For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు మళ్ళుతున్న చర్మానికి మేటి సుగంధ నూనెలు

సుగంధ ద్రవ్యనూనెలను వాడటానికి మంచి పద్ధతి వాటిని ఏదైనా మంచి నూనెలతో కలపటం. ఈ నూనెలు చాలా గాఢంగా ఉండి ఇంకో నూనెతో కలపకపోతే చర్మంపై మంటను కలిగిస్తాయి.

|

సుగంధ నూనెలు ఎప్పుడో పాతకాలం నుంచి ఉంటూనే ఉన్నాయి. కానీ మనం ఈ మధ్యనే వాటిని చర్మంపై వాడటం మొదలుపెట్టాం. ఇవి స్వభావసిద్ధంగా చాలా గాఢత కలిగివుంటాయి. దాని వలన మనలో చాలామంది వీటిని చర్మంపై వాడటానికి సంకోచిస్తారు.

ఆరోగ్య సమస్యలు, చర్మం, జుట్టు సమస్యలకి వీటిని సహజ చిట్కాగా చాలా ఏళ్ళ నుండి ఈ సుగంధ నూనెలను వాడుతున్నారు.

Top Essential Oils For Ageing Skin

సుగంధ ద్రవ్యనూనెలను వాడటానికి మంచి పద్ధతి వాటిని ఏదైనా మంచి నూనెలతో కలపటం. ఈ నూనెలు చాలా గాఢంగా ఉండి ఇంకో నూనెతో కలపకపోతే చర్మంపై మంటను కలిగిస్తాయి. మీరు చేయాల్సిన ఇంకోపని కొత్త నూనె ఏది వాడినా ముందు కొంచెం చేతిపై పరీక్షించి చూడటం. ఈ నూనెలను ముదురు రంగు సీసాలలోనే దాచాలి, ఎందుకంటే ఇవి కాంతికి సున్నితంగా ఉంటాయి, లైటు పడితే పాడయిపోతాయి.

వయస్సు మీరే లక్షణాలను తగ్గించుకోటానికి మీరు వాడుకోగలిగే సుగంధ ద్రవ్యనూనెలు ఇవిగో.

1.ఫ్రాంకిన్సెస్ సుగంధ నూనె –

మన వయస్సు పెరుగుతున్నకొద్దీ చర్మంలో తిరిగి కొత్త కణాలు పుట్టే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రాంకిన్సెస్ నూనె చర్మంలో తిరిగి కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. దీనికోసం మీరు కొన్ని చుక్కల ఈ నూనెను తీయని బాదం నూనెలో కలపండి. దీన్ని రాత్రిపూట మాస్కుగా వాడండి. పది నుంచి పదిహేను నిమిషాలు ఈ మాస్క్ ను ఉంచుకుని తర్వాత కడిగేయండి. దీన్ని క్రమం తప్పకుండా రాత్రిపూట చర్మసంరక్షణ రొటీన్లో వాడుతూ ఉండండి.

Top Essential Oils For Ageing Skin

2.జెరానియం సుగంధ నూనె –

జెరానియం సుగంధనూనె వయస్సు మీరే లక్షణాలతో పోరాడటానికి సమర్థవంతంగా పనిచేసే నూనెల్లో ఒకటి. అందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి విషమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంలో సాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని వదులైపోయేలా, ముడతలుపడేలా చేసి మచ్చలు వచ్చేలా చేస్తుంది. ఈ నూనె రక్తం కారకుండా ఆపే లక్షణం కూడా కలిగివుండటం వలన జిడ్డు చర్మం, పెద్ద చర్మ రంథ్రాలున్న వారికి చాలా మంచిది. మీకు పెద్ద చర్మరంథ్రాల వలన పొక్కులు వస్తుంటే ఈ నూనె చాలా ఉపయోగపడుతుంది. ఈ నూనెను జోజొబా నూనెతో కలిపితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ అతుక్కోని మిశ్రమాన్ని రోజువారీ మాయిశ్చరైజర్ గా పొద్దున,రాత్రి రాసుకుంటే చర్మం ముడతలు, జిడ్డు తగ్గుతాయి.

3.ఆర్గాన్ సుగంధ నూనె –

ఆర్గాన్ నూనె చర్మం, ఇంకా జుట్టు సమస్యలకి చక్కగా పనిచేస్తుంది. మీరు నేరుగా స్వఛ్చమైన ఆర్గాన్ నూనె కొనుక్కోవచ్చు లేదా మంచి నూనెతో కలిపిన ఆర్గాన్ నూనెను అయినా కొనుక్కోవచ్చు. దీన్ని మీరు పడుకునేముందు ప్రతిరాత్రీ సీరంగా వాడితే, పొద్దున లేచేసరికి మీ చర్మం జీవంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఆర్గాన్ నూనె లోతైన తేమను అందిస్తుంది. తేమ పోవటం వల్లనే చర్మం ముఖ్యంగా వయస్సు బారినట్లు అన్పిస్తుందని మనందరికీ తెలిసిందే. ఆర్గాన్ నూనెలో ఉండే విటమిన్ ఇ ఎండిపోయిన చర్మంతో పోరాడుతుంది.

Top Essential Oils For Ageing Skin

4.క్యారట్ సీడ్ సుగంధ నూనె-

ఈ నూనెలో విటమిన్ ఇ, ఎలు ఎక్కువగా ఉండి చర్మానికి మంచి పోషణనిచ్చి, మచ్చలను తగ్గించేస్తుంది. చుట్టుపక్కల వాతావరణం వల్ల పాడైన చర్మాన్ని క్యారట్ సీడ్ నూనె తిరిగి బాగుచేస్తుంది. దీనికోసం మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కేవలం కొన్ని చుక్కల నూనెను ఏదైనా మంచి నూనెతో కలిపి తీసుకువెళ్ళండి.

వయస్సు మళ్ళుతున్న చర్మానికి మేటి సుగంధద్రవ్య నూనెలు

5.రోజ్ మేరీ సుగంధ నూనె –

ఇది కేవలం అద్భుతమైన సువాసన ఉన్న నూనె మాత్రమే కాదు. దీనిలో బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉండి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అది నల్ల మచ్చలను కూడా తొలగించి చర్మం తొందరగా నయమయ్యేలా చేస్తుంది. మీ చర్మం యవ్వనంతో, పింక్ రంగులో మెరుస్తుంటుంది. కొన్ని చుక్కల రోజ్ నూనె, రోజ్ హిప్ నూనెను కలిపి ప్రతిరోజూ రాత్రి రెండు మూడు నిమిషాలపాటు చర్మంపై మసాజ్ చేయండి. ఇది మచ్చలను తగ్గిపోయేలా చేసి, చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది.

Top Essential Oils For Ageing Skin

6.గంధం నూనె –

ఇది మంచి సువాసననిచ్చే నూనె,దీన్ని వయస్సును చూపే మచ్చలను రంగు తగ్గిపోయేలా చేసి, చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. అందుకే మనదేశంలో పెళ్ళికూతుళ్ళు ఫేస్ మాస్కుగా గంధాన్ని ఎక్కువగా వాడతారు. ఇది చర్మాన్ని యవ్వనంగా కన్పడేలా చేసి, జీవం నింపుతుంది. గంధాన్ని వాడుతూ నెమ్మదిగా మొహంపై మసాజ్ చేసుకోండి. దీనికోసం కొన్ని చుక్కల దానిమ్మ విత్తనాల నూనె ఇంకా గంధం నూనెను కలిపి రోజువారీ మాయిశ్చరైజర్ గా వాడుకోండి. ఇది మీ చర్మంపై జిడ్డును కూడా తగ్గిస్తుంది.

వీటిల్లో ఏ మిశ్రమాన్ని అయినా రోజూ రాత్రిపూటవాడితే, మీరు ఇక ఫ్యాన్సీ యాంటీ ఏజింగ్ క్రీములు కొనటం గురించి ఆలోచించనక్కర్లేదు.

English summary

Top Essential Oils For Ageing Skin

Essential oils have been around for ages, but only recently have we started using them topically. These oils are extremely concentrated in nature. As a result of that, most of us have been very afraid of using them on the skin in their natural forms. Essential oils have been used for many years as a natural remedy to many problems,
Story first published:Monday, March 26, 2018, 11:03 [IST]
Desktop Bottom Promotion