For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ముడుతలు లేని శంఖంలాంటి మెడ మీ సొంతం కావాలా? అయితే ఈ చిట్కాలపై ఒక కన్నెయండి.

  |

  ఎటువంటి ముడుతలు లేని శంఖంలాంటి మెడ ప్రతి మహిళ కల. ముఖానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే మనం మెడ విషయంకి వచ్చేటప్పటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. కానీ మెడకు కూడా ముఖానితో సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలి.

  మెడ మీది ముడుతలు ఎల్లప్పుడు వయస్సు పైబడటం వలన మాత్రమే కలుగవు. అతిగా ఎండకు గురవడం లేదా జీవనశైలి తప్పిదాలైన పొగ త్రాగడం మరియు మద్యపానం, రసాయన చికిత్సలు వలన కూడా ఇవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక యువత కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నారు.

  కొన్ని సహజ చిట్కాలను పాటించి వీటిని నివారించవచ్చు. అటువంటి కొన్ని చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  ఎక్స్ ఫ్లోయేషన్:

  ఎక్స్ ఫ్లోయేషన్:

  నలుగు పెట్టుకోవడం వలన చర్మంపై ఉండే మృతకణాలు తొలగి యవ్వనపు నిగారింపు సంతరించుకుంటాయి. అంతేకాక మొటిమలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. సాధారణంగా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో నలుగు తయారు చేసుకోవచ్చు.

  తయారీకి కావలసిన పదార్థాలు:

  రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం

  ఒక టొమాటో

  ఐదు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్

   వాడుక విధానం:

  వాడుక విధానం:

  ఒక టొమాటోను మెత్తని ప్యూరీ చేసుకుని దానికి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. తరువాత ఐదు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ కలపండి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి వలయాకారంలో మర్దన చేయండి. మర్దన మృదువుగా చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

  2. మసాజ్:

  2. మసాజ్:

  నలుగులు, ప్యాక్ లే కాక మసాజ్ కూడా చాలా అవసరం. ఇది మీ మెడకు రక్త ప్రసరణ పెంచి ముడుతలు కనపడడాన్ని తగ్గిస్తుంది. పడుకునే ముందు మెడకు, కాలర్ ఎముక మొదలుకొని దవళ్ళ వరకు మాయిశ్చరైజింగ్ లోషన్ ను పై దిశగా మాత్రమే వేళ్ళని కదుపుతూ రాసుకోవాలి.

  3. మాస్క్:

  3. మాస్క్:

  మచ్చలేని అందమైన చర్మం పొందాలంటే మాస్కులు చాలా అవసరం. ఈ మాస్కులు మెడకు వేసుకుంటే మెడ మీద చర్మం కూడా తీరుగా ,యవ్వనంతో మిసమిసలాడుతుంది.

  తయారీకి కావలసిన పదార్థాలు:

  అరటిపండు

  ఒక టీ స్పూన్ తేనె

  ఒక గుడ్డు తెల్ల సొన

  వాడుక విధానం:

  వాడుక విధానం:

  ఒక బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసి,గుడ్డు తెల్ల సొనను వేసి బాగా గిలక్కొట్టండి. కలపాలి. దీనికి ఒక టీ స్పూన్ తేనెను కూడా కలిపి మెడకు దలసరిగా పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నెల రోజుల పాటు చేయండి.

  4. మీ పడుకునే పద్ధతి మార్చుకోండి:

  4. మీ పడుకునే పద్ధతి మార్చుకోండి:

  తలగడ వలన మీ ముఖం పై ఒత్తిడి కలిగే విధంగా పడుకోకండి. ఇలా పడుకుంటే ముఖం మరియు మెడపై ముడుతలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కనుక ఎపుడు మీ వీపు పై భారం పడేటట్లు నిద్రపోండి. ఇలా పడుకోవడం వలన వక్షోజాలు కూడా సాగకుండా ఉంటాయి.

  5. నిటారుగా కూర్చోండి:

  5. నిటారుగా కూర్చోండి:

  మీ కూర్చునే పద్దతి కూడా మీ మెడపై ఉండే ముడుతలపై ప్రభావం చూపిస్తుంది.మీరు ఫోన్ లేదా లాప్ టాప్ వాడుతున్నప్పుడు వంగుని కూర్చున్నట్లైతే మీ చర్మం పై ముడుతలు అధికం అవుతాయి. అంతే కాకుండా వెన్ను నొప్పిని కూడా కలుగచేస్తుంది. కనుక సరైన విధంగా నిటారుగా కూర్చోండి.

  6. ఐస్ ముక్కలతో రుద్దుకోండి:

  6. ఐస్ ముక్కలతో రుద్దుకోండి:

  మెడ పై చర్మాన్ని ఐస్ ముక్కుతో రుద్దుకుంటే రక్త ప్రసరణ మెరుగై యవ్వనపు సోయగం సంతరించుకుంటుంది.అంటే కాకుండా ఏవైనా నొప్పులు మరియు వాపులున్న తగ్గుతాయి. చర్మం మరీంత బిగుతుగా మారుతుంది.

  English summary

  Tips for wrinkle free and young looking neck

  Tips for wrinkle free and young looking neck,A wrinkle-free young-looking neck is every woman's dream. Neck wrinkles can also be due to over exposure to the sun, smoking and drinking, chemical treatments, etc. However, there are some natural tips to follow in order to prevent this. Let's explore some tips in keeping yo
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more