For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ప్లిట్ ఎండ్స్ సమస్యకి దారితీసి మీ శిరోజాలను దెబ్బతీసే పది సాధారణ అలవాట్లు

|

ఈ మధ్యకాలంలో అనేక పరిస్థితుల రీత్యా మహిళల శిరోజాల సౌందర్యం దెబ్బతింటోంది. అనేక జుట్టు సమస్యలు దాడి చేస్తున్నాయి. బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ అనేవి అతి సాధారణ సమస్యలుగా మారాయి.

కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్ల వంటివి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా, అనేక జుట్టు సమస్యలు ఎదురవుతాయి. వీటికి తోడు, కొన్ని అలవాట్లు కూడా శిరోజ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. తద్వారా, మీ అఫియరెన్స్ దెబ్బతింటుంది.

10 Common Habits That Damage Your Hair And Cause Split Ends

ఈ రోజు బోల్డ్ స్కైలో, జుట్టుని దెబ్బతీసే కొన్ని అలవాట్ల గురించి ప్రత్యేకించి చర్చించాము. ఈ అలవాట్లు అత్యంత సాధారణమైనవి. ఇవన్నీ జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ అలవాట్లను తొలగించుకుంటే అందమైన శిరోజాలు మీ సొంతమవుతాయి. మీరు అత్యంత అందంగా కనిపిస్తారు.

ఈ హెయిర్ డేమేజింగ్ హేబిట్స్ గురించి తెలుసుకుని వాటి నుంచి దూరంగా ఉండండి.

1. హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని అతిగా వాడటం:

1. హెయిర్ స్టైలింగ్ టూల్స్ ని అతిగా వాడటం:

ఈ మధ్యకాలంలో హెయిర్ స్టైలింగ్ టూల్స్ యొక్క వాడకం మరీ ఎక్కువయింది. హైర్ స్ట్రైటనర్స్, కర్లింగ్ ఐరన్స్ వంటి టూల్స్ ని తరచూ వాడటం వలన శిరోజాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ అలవాటు జుట్టు ఆకృతిపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తద్వారా, అనేక జుట్టు సమస్యలు తలెత్తుతాయి. స్ప్లిట్ ఎండ్స్ తో పాటు బ్రేకేజ్ సమస్య తలెత్తుతుంది.

2. స్ప్లిట్ ఎండ్స్ ను లాగడం:

2. స్ప్లిట్ ఎండ్స్ ను లాగడం:

ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇంకొక అలవాటు. ఈ అలవాటు వలన మరిన్ని స్ప్లిట్ ఎండ్స్ ఏర్పడతాయి. స్ప్లిట్ ఎండ్స్ ని లాగడం ద్వారా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చనుకుంటే సమస్య మరింత కఠినతరమవుతుంది. జుట్టు ఆరోగ్యం దెబ్బతిని ఆకృతి కూడా పాడవుతుంది.

3. అతిగా దువ్వడం

3. అతిగా దువ్వడం

శిరోజాలను దువ్వడం అవసరమే. అయితే, అతిగా దువ్వడం వలన మంచి కంటే చెడు జరిగే ప్రమాదం ఉంది. మీ శిరోజాలను దెబ్బతీసే ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది. అతిగా జుట్టును దువ్వడం వలన బ్రేకేజ్ సమస్య ఉత్పన్నమవుతుంది. రోజుకు కేవలం రెండు సార్లు మాత్రమే జుట్టును దువ్వుకోవడం మంచిది. అంతకంటే ఎక్కువసార్లు అదేపనిగా జుట్టును దువ్వుతూ ఉంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి, ఈ సంఖ్యకు కట్టుబడి శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

4. కెమికల్ ప్రోడక్ట్స్ ని వాడటం:

4. కెమికల్ ప్రోడక్ట్స్ ని వాడటం:

మార్కెట్లో లభించే వివిధ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం కెమికల్స్ తో తయారైనవే. హెయిర్ సెరమ్స్, స్ప్రేలు, హెయిర్ మౌస్ వంటివి కఠినమైన కెమికల్స్ తో తయారైనవి. ఈ కెమికల్ ప్రోడక్ట్స్ ని వాడటం వలన జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ తో పాటు స్ప్లిట్ ఎండ్స్ సమస్యకు దారితీస్తుంది.

5. ఎప్పుడూ టాప్ నాట్ వేసుకోవడం:

5. ఎప్పుడూ టాప్ నాట్ వేసుకోవడం:

టాప్ నాట్ అనేది స్టైలిష్ హెయిర్ స్టయిల్. అందులో, ఏ మాత్రం సందేహం లేదు. అందుకే, ఈ హెయిర్ స్టైల్ అంటే ఎక్కువమందికి ఇష్టం. అయితే, ఎల్లప్పుడూ ఈ హెయిర్ స్టైల్ కే పరిమితమవడం జుట్టుని దెబ్బతీస్తుంది. తద్వారా, స్ప్లిట్ ఎండ్స్ సమస్య వేధిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ ను వేసుకోవడం వలన వెంట్రుకలు బలహీనపడతాయి. హెయిర్ గ్రోత్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

6. టీజింగ్ లేదా బ్యాక్ కొంబింగ్:

6. టీజింగ్ లేదా బ్యాక్ కొంబింగ్:

టీజింగ్ లేదా బ్యాంక్ కొంబింగ్ ను చిక్కుని తగ్గించి హెయిర్ వాల్యూమ్ ని పెంచేందుకు వాడతారు. అయితే, జుట్టును వ్యతిరేక దిశలో దువ్వడం వలన హెయిర్ షాఫ్ట్ బలహీనపడుతుంది. తద్వారా, బ్రేకేజ్ తో పాటు స్ప్లిట్ ఎండ్స్ తలెత్తుతాయి.

7. జుట్టును అతిగా వాష్ చేయడం:

7. జుట్టును అతిగా వాష్ చేయడం:

జుట్టును అతిగా వాష్ చేయడం వలన స్కాల్ప్ లో తేమశాతం తగ్గిపోతుంది. తద్వారా, పొడిబారిన జుట్టు సమస్య వేధిస్తుంది. అతిగా జుట్టును వాష్ చేయడం వలన స్కాల్ప్ లోని సహజసిద్ధమైన నూనెల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువలన, వారానికి రెండు సార్ల కంటే ఎక్కువ జుట్టును వాష్ చేయకూడదు.

8. టైట్ హెయిర్ స్టైల్స్:

8. టైట్ హెయిర్ స్టైల్స్:

టైట్ హెయిర్ స్టైల్స్ ను వేసుకోవడం ద్వారా స్కాల్ప్ ఏరియా పై ఒత్తిడి పడుతుంది. వెంట్రుకలు బలహీనపడతాయి. హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం మరీ టైట్ గా ఉండే హెయిర్ స్టయిల్స్ కు మహిళలు దూరంగా ఉండటం మంచిది. లేదంటే, వెంట్రుకలు దెబ్బతిని అందవిహీనంగా మారతాయి.

9. తడి జుట్టును దువ్వడం:

9. తడి జుట్టును దువ్వడం:

జుట్టు తడి ఆరకుండా దువ్వడం వలన మీ శిరోజాలకు తీవ్రమైన డేమేజ్ కలుగుతుంది. తద్వారా, జుట్టు అందవిహీనంగా మారుతుంది. అంతేకాకుండా, తడి వెంట్రుకలనేవి ఎక్కువగా డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ అలవాటును అలాగే కంటిన్యూ చేస్తే స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఎదురవుతుంది.

10. వేడినీటితో జుట్టును వాష్ చేయడం:

10. వేడినీటితో జుట్టును వాష్ చేయడం:

ఈ అలవాటు కూడా స్ప్లిట్ ఎండ్స్ కి కారణమవుతుంది. వేడినీటితో శిరోజాలను శుభ్రం చేయడం మంచిది కాయూద్. దీని వలన, స్కాల్ప్ పై నున్న సహజసిద్ధమైన తేమ తొలగిపోతుంది. తద్వారా జుట్టు డిహైడ్రేటెడ్ అవుతుంది. తరచూ వేడినీటితో జుట్టును వాష్ చేస్తే శిరోజాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మీ జుట్టు అందవికారంగా అలాగే నిస్తేజంగా కనిపిస్తుంది.

English summary

10 Common Habits That Damage Your Hair And Cause Split Ends

10 Common Habits That Damage Your Hair And Cause Split Ends,There are varies factors for dry and damaged hair. It may be due to pollution, unhealthy diet etc. Apart from these, there are other factors too that can damage your hair such as hair styling, hair coloring, etc.
Desktop Bottom Promotion