For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పదార్థాలు మీ కాళ్లు మరియు చేతులను వారం రోజుల్లో కాంతివంతంగా చేస్తాయి

|

నున్నని, మృదువైన మరియు కాంతివంతంగా ఉండే కాళ్ళు, చేతులను ఎవరు మాత్రం కోరుకోరు? మనలో చాలామందికి చేతులు, కాళ్ళు నలుపుగా మారిపోతాయి. అవును కదా! కొన్ని సార్లు ముఖం రంగుతో పోలిస్తే కాళ్ళుచేతుల రంగు వేరుగా అనిపిస్తాయి.

మనం ముఖ చర్మం నిగారింపు సంతరించుకోవటానికి వివిధ జాగ్రత్తలు తీసుకుంటాం. అదే విధమైన జాగ్రత్తలు చేతులు,కాళ్ళ పట్ల కూడా తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండకు గురవడం మరియు చర్మం ట్యానింగ్ అవడం వలన కాళ్ళు, చేతులు నల్లగా మారతాయి.

అయితే కాళ్ళు చేతులు ఒకే వారంలో ఎట్లా కాంతివంతంగా మార్చగలం?

ఈ సమస్య పరిష్కారానికి, మార్కెట్ లో ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ వాటిని కొనడానికి డబ్బులు మరియు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. చింతించకండి! సులభమైన చిట్కాలను పాటించి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

పది రోజులలో మీ కాళ్ళు మరియు చేతుల రంగును మార్చివేసే సహజ పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకోండి.


1. నారింజ తొక్కలు:

1. నారింజ తొక్కలు:

నారింజలో ఉండే విటమిన్ E మీ చర్మాన్ని తెల్లగా మార్చటంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను పెంచి చర్మాన్ని మెరిసేటట్టు చేస్తుంది.

నారింజ తొక్కలు కొన్నిటిని తీసుకుని ఎండబెట్టి పొడి చేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కలపండి. దీనిని కాళ్లకు, చేతులకు బాగా పట్టించి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి. తరువాత నలుగు మాదిరిగా గుండ్రంగా మర్దన చేస్తూ తుడిచేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ఫలితం త్వరగా లభిస్తుంది.

వేరొక విధంగా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి, 2 టేబుల్ సూన్ల తేనె మరియు ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ ను కలపండి. మీ వద్ద బ్రౌన్ షుగర్ లేని ఎడల మామూలు పంచదారని వాడవచ్చు. దీనితో కాళ్ళను, చేతులను మృదువుగా నలుచుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి.

2. నిమ్మకాయ:

2. నిమ్మకాయ:

నిమ్మకాయలకు కూడా చర్మాన్ని తెల్లబరిచే లక్షణం ఉంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

నిమ్మకాయ ప్యాక్: మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి కలపండి. దీనిని కాళ్లకు, చేతులకు దట్టమైన పొరలా రాయండి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. సత్వర ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యంకు లోను చేస్తుంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే మీలో నమ్మలేనంత మార్పు గమనించవచ్చు.

నిమ్మకాయ నలుగు: ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి ఒక టేబుల్ స్పూన్ పంచదారని కలపండి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల తేనె జత చేర్చండి. కావాలనుకుంటే నిమ్మ తొక్కల పొడిని కూడా కలిపి నాలుగు మాదిరిగా చేతులు, కాళ్లకు పట్టించండి. తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

3. కలబంద:

3. కలబంద:

కలబంద చర్మం పై నలుపును తొలగించి తేమగా ఉంచడానికి సహకరిస్తుంది.

ఒక తాజా కలబంద ఆకును తీసుకుని దానిలో గుజ్జును పిండేయండి. ఆ గుజ్జును చేతులు, కాళ్లపై రుద్దండి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జును కొన్ని చుక్కల బాదం నూనె కలిపి చేతులు, కాళ్లకు పట్టించండి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా రాసుకున్నాక ఎండలోకి వెళ్లకూడదని గుర్తుంచుకోండి.

4. దోసకాయ:

4. దోసకాయ:

దోసకాయలో ఉండే విటమిన్ A మీ మేని ఛాయను మెరుగుపరచి, నల్లబారటాన్ని మరియు రంగు తగ్గడాన్ని నిరోధిస్తుంది.

దోసకాయ క్రీమ్: దోసకాయను చిన్నచిన్న ముక్కలుగా కోసి దానిని ముద్దగా చేయండి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు వేసి బాగా కలిపితే క్రీంగా మారుతుంది. దీనిని రోజుకు రెండు సార్లు ఉదయం మరియు సాయంత్రం రాసుకుని పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.క్రమం తప్పకుండా ఇలా చేస్తే వారంలో మంచి ఫలితం ఉంటుంది.

దోసకాయ ప్యాక్: నాలుగు టేబుల్ స్పూన్ల దోసకాయ ముద్దకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి కలపండి. దీనిని చర్మానికి పట్టించి 20-25నిమిషాల పాటు వదిలేయండి.తరువాత చల్లని నీటితో కడిగేయాలి.క్రమం తప్పకుండా ఇలా చేస్తే వారంలో మంచి ఫలితం ఉంటుంది

English summary

These ingredients will brighten your hands and legs in 7 days

These ingredients will brighten your hands and legs in 7 days,Who wouldn't love to have fair hands and legs? While most of us only concentrate on making our face appear brighter, it is equally important to take care of the colour of our hands and legs. Here are some natural ingredients to brighten your hands and legs i
Desktop Bottom Promotion