా ఉంటాయి. ఈ సమస్య మనకి కూడా ఉంటుంది. అవునా? కాదా? కొన్నిసార్లు చేతులు కాళ్లతో పోలిస్తే మోచేతులు మోకాళ్ళ రంగు వేరేగా ఉంటుంది.

మనం ముఖం అందంగా కనపడటం పట్ల మాత్రమే శ్రద్ధ చూపిస్తాం, కానీ మోచేతులు, మోకాళ్ళ రంగు పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పొత్తిచేతుల జాకెట్లు, పొట్టి దుస్తులు వేసుకున్నప్పుడు అవి అసహ్యంగా కనపడతాయి.

మోచేతులు మోకాళ్ళు మీది చర్మం తరచుగా ఇతర ఉపరితలాలతో రాసుకోవడం చేత నల్లగా మారతాయి.

Say Goodbye To Dark Elbows And Knees With These Remedies

ఈ సమస్య పరిష్కారానికి మార్కెట్లో వివిధ రకాల రెడీ-మేడ్ క్రీములు లభించినా కాని మీరు వీటికై డబ్బును, సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇంట్లోనే సులభమైన చిట్కాలతో సత్వర ఫలితం పొందే అవకాశం ఉన్నప్పుడు వీటి గురించి ఆలోచించడం అనవసరం.

మోచేతులు మోకాళ్ళు మీద చర్మం కాంతివంతంగా మారడానికి వివిధ సహజ పదార్థాలను వాడి పదిరోజుల లోగానే ఫలితం పొందవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి!

 కలబంద:

కలబంద:

ఇది ముఖ చర్మమంతటా ఒకటే ఛాయ ఉండేటట్టు చేసి ఎండ వలన ఏర్పడిన మృతకణాలను తొలగిస్తుంది. అంతేకాక, చర్మానికి తేమ చేకూర్చి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. ఆకుకు పైవైపుగా ఉండే పొరను తొలగిస్తే లోపల గుజ్జు కనపడుతుంది. ఈ గుజ్జును తీసుకుని మోచేతులు మోకాళ్ళు మీద రాసుకుని కొద్ది నిమిషాల పాటు వదిలేయండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పంచదార:

పంచదార:

పంచదారని ఉపయోగించడం వలన మోచేతులు మోకాళ్ళు మీద చర్మం నునుపుగా, కాంతివంతంగా మారుతుంది. పంచదార రేణువులు మృతకణాలను తొలగిస్తాయి.

పంచదార మరియు ఆలివ్ ఆయిళ్ళను సమాన నిష్పత్తిలో కలిపి మోచేతులు మోకాళ్ళు మీద వలయాకారంలో రుద్దండి. పది నిమిషాలు తరువాత గాఢత తక్కువ ఉన్న సబ్బు, నీటిని ఉపయోగించి కడిగేయండి. ఇలా రోజు చేస్తే త్వరగా ఫలితం వస్తుంది.

3. నిమ్మకాయ:

3. నిమ్మకాయ:

నిమ్మకాయ సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మమంతా ఒకే రంగుతో ఉండేటట్టు చేస్తుంది. దీనిలోని విటమిన్ సి మృతకణాలను తొలగించి తేటుగా మారుస్తుంది. నిమ్మరసాన్ని మోచేతులు మోకాళ్ళకు రాసుకుని, ఇరవై నిమిషాల పాటు అయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేయండి. తరువాత మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోండి.

ఒక నిమ్మకాయ రసాన్ని పిండి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయండి.

4. పెరుగు:

4. పెరుగు:

పెరుగులో లాక్టిక్ ఆమ్లం మెండుగా ఉంటుంది. ఇది మీ మేని ఛాయను తేలికపరుస్తుంది. చర్మానికి క్లెన్సింగ్ మరియు తేమను చేకూర్చి మాయిశ్చరైజింగ్ చేస్తుంది.

ఒక టీ స్పూన్ పెరుగులో వైట్ వెనిగర్ కలిపి మెత్తని పేస్టు చేయండి. దీనిని ప్రభావిత ప్రాంతాల్లో రాసుకుని ఎండనిచ్చిన తరువాత గోరు వెచ్చని నీటితో నీటితో కడిగేయండి. శుభ్రంగా తుడుచుకున్నాక మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోండి. ఇలా ప్రతి రోజు కొన్ని వారాల పాటు చేయండి.

 5. బొప్పాయి:

5. బొప్పాయి:

బొప్పాయి లోని సహజ తత్వాలు మేనిఛాయను మెరుగుపరచడమే కాక తేమనందిస్తుంది. ఇది మోచేతులు మోకాళ్ళ వద్ద ఉండే దలసరిగా ఉండే చర్మంపై మంచి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా చేసి బాగా మెదపండి. దీనికి ఒక టీ స్పూన్ నీటిని కలపండి. దీనిని మోచేతులు మోకాళ్ళు మీద రాసుకుని పది నిమిషాల పాటు వదిలేయండి. తరువాత నీటితో కడిగేయండి.

6. పాలు:

6. పాలు:

పాల వలన త్వరితగతిన ఫలితం రాకపోయినా క్రమంగా వాడుతుంటే మీరు కోరుకున్న గుణం కనిపిస్తుంది. ఒక దూది ఉండను పాలలో ముంచి నల్లగా మారిన మోచేతులు మోకాళ్ళు మీద రాసుకోండి. ఇది రోజు ఒక అలవాటుగా మార్చుకోండి.

7. శనగపిండి మరియు పెరుగు:

7. శనగపిండి మరియు పెరుగు:

పెరుగులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో పాటు సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. శనగపిండి మృతకణాలను తొలగిస్తుంది.శనగపిండి మరియు పెరుగు సమాన నిష్పత్తిలో కలిపి మోచేతులు మోకాళ్ళు మీద దలసరిగా పూయండి. పది నిమిషాలు తరువాత సబ్బు, గోరు వెచ్చని నీటిని ఉపయోగించి కడిగేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే త్వరగా ఫలితం వస్తుంది.

8. బంగాళాదుంపలు:

8. బంగాళాదుంపలు:

నల్లని మోచేతులు మోకాళ్ళు మీద బంగాళాదుంపలు బాగా పనిచేస్తాయి. బంగాళాదుంపలను చిన్నముక్కలుగా తురిమి పేరుతో కలపండి. దీనిని మోచేతులు మోకాళ్ళు మీద రాసుకుని ఇరవై ఐదు నిమిషాలు తరువాత కడిగేయండి. ఇలా రోజు విడిచి రోజు చొప్పున కొన్ని వారాల పాటు చేస్తే ఆశ్చర్య పోయే ఫలితాలు మీ సొంతమవుతాయి.

 9. కొబ్బరినూనె:

9. కొబ్బరినూనె:

గరుకైన చర్మాన్ని నునుపుదేరాడానికి కొబ్బరినూనెతో మర్దన చేసి గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. సబ్బును వాడకండి. స్నానం చేశాక శుభ్రంగా తుడుచుకోండి. స్నానానికి వాడే నీటికి నిమ్మరసం కూడా జతచేయవచ్చు. ఇలా రోజు చేస్తే కొన్ని వారాలకి మంచి ఫలితం కనిపిస్తుంది.

10. పసుపు:

10. పసుపు:

పసుపుకు చర్మ సమస్యలను నివారించే గుణాలుంటాయి. అధిక క్రొవ్వును కలిగిన పాలలో పసుపును కలిపి మోచేతులు మోకాళ్ళు మీద రాసుకుని కొన్ని నిమిషాలు తరువాత సబ్బుతో కడిగేయండి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Say Goodbye To Dark Elbows And Knees With These Remedies

    Dark elbows and knees are common for everyone now. Most of us face the problem of discolouration, isn't it? Sometimes, the colour of our elbows and knees is different as compared to that of our hands and legs. Some ingredients like coconut oil, lemon, yogurt, etc., can treat dark elbows and knees.While most of us only concentrate on making our face appear brighter,
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more