For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు చేసే ఈ చిన్న తప్పిదాల వల్ల, మీ ముఖ చర్మానికి నష్టం వాటిల్లుతుంది !

మీ ముఖాన్ని కడగడం ద్వారా చర్మ సంరక్షణను సులభంగా పొందవచ్చని అందరికి అనిపించవచ్చు. అందుకోసం మీరు క్లీనర్ను అప్లై చేయడం, స్క్రబ్తో శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు, అవునా? అయితే అది కనిపించేంత సులభం మాత్ర

|

మీ ముఖాన్ని కడగడం ద్వారా చర్మ సంరక్షణను సులభంగా పొందవచ్చని అందరికి అనిపించవచ్చు. అందుకోసం మీరు క్లీనర్ను అప్లై చేయడం, స్క్రబ్తో శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు, అవునా ? అయితే అది కనిపించేంత సులభం మాత్రం కాదు, మరియు దాన్నే సరిగ్గా ఆచరించకపోవడం వల్ల మీ చర్మానికి నష్టం వాటిల్లవచ్చు.

మీ ముఖాన్ని సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోవడం వల్ల, కంటికి కనపడనంత సూక్ష్మమైన రీతిలో చర్మము పోరలుగా పగిలిపోయే ఆస్కారమును కలిగి ఉంటుంది.

mistakes that are damaging your skin

మీ ముఖాన్ని శుభ్రం చేయటంలో జరిగే తప్పులు మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని చాలామందికి తెలియకపోవచ్చు. అలా మీరు చేసే తప్పులేంటి అని ఆశ్చర్యపోతున్నారా ! మీరు చేసే అలాంటి తప్పులను మేము కనుగొన్నాము. ఈరోజు, మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టపరిచేలా ఉన్న "ముఖాన్ని శుభ్రపరిచే విధానాలలో" ఉన్న లోపాలను బోల్డ్ స్కై పూర్తిగా సవరించింది.

మీ ముఖ చర్మానికి నష్టాన్ని చేకూర్చే పొరపాట్లను పూర్తిగా మానివేయటం వల్ల మీరు మరింత సహజమైన అందాన్ని పొందగలరు. ముఖాన్ని శుభ్రం చేయడంలో మీరు తరచుగా చేసే తప్పులను గూర్చి మరిన్ని వివరాలను చదివి తెలుసుకోండి.

1. వేడి నీటిని ఉపయోగించడం :

1. వేడి నీటిని ఉపయోగించడం :

వేడి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల, చర్మంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను తీసివేసి, మీ చర్మాన్ని మరింత పొడిగా చేసి, డీహైడ్రేట్ గా ఉంచుతుంది. అయినప్పటికీ కూడా, చాలామంది మహిళలు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వేడినీటినే ఉపయోగిస్తారు. దానికి బదులుగా గోరువెచ్చగా ఉన్న నీటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం యొక్క కణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

2. మీ చర్మానికి తగిన క్లీనర్ను ఉపయోగించకపోవడం :

2. మీ చర్మానికి తగిన క్లీనర్ను ఉపయోగించకపోవడం :

మనం అనేక రకాల చర్మాలను కలిగి ఉంటాము, మన చర్మానికి తగిన విధంగా ఉండే ఫేస్-వాష్లను, క్లీనర్లను మరియు స్క్రబ్లను ఉపయోగించడం అనేది చాలా ముఖ్యం. అలా చేయకపోవడం వల్ల మీ చర్మం యొక్క సహజమైన రూపాన్ని కోల్పోయి, మీ ముఖము చూడడానికి కళావిహీనంగా కనపడేలా దారితీయవచ్చు. కాబట్టి, మీరు కోరుకున్న విధంగా చర్మ అందాన్ని పొందే ఫలితాల కోసం, మీ చర్మానికి సరిపడే ఉత్పత్తి సాధనాలను ఉపయోగించడం తప్పనిసరి.

3. అపరిశుభ్రమైన చేతలను ఉపయోగించడం :

3. అపరిశుభ్రమైన చేతలను ఉపయోగించడం :

చర్మ సౌందర్యాన్ని సంరక్షించే ఉత్పత్తి సాధనాలను అప్లై చేసేటప్పుడు, అపరిశుభ్రమైన చేతులను ఉపయోగించడం వల్ల మీ చర్మానికి నష్టం వాటిల్లగలదు. ఒక రోజుల్లో మన చేతుల్లో చాలా దుమ్మును తాకుతున్నందున, ముఖాన్ని శుభ్ర పరుచుకొని ముందు, మీ చేతులను కూడా శుభ్రపరచుకోవడానికి చాలా అవసరం. ఈ చిన్న సాధారణమైన తప్పును మానివేయడం వల్ల ముఖాన్ని శుభ్ర పరిచుకునేటప్పుడు మీ చర్మానికి ఎలాంటి నష్టం వాటిల్లదని నిర్ధారించుకోండి.

4. క్లీనర్ను సరైన రీతిలో వాడకపోవడం :

4. క్లీనర్ను సరైన రీతిలో వాడకపోవడం :

ముఖాన్ని శుభ్రం చేయడానికి క్లీనర్ను చాలా కఠినమైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల మీ చర్మం ఎక్కువగా దెబ్బతినవచ్చు. కాబట్టి దానికి బదులుగా మీ చర్మానికి క్లీనర్తో శుభ్రం చేసేటప్పుడు, చర్మానికి హాని కలిగించని సున్నితమైన పద్ధతిలో శుభ్రం చేయండి.

5. తరచుగా మీ ముఖాన్ని శుభ్రం చేయటం :

5. తరచుగా మీ ముఖాన్ని శుభ్రం చేయటం :

ఒక రోజులో మీ ముఖాన్ని రెండుసార్లు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అయితే, చాలామంది రోజులో అనేకసార్లు వాళ్లని తరచుగా శుభ్రం చేసుకుంటారు. ఈ అలవాటు వల్ల చర్మం నుండి ఉత్పత్తి అయ్యే సహజమైన ఆయిల్ను తొలగించి, మీ ముఖాన్ని పొడిగా మార్చుతుంది. ఇలా జరగకుండా నిరోధించాలంటే మీ ముఖాన్ని రోజులో రెండుసార్లు మాత్రమే శుభ్రంగా కడగాలి.

6. ఒకే క్లీనర్ను చాలాకాలంగా వాడటం :

6. ఒకే క్లీనర్ను చాలాకాలంగా వాడటం :

ఒకే క్లీనర్ను ఎక్కువ కాలం వాడకుండా, తరచుగా మారుస్తూ ఉండాలని స్కిన్-కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒకే క్లీనర్ను ఎక్కువ కాలంపాటు తొలగించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలకు దారి తీయడమే కాకుండా, మంచికి బదులు ఎక్కువగా హానినే తలపెట్టగలవు.

7. ఎక్స్ఫోలియేషన్ ఎక్కువగా చేయడం :

7. ఎక్స్ఫోలియేషన్ ఎక్కువగా చేయడం :

ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా అవసరం అయితే, దీన్ని ఎక్కువగా ఆచరించటం వల్ల మీ చర్మానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది మీ చర్మం నుండి చనిపోయిన మృతకణాలను మరియు చర్మంలో చేరుకొని ఉన్న వ్యర్ధాలను బయటకు తొలగించగలదు. అయితే, మీరు ఈ పద్ధతిని వారంలో రెండుసార్లు కన్నా ఎక్కువ చేయడం వల్ల మీ చర్మం యొక్క సహజమైన రూపాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసి, మొటిమలకు మరియు చర్మ పగలడానికి కారణమవుతాయి.

8. పరిశుభ్రం చేయటం :

8. పరిశుభ్రం చేయటం :

మీ ముఖాన్ని శుభ్రం చేయడం కోసం క్లీనర్ను దరఖాస్తు చేసిన తర్వాత, దానిని పూర్తిగా పరిశుభ్రం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ క్లీనర్లు రసాయనాలతో పూర్తిగా నిండి ఉంటాయి కాబట్టి, దాని యొక్క మూలాలు మీ చర్మం మీద లేదని నిర్ధారించుకునేలా బాగా శుభ్రపరుచుకోవాలి. లేదంటే ఇది తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీయవచ్చు.

9. చర్మం ఎక్కువగా రుద్దడం :

9. చర్మం ఎక్కువగా రుద్దడం :

మీ ముఖాన్ని క్లీనర్తో శుభ్రపరిచిన తర్వాత, పొడిగా మారిన చర్మాన్ని ఎక్కువగా రుద్దుతున్నారా ? అలా అయితే, మీ ముఖం పొడిగా మారిన తర్వాత రుద్దడం వల్ల మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని మరియు ఆకర్షణీయతను కోల్పోయే విధంగా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. అలాంటప్పుడు, పొడిగా ఉన్న చర్మాన్ని రుద్దడానికి బదులుగా, శుభ్రమైన టవల్తో మీ ముఖాన్ని మెత్తగా తుడిచి శుభ్రం చేసుకోండి.

10. మాయిశ్చరైజర్ను ఈవిధంగా వాడాలి :

10. మాయిశ్చరైజర్ను ఈవిధంగా వాడాలి :

చిట్టచివరిగా, మీ ముఖాన్ని శుభ్రం చేసుకొన్న చాలా సమయం తర్వాత మాయిశ్చరైజర్ను (లేదా) సీరంను అప్లై చేయడం వల్ల చర్మం నష్టపోతుంది. ఏదో ఒక పద్ధతిలో ముఖాన్ని శుభ్ర పరిచిన తర్వాత, మన చర్మపు రంధ్రాలు బయటకు తెరుచుకుని ఉంటాయి అలాంటప్పుడు, కొన్ని సెకన్ల సమయంలోనే మాయిశ్చరైజర్ను అప్లై చేయడంవల్ల చర్మం యొక్క ఉపరితలంపై చేరుకునే దుమ్ము, ధూళిని, ఇతర మలినాలను సమర్థవంతంగా నిరోధిస్తాయి. ఈ విధంగా మాయిశ్చరైజర్ను వాడటం వల్ల మీ చర్మం మరింత కాంతివంతంగా ఉంటుంది.

English summary

10 Face-washing Mistakes That Could Be Damaging Your Skin

Wrong techniques that are used in washing the face can eventually cause damage your skin's health. Washing face in hot water can make your skin look dull and dry. Other factors such as too much of exfoliation, using the wrong face wash, washing face too often, etc., are the common mistakes that need to be avoided while washing the face.
Desktop Bottom Promotion