Latest Updates
-
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
30ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టే ముందు మీ చర్మసంరక్షణకై జతచేయాల్సిన విషయాలు
ప్రతి స్త్రీ 30 ఏళ్ళ వయస్సులోకి వచ్చినపుడు, ఆమె చర్మం అనేక మార్పులకి గురవుతుంది. ఎక్కువ మచ్చలు రావటం కావచ్చు, చర్మం తనంతట తాను రిపేర్ అయ్యే శక్తి తగ్గిపోవటం, కొల్లాజెన్ విడివడటం లేదా సాగేగుణం తగ్గిపోవ
ప్రతి స్త్రీ 30 ఏళ్ళ వయస్సులోకి వచ్చినపుడు,ఆమె చర్మం అనేక మార్పులకి గురవుతుంది. ఎక్కువ మచ్చలు రావటం కావచ్చు, చర్మం తనంతట తాను రిపేర్ అయ్యే శక్తి తగ్గిపోవటం, కొల్లాజెన్ విడివడటం లేదా సాగేగుణం తగ్గిపోవటం, ఇలాంటి అనేక చర్మ మార్పులు జరుగుతాయి.
ఈ వయస్సు సంబంధ మార్పులు వివిధ చర్మ సమస్యలకి దారితీసి అందాన్ని, ఆకర్షణీయతను తగ్గించవచ్చు.

30 ఏళ్ళు వచ్చేముందు స్త్రీలు పాటించాల్సిన చర్మ సంరక్షణ చిట్కాలు
కానీ, ఈ వయస్సు మీరే లక్షణాలతో పోరాడటానికి అనేక మార్గాలున్నాయి మరియు ఇవి మీ చర్మాన్ని హుందాగా వయస్సుకి తగ్గట్టు ఉండేట్లు చేస్తాయి. అన్నిటికన్నా ప్రభావవంతమైన విధానం ఏంటంటే 20 లు చివరకి వచ్చినపుడు మీ చర్మ సంరక్షణ రొటీన్ ను కొంచెం మార్చుకోవటం- దానివల్ల 30ల్లో మీరు మంచి చర్మంతో అందంగా ఉంటారు.
ఈరోజు బోల్డ్ స్కైలో, మేము ఈ వయస్సుమీరే ఆటను, మీ సహజ అందాన్ని తగ్గించటానికి ప్రయత్నించే ఇతర వయస్సు సంబంధ సమస్యలకి పాటించదగ్గ చిట్కాల లిస్ట్ ను తయారుచేసాం.
ఈ కింది చర్మసంరక్షణ ఉత్పత్తులను వాడటం మొదలుపెట్టి మీ చర్మాన్ని హుందాగా, అందంగా, సహజంగా వయస్సు మీరేలా చేయండి.

1.కంటిక్రీమ్
మీ కళ్ళ చుట్టూ ఉన్న చర్మం చాలా పలచన మరియు సున్నితమైనది, అందుకనే పాడవటానికి ఎక్కువ అవకాశం ఉంది. మరియు మిగతా చర్మం కంటే ఇది తొందరగా వయస్సు మీరుతుంది కాబట్టి దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం. మీ కంటి చుట్టూ చర్మాన్ని ఒక కంటి క్రీమ్ తో బాగుచేయడం మొదలుపెట్టండి. ఇది అక్కడి చర్మాన్ని సరిగ్గా తేమగా ఉంచి, అన్ని సమయాల్లో ఎండిపోకుండా చూస్తుంది.

2.ఫేషియల్ మిస్ట్
30ఏళ్ళు వచ్చేలోగా మీరు మీ చర్మసంరక్షణ రొటీన్ లో చేర్చాల్సిన మరో ఉత్పత్తి ఫేషియల్ మిస్ట్. వయస్సుతో పాటు మన చర్మం దాని సహజకాంతిని కోల్పోతుంది. అది జరగకుండా ఆపాలంటే, మీరు ఫేషియల్ మిస్ట్ ను వాడటం మొదలుపెట్టి మీ చర్మానికి తిరిగి జీవం పోయాలి. ఇది మీ చర్మానికి వయస్సుతో సంబంధం లేకుండా కాంతిని అందిస్తుంది.

3. ముఖానికి స్క్రబ్
మీ చర్మంపై మలినాలను తొలగించటానికి ఎక్స్ ఫోలియేషన్ ముఖ్యమనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఒక వయస్సు దాటాక మృతకణాలను మరియు చర్మగ్రంథుల నుంచి మలినాలను తొలగించటానికి అది అవసరంగా మారిపోతుంది. లేకపోతే అవి తీవ్ర మొటిమలు వంటివిగా మారిపోతాయి. వారానికి ఒకటో రెండుసార్లు మంచి మరీ గాఢంగా కాకుండా ఉన్న ఫేస్ స్క్రబ్ ను వాడండి.ఈ మొటిమల వంటివి నివారించబడి, మీ వయస్సు మీరే ఆటను కూడా నియంత్రణలో ఉంచవచ్చు.

4.విటమిన్ సి సిరమ్
విటమిన్ సి అనేది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మీ చర్మంపై పెంచి దాని సాగేగుణాన్ని పెంచుతుమ్ది. మరియు వయస్సు మీరే లక్షణాలతో పోరాడటానికి విటమిన్ సి సిరమ్ చాలా మంచిది. వదులుగా కాక పట్టి ఉంచే చర్మానికి, కాంతివంతమైన చర్మాన్ని పొందటానికి 30 ఏళ్ళకి ముందు మీ చర్మరొటీన్ లో దీన్ని కూడా భాగంగా చేయండి.

5.ముఖానికి నూనె
ఫేస్ ఆయిల్స్ లో చర్మానికి లాభం చేకూర్చే పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలు వయస్సుకి ముందే ముసలితనపు ఛాయలు రాకుండా పోరాడి, మీ చర్మాన్ని డల్ మరియు అలసటగా కన్పించనీయకుండా చేస్తుంది. మీ చర్మసమస్యలన్నీ నివారించబడి, సహజంగా వయస్సు పైబడే చర్మం కోసం 30 ఏళ్ళకి ముందే మీ అందాల రొటీన్ లో ఫేస్ ఆయిల్ చేర్చడం మర్చిపోకండి.

6.యాంటీ ఏజింగ్ క్రీమ్
చర్మ సంరక్షణ ఉత్పత్తిగా యాంటీ ఏజింగ్ క్రీమ్ కొనటం చాలా మంచి పెట్టుబడి. ఇలాంటి క్రీముల్లో అధికశాతం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నింపబడి ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల పాడైన మీ చర్మాన్ని తిరిగి సురక్షితం చేస్తాయి. 30ఏళ్లకి ముందుగానే ఒక మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడటం మొదలుపెట్టడం వలన వయస్సుకి ముందే ముసలితనపు ఛాయలు రాకుండా చూసుకోవచ్చు.

7.ఫేస్ మాస్క్
ఫేస్ మాస్క్ మీ చర్మంపై అద్భుతాలు చేస్తుంది. మరియు ఈ యాంటి ఏజ్ సమస్యలను తరిమికొట్టడానికి అనేక రకాల ఫేస్ మాస్క్ లు ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి.కొల్లాజెన్ ను పెంచి, ముడతలను తగ్గించే ఫేస్ మాస్క్ లను వారానికి కనీసం ఒక్కసారైనా వాడితే 30ఏళ్ల తరవాత కూడా మీ చర్మం అందంగా కన్పిస్తుంది.

8.సన్ స్క్రీన్
చర్మనిపుణులు కొద్ది సమయం బయటకి వెళ్ళాల్సి వచ్చినా సన్ స్క్రీన్ వాడమని స్త్రీలకి సూచిస్తున్నారు. ఎందుకంటే చిన్నవయసులో సూర్యకాంతి వలన పాడైన మీ చర్మం 30లు మరియు 40ల్లో బాగా అలా కన్పిస్తుంది. అందుకని మీ చర్మాన్ని హానికరమైన అల్ట్రావయొలెట్ కాంతి నుంచి రక్షించుకుని, వయస్సుకి ముందే పైబడకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications