For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీప్ క్లీన్సింగ్ కు ముఖానికి మట్టి ఫేస్ మాస్క్ లు చాలా మేలు

డీప్ క్లీన్సింగ్ చికిత్స కోసం సహాయపడే అనేక రకాల మట్టి రకాలున్నాయి. ఇవి వివిధరకాల ఖనిజాలు మరియు పోషకాలతో నింపబడి ఉంటాయి, ఫుల్లర్స్ ఎర్త్, బెంటోనైట్ బంకమట్టి వంటి మట్టి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

By Ashwini Pappireddy
|

డీప్ క్లీన్సింగ్ అనేది మన చర్మ రంద్రాలను శుభ్రంగా మరియు క్లియర్ గా ఉంచడానికి సహాయపడే ఒక ముఖ్యమైన చర్మ చికిత్స. ఇది కేవలం మన చర్మ రంద్రాలలోని మలినాలను బయటకి పంపించడమే కాకుండా చర్మ పెరుగుదలకు సహాయపడి మచ్చలను తొలగిస్తుంది.

మీకు తెలుసా! ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు వారి నెలవారీ డీప్ క్లీన్సింగ్ చికిత్స కోసం సెలూన్లకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ, ఆధునిక చర్మ సంరక్షణా చికిత్సలు మరియు సౌందర్య ఉత్పత్తు లు రాకముందు, మట్టి వంటి సహజ పదార్ధాలపై ఆధారపడి మహిళలు తమ చర్మానికి ఎలాంటి హాని లేకుండా తమ చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకోవడానికి వాడేవారు.

ఎక్సఫోలియాటింగ్ కి మట్టి ఒక సహజమైన మూలం. మట్టి ని ప్రాచీన కాలంనుండి ఎంతోమంది మహిళలు వివిధరకాలుగా వారి చర్మ సౌందర్యం మరియు చర్మాన్ని శుభ్రపరుచుకోవడనికి ఉపయోగించారు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు కూడా..

అంతేకాకుండా, డీప్ క్లీన్సింగ్ చికిత్స కోసం సహాయపడే అనేక రకాల మట్టి రకాలున్నాయి. ఇవి వివిధరకాల ఖనిజాలు మరియు పోషకాలతో నింపబడి ఉంటాయి, ఫుల్లర్స్ ఎర్త్, బెంటోనైట్ బంకమట్టి వంటి మట్టి మీ చర్మానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.

మేము ఇవాళ్టి బోల్డ్ స్కై లో, ఇంటి వద్దే ఎంతో సులభంగా డీప్ ఫోర్స్ ని శుభ్రం చేసుకొనే మడ్ మాస్క్ ల గురించి తెలియజేయడం జరిగింది.

ఈ క్రింది తెలియజేసిన మడ్ మాస్క్ లలో ఒకదానిని నెలకి ఒకసారి ఉపయోగించడం వలన మీ చర్మాన్ని రక్షించుకోవడమే కాకుండా ఎప్పుడూ మీ చర్మం అందంగా నిగారిస్తూ ఉంటుంది.

ఇక్కడ మడ్ మాస్క్ ల గురించి చదివి తెలుసుకుందాం.

గమనిక:ఈ క్రింది తెలిపిన ఏ మాస్క్ నైనా మీ ముఖానికి అప్లై చేసుకునే ముందు టెస్ట్ చేసుకొని వాడవలసిందిగా సిఫార్సు చేయబడింది.

1. ఫుల్లర్స్ ఎర్త్ + అలో వెరా జెల్

1. ఫుల్లర్స్ ఎర్త్ + అలో వెరా జెల్

- 2-3 టీస్పూన్ల అలో వెరా జెల్ ని తీసుకొని ఫుల్లర్స్ ఎర్త్ మట్టిని 1 టీస్పూన్ ని కలపండి.

- ఇప్పుడు మీ ముఖాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని పైన కలిపిన మిశ్రమాన్ని మీ ముఖం అంతా రాసుకోండి.

- 10 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

2. బెంటోనైట్ క్లే - హనీ + లావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్

2. బెంటోనైట్ క్లే - హనీ + లావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్

- ఒక చిన్న గిన్నెలో ½ టీస్పూన్ బెంటోనైట్ మట్టి, 2 టీస్పూన్ల తేనె మరియు 2-3 చుక్కల లావెండర్

ఎస్సెన్షియల్ ఆయిల్ ని జతచేసి బాగా కలపండి.

- దీనిని మీ ముఖం మీద రాసుకోవడానికి బ్రష్ ని వుపయోగించి మొత్తం ముఖం అంతా రాసుకోండి.

- మంచినీటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 5-10 నిమిషాలు పొడిగా ఉండటానికి అనుమతించండి.

3. గ్రీన్ క్లే - వోట్మీల్ + చమోమిలే టీ

3. గ్రీన్ క్లే - వోట్మీల్ + చమోమిలే టీ

- ఒక గిన్నె లో ½ టీస్పూన్ వోట్మీల్, 2-3 టీస్పూన్ల చమోమిలే టీ మరియు యొక్క 1/2 టీస్పూన్

వోట్మీల్ ని తీసుకొని బాగా కలపండి.

- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి.

- 5 నిముషాల పాటు ఆరిన తర్వాత,గోరువెచ్చని నీటితో కడిగేయండి.

4. నల్ల మట్టి + దోసకాయ పేస్ట్

4. నల్ల మట్టి + దోసకాయ పేస్ట్

- 1 టేబుల్ స్పూన్ దోసకాయ పేస్ట్ లో 1 టేబుల్ స్పూన్ నల్ల మట్టిని కలిపి బాగా మిక్స్ చేయండి.

- పైన సిద్ధం చేసిన మాస్క్ ని మీ ముఖానికి రాసుకోండి.

- 10-15 నిమిషాల పాటు ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

5. ర్హస్సౌల్ క్లే + ఆలివ్ ఆయిల్

5. ర్హస్సౌల్ క్లే + ఆలివ్ ఆయిల్

- 2 టీస్పూన్ల ఆలివ్ నూనెలో 1 టీస్పూన్ ర్హస్సౌల్ క్లే ని కలపండి.

- బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తం రాసుకోండి.

- 10 నిముషాల పాటు ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

6. ఆల్పైన్ మూర్ మడ్ - వేప పొడి + కొబ్బరి నూనె

6. ఆల్పైన్ మూర్ మడ్ - వేప పొడి + కొబ్బరి నూనె

- కేవలం 1 టీస్పూన్ ఆల్పైన్ మూర్ మట్టిని,1/2 టీస్పూన్ వేప పొడి, 2 టీస్పూన్ల కొబ్బరి నూనె మరియు 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసుకోండి.

- 10 నిముషాల పాటు ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

7. వైట్ కయోలిన్ క్లే - విటమిన్ ఇ ఆయిల్ + రోజ్ వాటర్

7. వైట్ కయోలిన్ క్లే - విటమిన్ ఇ ఆయిల్ + రోజ్ వాటర్

- తెల్ల చైన మట్టి మట్టి యొక్క ½ టీస్పూన్ వైట్ కయోలిన్ క్లే, ఒక విటమిన్ E గుళిక మరియు 2 టీస్పూన్ల రోజ్ వాటర్ తో కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవడానికి బ్రష్ ని ఉపయోగించవచ్చు లేదా చేతితో అప్లై చేసుకోవచ్చు.

- 10 నిముషాల పాటు ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

8. ఫ్రెంచ్ రెడ్ క్లే + గ్రీన్ టీ

8. ఫ్రెంచ్ రెడ్ క్లే + గ్రీన్ టీ

- ఒక గిన్నె ని తీసుకొని ½ టీస్పూన్ ఫ్రెంచ్ ఎరుపు మట్టి మరియు 2-3 టీస్పూన్ల గ్రీన్ టీ ని తీసుకొని బాగా కలపండి.

- ఫై మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మీ ముఖం మీద రాసుకోండి.

- 5-10 నిమిషాల పాటు ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

9. ఫుల్లర్స్ ఎర్త్ - గ్రామ్ ఫ్లోర్ + టమాటో పల్ప్

9. ఫుల్లర్స్ ఎర్త్ - గ్రామ్ ఫ్లోర్ + టమాటో పల్ప్

-½ టీస్పూన్ శనగ పిండిలో 3 టీస్పూన్స్ టమోటా పల్ప్ మరియు 1 టీస్పూన్ ఫుల్లర్స్ మట్టిని జత చేసి

బాగా కలపండి.

- పైన సిద్ధం చేసుకున్న పేస్ మాస్క్ ని మీ ముఖానికి రాసుకోండి.

- 10 నిముషాల పాటు ఉండనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

10. బ్లాక్ మడ్ - టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ + ఆల్మాండ్ ఆయిల్

10. బ్లాక్ మడ్ - టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ + ఆల్మాండ్ ఆయిల్

- ఒక గిన్నెలో న ½ టీస్పూన్ ల్ల మట్టి ని తీసుకొని దానికి 1 టీస్పూన్ బాదం నూనె అలాగే 3 డ్రాప్స్

టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ని కలపండి.

- మీ ముఖం మీద పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేయండి.

- మీ ముఖం శుభ్రం చేయడానికి ముందు 10 నిమిషాలు పాటు ఆరనివ్వండి.

English summary

ten deep cleansing mud mask recipes for clean skin

ten deep cleansing mud mask recipes for clean skin
Story first published:Monday, January 22, 2018, 18:25 [IST]
Desktop Bottom Promotion