For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రీ వెడ్డింగ్ స్కిన్ కేర్ టిప్స్ మిమ్మల్ని అందమైన వధువుగా మారుస్తాయి

|

వెడ్డింగ్ అనేది ఒకరి జీవితంలోని ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుక కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎన్నాళ్లగానో కలలుగన్న పెళ్లి వేడుక ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ రావడం సహజమే కదా. పెళ్ళికి ముందు రోజు వధువుకు ఒక పరీక్ష వంటిదే.

టెన్షన్ తో సరిగ్గా నిద్రపట్టదు. ఈ ప్రభావం చర్మంపై పడుతుంది. వెడ్డింగ్ డే నాడు డల్ గా కనిపించాలని ఏ వధువూ కోరుకోదు. డల్ కాంప్లెక్షన్, డిస్కలరేషన్, డార్క్ సర్కిల్స్ అలాగే యాక్నేలకు వెడ్డింగ్ డే కి ఆహ్వానం లేదు. కాబట్టి, కొన్ని ముఖ్యమైన బ్యూటీ టిప్స్ ను అర్థం చేసుకుని వెడ్డింగ్ డే కి కొన్ని నెలల ముందు నుంచీ వీటిని పాటిస్తే వెడ్డింగ్ డే నాడు వధువు కళకళలాడుతూ ఉంటుంది.

These Pre-wedding Skin Care Tips Will Make You A Beautiful Bride

సరైన మేకప్ తో మంచి లుక్ తో ఈ వేడుకలో కనిపిస్తామో లేదోనని చాలా మంది వధువులు దిగులు చెందుతూ ఉంటారు. కేవలం వెడ్డింగ్ డే నాడు మాత్రమే స్కిన్ గురించి పట్టించుకుంటే మీ చర్మం నిగనిగలాడుతూ ఉంటుందని ఆశించలేము. చర్మానికి, వెడ్డింగ్ డే కోసం ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. వెడ్డింగ్ డే కి కనీసం మూడు నెలల ముందు నుంచే చర్మాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనినే ప్రీ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అనంటారు.

ఇప్పుడు, ఇదెలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. అవునా? ప్రీ వెడ్డింగ్ ప్రిపరేషన్స్ గురించి తెలుసుకోవాలంటే మీరు సరైన ప్లేస్ కే వచ్చారు. ఈ ఆర్టికల్ లో ఆ స్పెషల్ డే కోసం మీరు తీసుకోవలసిన ముఖ్యమైన టిప్స్ గురించి వివరించాము. వీటిని చదివి ఆ టిప్స్ గురించి తెలుసుకోండి మరి.

ముందుగానే సిద్ధంగా ఉండండి:

మీ స్కిన్ ను వెడ్డింగ్ డే కు కనీసం మూడు నెలల ముందుగానే ప్రిపేర్ చేయండి. మూడు నెలల సమయం అనేది చర్మ సంరక్షణకు తగిన సమయమే. ఇప్పటి వరకు మీరు చర్మసంరక్షణకు ఎటువంటి కేర్ తీసుకోకపోయినా ఇప్పట్నుంచైనా మీరు కేర్ తీసుకోవడం ప్రారంభిస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. నిగారింపును సొంతం చేసుకుంటుంది. మీ డైట్ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఫేషియల్స్:

వెడ్డింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని ఈవెంట్. ఈ ఈవెంట్ కై మీ చర్మాన్ని గారాబం చేయడం తప్పనిసరి. నెలవారీ ఫేషియల్స్ కి వెళ్లి తాజా లుక్ ను సొంతం చేసుకోండి. 20లలో ఉన్న బ్రైడ్స్ కి మొటిమల సమస్య వేధిస్తుంది. అలాగే ఎండ వలన ట్యాన్ సమస్య కూడా ఎదురవవచ్చు. కాబట్టి, నెలకొకసారి డీప్ క్లీన్సింగ్ ఫేషియల్స్ కి వెళ్తే స్కిన్ లో మంచి మార్పులను గమనించవచ్చు.

ఎక్స్ఫోలియేట్:

ఎక్స్ఫోలియేట్:

మీ చర్మాన్ని కాంతివంతంగా, తేటగా అలాగే ఆరోగ్యంగా ఉంచేందుకు ఎక్స్ఫోలియేషన్ తోడ్పడుతుంది. సరైన ఎక్స్ఫోలియేషన్ ద్వారా అనేక చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. స్కిన్ యొక్క టెక్స్చర్ ను పూర్తిగా మెరుగుపరిచేందుకు ఈ ప్రాసెస్ తోడ్పడుతుంది. ఇక్కడ, సింపుల్ షుగర్ స్క్రబ్ గురించి వివరించాము.

హానీ లెమన్ షుగర్ స్క్రబ్

హానీ లెమన్ షుగర్ స్క్రబ్

చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు తేనెలో అలాగే నిమ్మరసంలో కలవు. అలాగే, ఈ రెండు చర్మాన్ని మాయిశ్చరైయిజ్ చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సింపుల్ స్క్రబ్ ను ఇంట్లోనే ప్రయత్నించండి మరి.

మీరు చేయవలసిందల్లా మూడు స్పూన్స్ తేనెను తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల నిమ్మరసాన్ని జోడించాలి. ఈ పదార్థాలని బాగా కలిపి ఒక స్క్రబ్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సర్క్యూలర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. ఆ తరువాత పదినిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

మాయిశ్చరైజ్:

మాయిశ్చరైజ్:

డ్రై మరియు ఫ్లేకీ స్కిన్ సమస్యను అరికట్టేందుకు మాయిశ్చరైజింగ్ అనేది ముఖ్యమైనది. ప్రతి రోజు రెండు సార్లు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఉదయం ఒకసారి అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఎల్బోస్, చేతులు, కాళ్ళు అలాగే మోకాళ్ళ వద్ద డ్రై స్కిన్ సమస్య వేధిస్తుంది వీటిని ఇగ్నోర్ చేయకుండా మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

అలాగే, మీరు బాడీ స్పెసిఫిక్ మాయిశ్చరైజర్ ను వాడటం మంచిది. మీ స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను ఎంపిక చేసుకుని దానిని వాడండి. ఉదాహరణకు, మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు ఆయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను ఎంచుకోకూడదు. మీరు కేవలం చర్మాన్ని హైడ్రేట్ చేసుకోవడం చూసుకోవాలి. మీ స్కిన్ టైప్ ఆయిలీ కావచ్చు, డ్రై కావచ్చు లేదా పింపుల్స్ ఎక్కువగా ఉండే చర్మం కావచ్చు, మీ చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను ఎంచుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

నిద్ర:

నిద్ర:

వెడ్డింగ్ డే నాడు డల్ గా అలసినట్లుగా ఉండాలని మీరు కోరుకోరు. అందువలన మీరు నిద్రను అశ్రద్ధ చేయకూడదు. నిద్రను అశ్రద్ధ చేస్తే ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఏవీ మీ లుక్ ని మెరుగుపరచవు. కనీసం ఎనిమిదిగంటల నిద్ర అవసరం. అప్పుడే మీరు తాజాగా అలాగే అందంగా కనిపిస్తారు. కాబట్టి, మీరు నిద్ర విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావద్దు.

పెదవులను అశ్రద్ధ చేయకండి:

పెదవులను అశ్రద్ధ చేయకండి:

సరైన కేర్ తీసుకోకపోతే పెదవులు పగలటం సహజమే. తగినంత మాయిశ్చరైజ్ చేస్తే డ్రై మరియు క్రాకెడ్ లిప్స్ సమస్య దరి చేరదు. అవుట్ డోర్స్ లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే ప్రత్యేకించి విండీ, సన్నీ లేదా కోల్డ్ వెదర్ లో మీరు ఎస్ పీ ఎఫ్ 30 కలిగిన థిక్ బామ్ ని వాడితే లిప్స్ హైడ్రేటెడ్ గా ఉంటాయి. పెదాలు గులాబీరేకుల్లా అందంగా ఉండాలనే ప్రతి వధువూ ఆశిస్తుంది. కాబట్టి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పెదాలు అందంగా ఉంటాయి.

ఫేస్ ప్యాక్స్:

ఫేస్ ప్యాక్స్:

ఇక్కడ సులభంగా ఇంటివద్దే తయారుచేసుకోగలిగిన కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ గురించి వివరించాము. వీటిని వాడి మీ చర్మాన్ని వెడ్డింగ్ డే కోసం సిద్ధం చేసుకోండి మరి.

డ్రై స్కిన్ కోసం:

డ్రై స్కిన్ కోసం:

ఈ ప్యాక్ కోసం మీకు ఒక స్పూన్ మిల్క్ పౌడర్ అలాగే కొన్ని చుక్కల నిమ్మరసం అవసరపడుతుంది.

ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించండి. ఈ రెండిటినీ బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోండి. 20 నిమిషాల తరువాత వాష్ చేసుకోండి. మీది డ్రై స్కిన్ అయితే మిల్క్ పౌడర్ అలాగే నిమ్మలో నున్న గుణాలు మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చుతాయి. అలాగే, కాస్తంత మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి.

ఆయిలీ స్కిన్ కోసం:

ఆయిలీ స్కిన్ కోసం:

అలోవెరా మరియు టర్మరిక్ ప్యాక్

ఒక టేబుల్ స్పాన్ అలోవెరా జెల్ లో ఒక చిటికెడు పసుపును కలపండి. ఈ రెండిటినీ బాగా కలిపితే ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేసుకోవాలి. ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటించాలి. పసుపు చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు తోడ్పడుతుంది. అలోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేసి చర్మాన్ని కోమలంగా అలాగే మృదువుగా చేస్తుంది.

శాండల్ వుడ్ మరియు రోజ్ వాటర్ ప్యాక్

శాండల్ వుడ్ మరియు రోజ్ వాటర్ ప్యాక్

ఈ ప్యాక్ తయారీలో మీకు ఒక టేబుల్ స్పూన్ శాండల్ వుడ్ పౌడర్ మరియు రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కావాలి. ఒక పాత్రలోకి ఈ పదార్థాలని తీసుకుని బాగా కలపండి. ఈ ప్యాక్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ముఖాన్ని రిన్స్ చేసుకుని టవల్ తో తడిని తుడవండి.

ఈ పద్దతిని వారానికి 3-4 సార్లు పాటిస్తే వేగవంతమైన మెరుగైన ఫలితాలను పొందుతారు. శాండల్ వుడ్ లో యాస్ట్రింజెంట్ ప్రాపర్టీలు కలవు. ఇవి బ్రేక్ అవుట్స్ ని అరికడతాయి. చర్మాన్ని సూత్ చేసి రెడ్ నెస్ ను అలాగే ఇంఫ్లేమేషన్ ను హీల్ చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి:

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి:

అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే, తగినంత నీటినితీసుకోవాలి. అప్పుడే, ఆరోగ్యకరమైన అలాగే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. అలాగే, పండ్లూ మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న పండ్లకు అలాగే కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి.

వాటర్ మెలన్ ని తీసుకోవాలి. ఎక్కవగా వాటర్ మెలన్ ని తీసుకుంటే చర్మం అంత బాగా హైడ్రేట్ అవుతుంది. అలాగే, గ్రేప్ ఫ్రూట్స్, బ్రొకోలీ మరియు లెట్యూస్ ని కూడా తీసుకుంటే మంచిది.

English summary

These Pre-wedding Skin Care Tips Will Make You A Beautiful Bride

Wedding is considered as one of the most important events in one's life. Dull complexion, discoloration, dark circles and acnes have no place in one's wedding day. But some skin-related tips can help you with this. Keeping your skin hydrated, trying homemade face packs, etc. will solve all your skin-related issues before your wedding.
Story first published:Friday, March 30, 2018, 17:42 [IST]
Desktop Bottom Promotion