అవొకాడో ఆయిల్ తో చర్మానికి, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు

By Mallikarjuna
Subscribe to Boldsky

పండ్లలో అవొకాడో పండు కూడా ఒకటి. ఇది చూడటానికి పచ్చగా లోపల పసుపుపచ్చ వర్ణంలో నోరూరిస్తుంటుంది. అవొకాడో పండు తినడం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు, జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది.

అవొకాడో పండు మాత్రమే కాదు, దీన్ని నుండి సేకరించి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి మరియు ఇ, యాంటీయాక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, మినిరల్స్ చర్మం మరియు జుట్టుకు బహువిధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి

అందువల్ల అవొకాడో ఆయిల్ ను అనేక విధాలుగా అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగిస్తుంటారు. అవొకాడో ఆయిల్ బ్యూటీ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టుకు రెండింటికి గ్రేట్ గా సహాయపడుతుంది.

10 Incredible Benefits Of Avocado Oil For Hair And Skin

ముఖ్యంగా, దీన్ని రెగ్యులర్ బ్యూటీలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు, హెయిర్ మాస్క్ లలో లేదా చర్మానికి ఉపయోగించే రెగ్యులర్ క్రీములలో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు.

అదేవిధంగా, ఇప్పటివరకూ మీరు అవొకాడో ఆయిల్ ను బ్యూటీ కోసం ఉపయోగించనట్లైతే , ఈ ఆర్టికల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మరి అవొకాడో ఆయిల్ చర్మం, జుట్టుకు ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం...

జుట్టుకు

1. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

1. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

అవొకాడో ఆియల్ తలలో రక్తప్రసరణ పెంచడం వల్ల హెయిర్ ఫాలీ సెల్స్ స్ట్రాంగ్ గా మారి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆమ్లా నూనె లేదా ఆలివ్ నూనెతో అవొకాడో ఆయిల్ మిక్స్ చేసి జుట్టు పొడవును అప్లై చేయాలి.

2. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది

2. జుట్టును సాప్ట్ గా మార్చుతుంది

అవొకాడో నూనెలో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్, జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. పొడి జుట్టు ఉన్నవారికి ఇది బెస్ట్ ఆయిల్, వారానికొకసారి దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.

3. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

3. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది

అవొకాడో నూనెలో విటమిన్ బి, ఇలున్నాయి. ఇవి జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి. కాలుష్యం, సన్ రేస్, హీట్ స్టైలింగ్ టూల్స్ వల్ల జుట్టు పాడవకుండా అవొకాడో ఆయిల్ జుట్టుకు రక్షణ కల్పిస్తుంది.

4. జుట్టు మూలాల నుండి స్ట్రాంగ్ గా మార్చుతుంది

4. జుట్టు మూలాల నుండి స్ట్రాంగ్ గా మార్చుతుంది

బలహీనంగా ఉండే జుట్టు ఎప్పుడూ తెగిపోవడం జరుగుతుంటుంది. ఇది జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది. అవొకాడో ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టును స్ట్రాంగ్ చేసి, జుట్టు తెగిపోకుండా కాపాడుతుంది.

5. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది

5. జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది

అవొకాడో ఆయిల్ జుట్టుకు మంచి షైనింగ్ ను ఇస్తుంది. మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టులో కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. దాంతో జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా కనబడుతుంది

 చర్మానికి

చర్మానికి

1. చర్మం సాఫ్ట్ గా మార్చుతుంది

అవొకాడో నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంను సాఫ్ట్ గా సపెల్ గా మార్చుతుంది. రెగ్యులర్ బాడీ క్రీమ్ లో కొన్ని చుక్కల అవొకాడో నూనెను కలపి, చర్మానికి అప్లై చేస్తే చర్మం బేబీసాప్ట్ స్కిన్ లాగా మారుతుంది

2. చర్మానికి తగిన తేమను అందిస్తుంది

2. చర్మానికి తగిన తేమను అందిస్తుంది

డీహైడ్రేషన్ కారణంగా చర్మంలో తేమ కోల్పోయి, నిర్జీవంగా కనబడుతుంది. కాళ్ళు, చేతులు నిర్జీవంగా కనబడుతాయి. కాబట్టి, చర్మం అందంగా కనబడాలంటే బాగా మాయిశ్చరైజర్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యకు అవొకాడో నూనె బాగా పనిచేస్తుంది. డ్రై అండ్ డల్ స్కిన్ ను నివారిస్తుంది.

3. చర్మంలో మురికిని, క్రిములను తొలగిస్తుంది

3. చర్మంలో మురికిని, క్రిములను తొలగిస్తుంది

అవొకాడో నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మురికిని , మలినాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలోకి చాలా తేలికగా శోషింపబడి, చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. ఈనూనెను రెగ్యులర్ స్ర్కబ్ గా ఉపయోగించడం వల్ల చర్మం క్లీన్ అవుతుంది.

4. మొటిమలను మచ్చలను, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది

4. మొటిమలను మచ్చలను, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది

అవొకాడో నూనెలో యాంటీఇన్ఫ్లమేటీర గుణాలుండటం వల్ల ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసి మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఏర్పడకుండా చేస్తుంది.

 5. చీకాకు కలిగించే చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది

5. చీకాకు కలిగించే చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది

చీకాకు కలిగించే చర్మానికి ఈ నూనె ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎగ్జిమా, వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురైన చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Incredible Benefits Of Avocado Oil For Hair And Skin

    Avocado oil is a treasure trove of ingredients that can work magically well on your hair and skin. That is why, it is hailed as a must-use ingredient for beauty purposes. This oil is packed with fatty acids, vitamins B and E, antioxidants, anti-inflammatory agents and minerals that can transform the state of your h
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more