వైట్ హెడ్స్ తో పోరాడే చాలా సులభమైన ఇంట్లో తయారుచేసుకోగలిగే ఫేస్ ప్యాక్ లు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ చర్మగ్రంథుల్లో మృతచర్మ కణాలి, నూనె,కలుషితాలు పేరుకుపోయినప్పుడు వచ్చే సన్నని, గుండ్రటి, తెల్ల పొక్కుల్లాంటి వాటిని వైట్ హెడ్స్ అంటారు. ఈ రకమైన మొటిమల్లాంటి పొక్కులు ముఖంపై ఎక్కడైనా రావచ్చు. ఈ చర్మసమస్య అన్ని వయస్సుల స్త్రీలకు సాధారణంగా వస్తుంది.

బ్యూటీ స్టోర్లలో ఈ వైట్ హెడ్స్ తో పోరాడే కమర్షియల్ చర్మ సంరక్షణ ఉత్పత్తులు టన్నులు టన్నులుగా చాలానే ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే ఆ కోలాహలానికి తగ్గట్టు నిజంగా నిలబడేవి.

Super-easy DIY Face Packs To Tackle Whiteheads

అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్త్రీలు వైట్ హెడ్స్ తొలగించుకోవటానికి సహజ చిట్కాలను ప్రయత్నిస్తారు. ఖరీదైన, స్టోర్ లో కొన్న ఉత్పత్తులతో పోలిస్తే, ఈ సహజ చిట్కాలు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి మరియు చవకైనవి కూడా.

నిజానికి ఈ చిట్కాలను ఒకదానితో ఒకటి కాంబినేషన్లలో ఫేస్ ప్యాక్ లుగా వాడినప్పుడు, వాటి ప్రభావం మరింత ఎక్కువగా, ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది.

ఇక్కడ, మేము మీకోసం మీరు ఇంట్లోనే తయారుచేసుకోలిగే ఫేస్ ప్యాక్ ల లిస్టును అందించాం. ఇవి వైట్ హెడ్స్ తో పోరాడి, మీకు మెత్తని మరియు మృదువైన చర్మాన్ని అందిస్తాయి.

గమనికః ఈ ప్యాక్ లన్నిటినీ ముఖానికి వాడేముందు ఒక సారి మీ చర్మంపై ప్రయత్నించి పరీక్షించి చూడటం మంచిది.

ఫేస్ ప్యాక్ 1; ఓట్ మీల్ మరియు పెరుగు

ఫేస్ ప్యాక్ 1; ఓట్ మీల్ మరియు పెరుగు

మీకు కావాల్సినవిః

1చెంచా ఓట్మీల్

2 చెంచాల పెరుగు

ఎలా వాడాలిః

-రెండు పదార్థాలను కలిపి ప్యాక్ ను తయారుచేయండి.

-ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోటంటా పట్టించండి.

-అక్కడే 10-15 నిమిషాలు ఎండనివ్వండి.

-గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వాడి మంచి ఫలితాలు పొందండి.

ఇది ఎందుకు పనిచేస్తుందిః

ఈ కాంబినేషన్ మీ చర్మంపై చేరిన మురికిని బయటకిలాగి, వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.

ఫేస్ ప్యాక్ 2; టమాటా మరియు నిమ్మరసం

ఫేస్ ప్యాక్ 2; టమాటా మరియు నిమ్మరసం

మీకు కావాల్సినవిః

1 చెంచా టమాటా రసం

½ చెంచా నిమ్మరసం

ఎలా వాడాలిః

-పైన చెప్పిన పదార్థాలను కలిపి మిశ్రమం తయారుచేయండి.

-మీ ముఖమంతా ఈ మిశ్రమాన్ని పట్టించండి.

-10-15 నిమిషాలు ఎండనివ్వండి.

- తేలికపాటి క్లెన్సర్ తో మరియు గోరువెచ్చని న్టీటితో ముఖాన్ని కడుక్కోండి.

-ఈ ఇంట్లో తయారుచేసిన ప్యాక్ తో వారానికోసారి ప్రయత్నించి వైట్ హెడ్స్ ను తొలగించుకోండి.

ఇది ఎందుకు పనిచేస్తుందిః

ఇందులో చెప్పిన పదార్థాలలోని బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు వైట్ హెడ్స్ కలగటానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడి, మృదువైన, మెత్తని చర్మాన్ని అందిస్తుంది.

ఫేస్ ప్యాక్ 3; గ్రీన్ టీ మరియు సెనగపిండి

ఫేస్ ప్యాక్ 3; గ్రీన్ టీ మరియు సెనగపిండి

మీకు కావాల్సినవి;

1 చెంచా గ్రీన్ టీ

½ చెంచా సెనగపిండి

ఎలా వాడాలిః

-పైన చెప్పిన పదార్థాలను కలిపి మిశ్రమం తయారుచేయండి.

-సమస్య ఉన్న చోటంతా పూయండి.

-10 నిమిషాలు అలానే ఉండనివ్వండి.

-అయ్యాక, మీ చర్మాన్ని గోరువెచ్చని నీటితో కడిగేయండి.

-వారానికోసారి ఇలా చేసి కావాల్సిన ఫలితాలు పొందండి.

ఇది ఎందుకు పనిచేస్తుందిః

ఈ ప్యాక్ పేరుకున్న విషపదార్థాలను, కలుషితాలను మీ చర్మం నుంచి తొలగించి, వైట్ హెడ్స్ ను సమూలంగా తొలగిస్తుంది.

ఫేస్ ప్యాక్ 4; విచ్ హేజెల్ మరియు తేనె

ఫేస్ ప్యాక్ 4; విచ్ హేజెల్ మరియు తేనె

మీకు కావాల్సినవిః

4-5 చుక్కల విచ్ హేజెల్

1 చెంచా తేనె

ఎలా పనిచేస్తుందిః

-పైన చెప్పిన పదార్థాలను కలిపి ప్యాక్ తయారుచేయండి.

-మెల్లగా సమస్య ఉన్నచోటంతా మసాజ్ చేయండి.

-అక్కడే 5-10 నిమిషాలు ఆరనివ్వండి.

-గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- రెండు వారాలకోసారి ఈ ప్యాక్ ప్రయత్నించి మంచి ఫలితాలు మీరే చూడండి.

ఇది ఎందుకు పనిచేస్తుందిః

సుగంధ పూల మొక్క అయిన విచ్ హేజెల్ యొక్క ఘాటు లక్షణాలు మరియు తేనె యొక్క మంచి లక్షణాలు వైట్ హెడ్స్ ను సమర్థవంతంగా తొలగిస్తాయి.

ఫేస్ ప్యాక్ 5; విటమిన్ ఇ నూనె మరియు టీ ట్రీ నూనె

ఫేస్ ప్యాక్ 5; విటమిన్ ఇ నూనె మరియు టీ ట్రీ నూనె

మీకు కావాలసినవిః

1 విటమిన్ ఇ క్యాప్సూల్

3-4 చుక్కల టీ ట్రీ నూనె

ఎలా వాడాలి;

-విటమిన్ ఇ క్యాప్సూల్ నుంచి నూనెను తీసి, చెప్పిన మొత్తంలో టీ ట్రీ నూనెతో కలపండి.

-మెల్లగా ఈ మిశ్రమాన్ని ముఖమంతా మసాజ్ చేయండి మరియు 10-15 నిమిషాలు అలా ఎండనివ్వండి.

-అయ్యాక, గోరువెచ్చని నీటితో ముఖం కడిగేయండి.

-నెలకి రెండు సార్లు ఈ ప్యాక్ ను వాడి మంచి ఫలితాలు పొందండి.

ఇది ఎందుకు పనిచేస్తుంది:

ఈ మిశ్రమం మీ చర్మం లోపలి పొరల వరకూ ఇంకి, కలుషితాలు, మురికిని తొలగిస్తుంది. అలా మీ బ్లాక్ హెడ్స్ త్వరగా చక్కగా నయమవుతాయి.

ఫేస్ ప్యాక్ 6; గంధం పొడి మరియు రోజ్ వాటర్

ఫేస్ ప్యాక్ 6; గంధం పొడి మరియు రోజ్ వాటర్

మీకు కావాల్సినవి;

½ చెంచా గంధం పొడి

2 చెంచాల రోజ్ వాటర్

ఎలా వాడాలిః

-అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి, పేస్టులా కలపండి.

-సమస్య ఉన్న చోట ఈ మిశ్రమాన్ని పూసి, 10-15 నిమిషాల పాటు ఎండనివ్వండి.

-గోరువెచ్చని నీటితో కడిగేయండి

-వారానికి రెండుసార్లు, మీ చర్మంపై ఈ సులభమైన ప్యాక్ ప్రయత్నించి మంచి ఫలితాలు పొందండి.

ఎలా పనిచేస్తుందిః

గంధంపొడి మరియు రోజ్ వాటర్, రెండు పదార్థాలలో బ్యాక్టీరియా వ్యతిరేక మరియు చర్మానికి ఉపశమనాన్ని ఇచ్చే లక్షణాలు ఉండటం వలన వైట్ హెడ్స్ తిరిగి రాకుండా బాగా నయం చేయగలవు.

ఫేస్ ప్యాక్ 7; మెంతులు మరియు ఆలోవెరా జెల్

ఫేస్ ప్యాక్ 7; మెంతులు మరియు ఆలోవెరా జెల్

మీకు కావాల్సినవి;

చేతికి పట్టినన్ని మెంతులు

2 చెంచాల ఆలోవెరా జెల్

ఎలా వాడాలిః

-మెంతులను ఒక గిన్నె నిండా నీటిలో 5-6 గంటలు నాననివ్వండి.

-నానాక, మెంతులను తాజా ఆలోవెరా జెల్ తో కలిపి పేస్టులా రుబ్బండి.

-ఈ రుబ్బిన ప్యాక్ ను సమస్య ఉన్న చోట పూయండి.

-అలాగే 10 నిమిషాలపాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

ఇది ఎందుకు పనిచేస్తుంది;

ఈ అద్భుతమైన కాంబినేషన్ పేరుకుపోయిన గ్రంథులను శుభ్రం చేసి, మొండి వైట్ హెడ్స్ ను నయం చేస్తుంది.

English summary

Super-easy DIY Face Packs To Tackle Whiteheads

Super-easy DIY Face Packs To Tackle Whiteheads, Whiteheads are tiny, round, white bumps that occur when your skin pores become clogged with dead skin cells, oil and impurities. Natural ingredients such as oatmeal, yogurt, tomato, etc., when applied on a regular basis helps reduce the growth of whiteheads.