తెరుచుకున్న చర్మగ్రంథులను మూయటానికి సహజంగా ఇంటిలోనే చేసుకునే 2 పదార్థాల ఫేస్ ప్యాక్ లు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

తెరుచుకున్న చర్మరంధ్రాల సమస్యను చాలా మంది స్త్రీలు పెద్ద తలనొప్పి అయిన బ్యూటీ సమస్యగా భావిస్తారు. ఈ స్థితి ఇతర సమస్యలైన భరించలేని, చూడటానికి బాగోని మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి వాటికి దారితీయవచ్చు.

తెరుచుకున్న చర్మరంధ్రాల సమస్య ఉన్నవారు తరచుగా చర్మం రంగు సమంగా లేదని, పాలిపోయిందని మరియు జిడ్డు ఎక్కువయిందనే సమస్యలు చెప్తారు. దీని వలన మీ చర్మం ఇన్ఫెక్షన్ కి దారితీసే బ్యాక్టీరియాకి అడ్డాగా మారి, మురికి మరియు కలుషితాలు కూడా మొహంపై పేరుకుపోతాయి.

మీ పూర్తి ఆరోగ్యానికి మరియు అందానికి కూడా ఈ తెరుచుకున్న చర్మగ్రంథులు మూసుకోబడాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరియు ఇది జరగటానికి మేటి విధానం వారానికి ఒకసారి మీ ముఖంపై చర్మాన్ని ఫేస్ ప్యాక్ లతో చికిత్స చేయటం.

10 Natural DIY 2-ingredient Face Packs To Shrink Open Pores

ముఖ్యంగా, షాపుల్లో కొన్న ఫేస్ ప్యాక్ లకన్నా ఇంటిలో సహజ పదార్థాలతో చేసిన ఫేస్ ప్యాక్ లే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని భావిస్తారు. ఈ రోజు, బోల్డ్ స్కైలో మేము ఇంటిలోనే సులువుగా చేసుకునే డిఐవై ఫేస్ ప్యాక్ లను మీకు అందిస్తున్నాం, వీటితో మీ చర్మరంధ్రాలు మూసుకుని, అన్ని సమయాల్లో మీ చర్మం మేటిగా కన్పిస్తుంది.

ఈ కింద సూచించిన అన్ని ప్యాక్ లలో వాడిన పదార్థాలలో యాంటి బ్యాక్టీరియా లక్షణాలు మరియు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లతో చర్మరంధ్రాలు తెరుచుకునే సమస్యను గతంగా మార్చేస్తాయి.

అయితే, ఈ ఫేస్ ప్యాక్ లేంటో ఇక్కడ చదివేయండి;

గుడ్డు తెల్లసొన మరియు నిమ్మరసం ప్యాక్

గుడ్డు తెల్లసొన మరియు నిమ్మరసం ప్యాక్

-ఒక గుడ్డు తెల్లసొన మరియు 1చెంచా నిమ్మరసాన్ని ఒక బౌల్ లో మిశ్రమంలా కలపండి.

-ఈ ప్యాక్ ను మీ మొహం మరియు మెడకి పట్టించండి.

-ఈ ప్యాక్ ను 15-20 నిమిషాల పాటు ఉండనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

వంటసోడా మరియు ఆలోవెరా జెల్ ప్యాక్

వంటసోడా మరియు ఆలోవెరా జెల్ ప్యాక్

-ఈ మిశ్రమాన్ని అరచెంచా వంటసోడా మరియు 1 చెంచా ఆలొవెరా జెల్ తో తయారుచేయండి.

-ఈ ప్యాక్ ను మీ ముఖంపై పట్టించి 10 నిమిషాలు అలానే ఉండనివ్వండి.

-గోరువెచ్చని నీటితో కడిగాక మెరుగైన ఫలితాల కోసం టోనర్ స్ప్రే చేసుకోండి.

ముల్తానీ మట్టి మరియు ఆలివ్ నూనె ప్యాక్

ముల్తానీ మట్టి మరియు ఆలివ్ నూనె ప్యాక్

-ఈ ఫేస్ ప్యాక్ ను అరచెంచా ముల్తానీ మట్టి మరియు 2చెంచాల ఆలివ్ నూనెతో కలపండి.

-వచ్చిన మిశ్రమాన్ని పల్చటి పొరగా మొహానికి పట్టించండి.

-10నిమిషాల పాటు ఎండనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి.

దోసకాయ మరియు యాపిల్ సిడర్ వెనిగర్ ప్యాక్

దోసకాయ మరియు యాపిల్ సిడర్ వెనిగర్ ప్యాక్

-దోసకాయ ముక్కను తురిమి 4-5చుక్కల యాపిల్ సిడర్ వెనిగర్ తో కలపండి.

-ఈ ప్యాక్ ను మీ మొహంపై రాసి 5-10 నిమిషాల పాటు ఎండనివ్వండి.

-అయిపోయాక, గోరువెచ్చని నీటితో మొహం కడుక్కోండి.

అరటిపండు మరియు బాదం నూనె ప్యాక్

అరటిపండు మరియు బాదం నూనె ప్యాక్

-పండిన అరటిపండు గుజ్జు మరియు 1చెంచా బాదం నూనెతో కలపండి.

-ముఖంపై ఈ మిశ్రమాన్ని సమంగా పట్టించండి.

-15నిమిషాలు అలా వదిలేసాక గోరువెచ్చని నీరుతో మొహం కడుక్కోండి.

గంధపు పొడి మరియు రోజ్ వాటర్ ప్యాక్

గంధపు పొడి మరియు రోజ్ వాటర్ ప్యాక్

-అరచెంచా గంధపు పొడిని 2చెంచాల రోజ్ వాటర్ తో కలపండి.

-ఈ పదార్థాలను మెత్తటి పేస్టులా తయారుచేయండి.

-మీ ముఖంపై ఈ ప్యాక్ ను రాసుకోండి.

-10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీరుతో కడిగేయండి.

ఓట్ మీల్ మరియు కొబ్బరినూనె ప్యాక్

ఓట్ మీల్ మరియు కొబ్బరినూనె ప్యాక్

-1చెంచా వండిన ఓట్ మీల్ మరియు 2 చెంచాల కొబ్బరి నూనెను కలపండి.

-ఈ పేస్టును ముఖమంతా పట్టించి 15-20 నిమిషాల పాటు ఉండనివ్వండి.

-తేలికపాటి ఫేస్ వాష్ మరియు గోరువెచ్చని నీరుతో కడిగేయండి.

పెరుగు మరియు బ్రౌన్ సుగర్ ప్యాక్

పెరుగు మరియు బ్రౌన్ సుగర్ ప్యాక్

-2చెంచాల పెరుగు మరియు 1చెంచా బ్రౌన్ సుగర్ తో కలపండి. -ఈ మిశ్రమాన్ని మీ ముఖమంతా పట్టించి 10 నిమిషాలు ఉండనివ్వండి. -అయిపోయాక గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.

పసుపు పొడి మరియు పాల ప్యాక్

పసుపు పొడి మరియు పాల ప్యాక్

-సింపుల్ గా చిటికెడు పసుపు పొడిని 1 చెంచా పచ్చిపాలతో కలపండి.

-ఈ పేస్టును ముఖమంతా పట్టించి 10 నిమిషాల పాటు ఉంచండి.

-ఒకసారి అయిపోయాక, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి.

తేనె మరియు టీట్రీ ఆయిల్ ప్యాక్

తేనె మరియు టీట్రీ ఆయిల్ ప్యాక్

- రెండు టీస్పూన్ల తేనెలో 4చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి

- రెండూ బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని నేరుగా చర్మానికి అప్లై చేయాలి, ఒక నిముషం అలాగే ఉంచుకోవాలి.

- ఒకసారి చేసిన తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.

English summary

10 Natural DIY 2-ingredient Face Packs To Shrink Open Pores

10 Natural DIY 2-ingredient Face Packs To Shrink Open Pores,Open pores often cause uneven skin tone, dullness and too much oil. This can lead to the build-up of dirt and impurities on the skin. By using natural DIY 2-ingredient face packs, it can visibly shrink the pores and help you attain a clean and clear skin.