For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాటిగ్ ప్రభావం స్కిన్ పై కనిపించకుండా చేసే కొన్ని చిట్కాలు

|

ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే, రోజంతా అలసటకు గురైనప్పుడు ఆ ప్రభావం కచ్చితంగా చర్మంపై కచ్చితంగా పడుతుంది. ఎండలో ఎక్కువసేపు గడపటం, ఆఫీస్ వర్క్ తో ఎక్కువసేపు సతమతమవడం వంటివి మీ అపియరెన్స్ ని దెబ్బతీస్తాయి. కానీ, కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా అలసట ప్రభావం చర్మంపై కనిపించకుండా జాగ్రత్తపడవచ్చు.

రోజంతా ఆఫీస్ లో గడిపిన తరువాత సాయంత్రం సేదతీరాలని చాలామందికి ఉంటుంది. అయితే, అప్పటికే అలసట అనేది ముఖంలో స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. కొన్ని మేకప్ మరియు స్కిన్ కేర్ టిప్స్ ని పాటిస్తూ ప్రకాశవంతంగా అలాగే తాజాగా కనిపించవచ్చు.

కొన్నిసార్లు, మీరు మేకప్ వేసుకున్నా కూడా రోజు పూర్తయ్యేసరికి మేకప్ అనేది ఫేడ్ అయిపోతుంది. ఈవెనింగ్ ఏదైనా ప్లాన్ గురించి మీరు అలోచించి మేకప్ ను ఉదయాన్నే వేసుకుని ఉండుంటారు. అయితే, ఈవెనింగ్ అయ్యేసరికి మీ మేకప్ కాస్తా కరిగిపోయింది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి.

బ్యూటీ బ్లెండర్ ని అలాగే కాంకీలర్ ను ఎల్లప్పుడూ వద్దే ఉంచుకోవడం కొన్ని సార్లు సాధ్యం కాదు. కాబట్టి, ఈ చిట్కాను పాటిస్తే మీరు కేవలం ఎసెన్షియల్ ఆయిల్స్ ను మాత్రం వద్ద ఉంచుకుంటే సరిపోతుంది. మీ అవసరాలకు ఏ ప్రోడక్ట్ అవసరపడుతుందో మీరు చూజ్ చేసుకోవచ్చు.

ఇక్కడ చర్మాన్ని ఇన్స్టెంట్ గా ప్రకాశవంతంగా మార్చే కొన్ని ప్రోడక్ట్స్ గురించి వివరించాము. వీటిని మీరు మీ వెంటే ఎల్లప్పుడూ ఉంచుకోవడం ద్వారా చర్మంపై అలసట బయటికి అంతగా కనబడనీయకుండా జాగ్రత్తపడవచ్చు.

కన్సీలర్:

కన్సీలర్:

సమస్య ఏదైనా కన్సీలర్ అనేవి మేజిక్ ప్రోడక్ట్స్ లా పనిచేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖంలోని వివిధ ప్రదేశాలను ప్రకాశవంతంగా మార్చేందుకు కూడా కాంకీలర్స్ ఉపయోగకరంగా ఉంటాయి. కళ్ళ కింద స్కిన్ డల్ గా ఉంటుంది. తగినంత నిద్రలేకపోతే డల్ నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాంకీలర్ ఈ డల్ నెస్ ను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. స్కిన్ టోన్ ని ప్రకాశవంతంగా మార్చేందుకు మీ స్కిన్ టోన్ కంటే ఒక షేడ్ లైట్ గా ఉన్న కాంకీలర్ ను ఎంచుకోండి. ఫుల్ కవరేజ్ కాంకీలర్ కు ప్రాధాన్యం ఇవ్వండి లేదంటే యాషీగా కనిపించే అవకాశం ఉంది.

బ్లష్:

బ్లష్:

ముఖానికి వన్నె తేవడానికి బ్లష్ ఉపయోగపడుతుంది. మనందరికీ సహజసిద్ధంగా పింక్ చీక్స్ ఉంటే బాగుంటుందని ఆశిస్తాము. అయితే, పింక్ చీక్స్ సహజసిద్ధంగా కలిగి ఉండడం ఎంతో అరుదైన విషయం. ఇప్పుడే బ్లష్ ఉపయోగపడుతుంది. పీచ్ లేదా పింక్ బ్లష్ ని ఎంచుకోండి. నేచురల్ గా ఉండే దానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే మ్యాట్టే బ్లష్ వైపే మొగ్గు చూపండి. షిమ్మరీ బ్లష్ లనేవి సరైన లుక్ ని ఇవ్వవు.

బ్రాంజర్:

బ్రాంజర్:

బ్రాంజర్ ని వాడటం ద్వారా ముఖం యొక్క రంగును కాంతివంతంగా మార్చుకోవచ్చు. కాంటరింగ్ కోసం బ్రాంజర్స్ ని వాడతాము. మీ ముఖంలోని ఫీచర్స్ షార్ప్ గా కనిపించి మంచి లుక్ ని అందివ్వడానికి బ్రాంజర్స్ ఉపయోగపడతాయి. మోడల్స్ మరియు నటులు ఇటువంటి ప్రోడక్ట్స్ ని వాడటం వలెనే ప్రకాశవంతంగా కనిపిస్తారు. బ్రాంజర్ ని వారు కచ్చితంగా వాడతారు

మాయిశ్చర్:

మాయిశ్చర్:

ఏ విధమైన మేకప్ ని అప్లై చేయాలనుకున్నా మీరు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మాయిశ్చరైజర్ ని వాడకపోవడం వలన మేకప్ అనేది ప్యాచీగా కనిపిస్తుంది. మాయిశ్చరైయిజర్ ని ఉపయోగించిన తరువాత మేకప్ చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. మేకప్ లుక్ సరిగ్గా వస్తుంది.

స్లీపింగ్ మాస్క్స్:

స్లీపింగ్ మాస్క్స్:

రాత్రిపూటే చర్మం ఎక్కువగా తనంతట తానే హీలింగ్ ప్రాసెస్ ని చేసుకుంటుంది. కాబట్టి, నైట్ క్రీమ్ లను లేదా నైట్ మాస్క్ లను ఉపయోగించడం మంచిది. ఇలా చేస్తే మరుసటి ఉదయాన్నే, చర్మం తాజాగా మరింత ప్రకాశవంతంగా మారుతుంది. వివిధ చర్మసమస్యలను తొలగించేందుకు ఈ మాస్క్స్ ఉపయోగపడతాయి. అలసట, కాలుష్యం కారణంగా చర్మంపై పడిన ప్రభావం తగ్గుతుంది. అలాగే, చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం సహజసిద్ధంగా మాయిశ్చరైజ్ అవడం తగ్గుతుంది. ఎలాస్టిసిటీ కూడా తగ్గుతుంది. నైట్ క్రీమ్స్ ని లేదా మాస్క్స్ ని వాడటం ద్వారా చర్మంలో తగినంత తేమ లభిస్తుంది.

హైలైట్:

హైలైట్:

హైలైట్ ని వాడటం ద్వారా చర్మానికి సహజసిద్ధమైన కాంతి లభించిన లుక్ వస్తుంది. లైట్ స్ట్రాబింగ్ బామ్ లేదా క్రీమ్ ని ముఖంపై లైట్ పడే ప్రదేశాలలో అప్లై చేస్తే ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నోస్ బ్రిడ్జ్, నుదురు అలాగే చీక్స్ హై పాయింట్స్ మరియు కుపిడ్స్ బో లలో హైలైట్స్ ని వాడాలి. ఈ ప్రదేశాలలో అప్లై చేస్తే గ్లో అనేది నేచురల్ గా ఉంటుంది. పౌడర్ హైలైట్ అనేది బ్లైండింగ్ హైలైట్ ప్రభావాన్ని చూపిస్తుంది.

టింటేడ్ లిప్ బామ్:

టింటేడ్ లిప్ బామ్:

మీ ముఖం మొత్తం డల్ గా కనిపించడానికి డ్రై లిప్స్ కారణమవుతాయి. టింటేడ్ లిప్ బామ్స్ వలన మీ లిప్స్ ప్రకాశవంతంగా మారతాయి. అలాగే ఇవి సహజసిద్ధంగా పింక్ గా ఉంటూ లిప్స్ ని హైడ్రేడ్ చేస్తాయి.

English summary

tips to avoid fatigue on skin | how to avoid fatigue on skin | different ways to avoid fatigue on skin

tips to avoid fatigue on skin. Here are some products you should carry in your bag to avoid your skin from looking tired and to instantly brighten up your skin for a day out. Check them out!