ఈ చిట్కాలతో వేలంటైన్స్ డే నాడు ప్రత్యేకమైన కాంతితో మెరిసిపోండి

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వేలంటైన్స్ డే అనేది అతి దగ్గరలోనే ఉంది. ఈ రోజు కోసం అమ్మాయిలు ఎంతో ఎక్సయిట్మెంట్ తో ఎదురుచూస్తూ ఉంటారు. మునుపటికంటే ఈ రోజు మరింత అందంగా కనిపించాలని తహతహలాడుతూ ఉంటారు. ఈ టిప్స్ ను పాటిస్తే మీ లుక్ కచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది.

అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవాలి. నిజానికి, స్కిన్ కేర్ అనేది ఎంతో అవసరం. మీ చర్మం కాంతులీనాలంటే చర్మానికి తగినంత పోషణ అవసరం. అందువలన, ఫౌండేషన్, కాంకీలర్ వంటి మేకప్ ప్రాడక్ట్స్ పై డబ్బును వెచ్చించే బదులు చర్మాన్ని సహజంగా అందంగా ఉంచుకునేందుకు తగినంత కేర్ ను తీసుకోండి.

Tips To Get That Glow For Valentine’s Day

స్కిన్ లోని ఫర్మ్ నెస్ అలాగే యూత్ ఫుల్ లుక్ కలకాలం పాటు అలాగే ఉండవన్న విషయం మనందరికీ తెలుసు. ఈ విషయం మనల్ని కాస్తంత డిజప్పాయింట్ చేస్తుంది. కాబట్టి, ముందు నుంచి చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలం పాటు చర్మం ఆరోగ్యంగా అలాగే కాంతివంతంగా ఉంటుంది. అకాల వృద్ధాప్య లక్షణాలను ఎవరు కోరుకుంటారు? చర్మ సంరక్షణ సరైన రీతిలో సాగితే అకాల వృద్ధాప్య లక్షణాలు చర్మంపై దర్శనమివ్వవన్న విషయాన్ని మనం గుర్తించాలి.

వేలంటైన్స్ డే రాబోతోంది కాబట్టి, ఆ రోజు ప్రత్యేకంగా కనిపించాలని తమ మనసుకు నచ్చిన వారికి మరింత అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. ఏది ఏమైనా చర్మం అనేది సెల్ఫీకైనా సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఈ టిప్స్ ను పాటించి వేలంటైన్స్ డే రోజు స్పెషల్ గా కన్పించేలా మీ చర్మాన్ని సిద్ధం చేసుకోండి మరి!

వాటర్:

వాటర్:

వేలంటైన్స్ వీక్ కి ముందుగానే మీరు రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవడం ప్రారంభించండి. వాటర్ ద్వారా టాక్సిన్స్ అనేవి శరీరంలోంచి తొలగిపోతాయి. అందువలన, మొటిమల సమస్య వేధించదు. తద్వారా, సహజసిద్ధమైన కాంతిని మీ చర్మం సొంతం చేసుకుంటుంది.

మల్టీ టాస్కింగ్ ని చేయండి:

మల్టీ టాస్కింగ్ ని చేయండి:

చర్మంలోని వివిధ ప్రదేశాలు వివిధ కండిషన్స్ తో ఇబ్బందిపడుతూ ఉంటే మీరు ఆయా కండిషన్స్ కి తగిన రెమెడీస్ ని పాటించాలి. అంతేకాని, ఒకే ఫేస్ మాస్క్ ని వాడటం ద్వారా ఫలితం లభించదు. అందువలన, మల్టీ టాస్కింగ్ చేస్తూ ప్రతి కండిషన్ ను కేర్ తీసుకోండి. ఉదాహరణకు, టీ జోన్ వద్ద మొటిమలువచ్చి మిగతా భాగం అంతా డ్రై గా మారితే, టీ జోన్ వద్ద ప్యూరిఫయింగ్ క్లే మాస్క్ ను వాడి ముఖంపై మిగతా ప్రదేశాలలో హనీ మాస్క్ ను ప్రయత్నిస్తే తగిన ఫలితం లభిస్తుంది. డ్రై ఏరియాస్ కి తగినంత హైడ్రేషన్ లభిస్తుంది.

ఫేసియల్ అబ్ ట్యాన్స్ ను ఉపయోగించండి:

ఫేసియల్ అబ్ ట్యాన్స్ ను ఉపయోగించండి:

ఫేసియల్ అబ్ ట్యాన్స్ అనేవి వధువులు ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రైడల్ గ్లో కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే, ఇంటివద్దే సులభంగా మీరు ఫేస్ ప్యాక్ ని తయారుచేసుకోవచ్చు. టర్మరిక్ పౌడర్ ని శాండల్వుడ్ పౌడర్, పాలు అలాగే రోజ్ వాటర్ తో కలిపి ఒక లక్జరియస్ అబ్ ట్యాన్ ను తయారుచేసుకుని ప్రయత్నిస్తే బ్రైడల్ గ్లో ఇట్టే వచ్చేస్తుంది.

స్లీపింగ్ మాస్క్ ని ప్రయత్నించండి:

స్లీపింగ్ మాస్క్ ని ప్రయత్నించండి:

స్లీపింగ్ మాస్క్ కాన్సెప్ట్ అనేది మనకు పూర్తిగా కొత్తది. అయితే, స్కిన్ కేర్ లో మంచి ఫలితాన్ని అందిస్తాయివి. ముందురోజు రాత్రి ఈ మాస్క్ ని ముఖానికి దట్టమైన లేయర్ గా అప్లై చేసి మరుసటి ఉదయాన్నే చర్మాన్ని శుభ్రపరచుకుంటే. మెరిసే కాంతిని చర్మం సొంతం చేసుకోవడాన్ని మీరు గమనించవచ్చు.

స్కిన్ కేర్ సెరమ్స్ ని రొటీన్ లో భాగం చేసుకోండి:

స్కిన్ కేర్ సెరమ్స్ ని రొటీన్ లో భాగం చేసుకోండి:

సెరమ్స్ అనేవి చర్మ సంరక్షణకు అమితంగా తోడ్పడతాయి. టోనింగ్ తరువాత అలాగే మాయిశ్చరైజింగ్ కి ముందు సెరమ్స్ ని వాడతారు. స్టికీ, జెల్ వంటి టెక్స్చర్ కలిగి ఉంటాయి. చర్మంపైన అప్లై చేయగానే జిడ్డుగా అనిపిస్తాయి. సెరమ్ ని చర్మంపై ఆరే సమయాన్నివ్వండి. చర్మం సెరమ్ ని గ్రహించడం ద్వారా మాయిశ్చరైజ్ అవుతుంది. తద్వారా, కోమలత్వాన్ని సొంతం చేసుకుంటుంది.

బౌన్సీ, హైడ్రేటెడ్ స్కిన్ కోసం నైట్ క్రీమ్స్:

బౌన్సీ, హైడ్రేటెడ్ స్కిన్ కోసం నైట్ క్రీమ్స్:

రాత్రి పూట చర్మానికి రిఫైరింగ్ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం మనం కాస్తంత అదనపు శ్రద్దని కనబరచాలి. ఎండ, కాలుష్యం మరియు ఒత్తిళ్లనేవి చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి, నైట్ క్రీమ్స్ ని వాడటం ద్వారా చర్మం తిరిగి కోలుకుంటుంది.

సున్నితమైన అండర్ ఐ ఏరియా వద్ద ఐ క్రీమ్స్:

సున్నితమైన అండర్ ఐ ఏరియా వద్ద ఐ క్రీమ్స్:

ఏజింగ్ అలాగే చర్మ సమస్యలనేవి అండర్ ఐ ఏరియా వద్ద స్పష్టంగా కనిపిస్తాయి. కాబట్టి, ఐ క్రీమ్స్ ని ఎంత త్వరగా వాడితే అంత మంచిది. తద్వారా, చర్మం పొడిబారటాన్ని అలాగే ఫైన్ లైన్స్ ని మీరు అరికట్టవచ్చు.

సహజమైన కాంతి కోసం ఫేసియల్ ఆయిల్స్:

సహజమైన కాంతి కోసం ఫేసియల్ ఆయిల్స్:

స్కిన్ కేర్ లో భాగంగా ఫేసియల్ ఆయిల్స్ ని వాడటం ముఖ్యం. తేలికపాటిది అలాగే చర్మం సులభంగా గ్రహించగలితే ఆయిల్స్ ను వాడటం మంచిది. చర్మంలో తగినంత తేమ ఉందంటే చర్మం మెరుస్తుందని అర్థం.

టోనర్ వాడకం తప్పనిసరి:

టోనర్ వాడకం తప్పనిసరి:

ముఖాన్ని కడిగిన తరువాత టోనర్ ని వాడటం తప్పనిసరి. టోనర్ అనేది పోర్ సైజులను తగ్గిస్తుంది. అలాగే ఫేస్ వాష్ రెసిడ్యులను తొలగిస్తుంది. ఫేస్ వాష్ తొలగించలేకపోయిన మేకప్ అలాగే డర్ట్ లను తొలగించేందుకు టోనర్ తోడ్పడుతుంది.

ఫేసియల్ మిస్ట్ లను అందుబాటులో ఉంచుకోండి:

ఫేసియల్ మిస్ట్ లను అందుబాటులో ఉంచుకోండి:

మీ బ్యాగ్ లో ఫేసియల్ మిస్ట్ లను అందుబాటులో ఉంచుకోండి. చర్మాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే, మేకప్ ని సెట్ చేసేందుకు ఇది సహకరిస్తుంది. వేలంటైన్స్ డే రోజున చర్మానికి తగినంత తేమను ఎప్పటికప్పుడు అందించేందుకు ఫేసియల్ మిస్ట్ ను వాడుకోవచ్చు. మేకప్ ని అలాగే పదిలపరచి మీ తాజా లుక్ ను ఎక్కువసేపు పొందుపరిచేందుకు ఫేసియల్ మిస్ట్ ఉపయోగకరంగా ఉంటుంది.

English summary

Tips To Get That Glow For Valentine’s Day

With Valentine's Day coming, we are sure all you lovely ladies have something big planned, whether it's a date with that special someone or just a night out with your girls. Whatever it is, we have got to make sure that our skin looks selfie ready, don't we? So here are some awesome beauty tips that you need to check
Story first published: Tuesday, February 13, 2018, 8:00 [IST]