For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై వయస్సు పైబడిన ఛాయాలను కనపడకుండా ఉండటానికి వివిధ రకాల చర్మాల వారు వాడవలసిన మాస్కులు

|

లింగబేధం లేకుండా వయస్సు మీద పడుతున్న కొద్దీ ఎదురయ్యే చర్మ సమస్యలు , మన అందరిని ఆందోళనకు గురిచేస్తాయి. కానీ ఈ వయస్సుకు సంబంధించిన సమస్యలు పెద్దవారిలో మాత్రమే కాకుండా, చిన్నవారిలో కూడా కలుగుతాయి.

వయస్సు మీద పడుతున్న కొద్దీ, కేవలం ముడుతలే కాకుండా , నల్ల మచ్చలు, కాంతివిహీనమైన చర్మం, అసమాన మేనిఛాయ, పగిలిన చర్మం, తీర్చుకున్న చర్మ రంధ్రాల వంటి సమస్యలు ఎదురవుతాయి.

Try These Anti-ageing Face Masks For Different Skin Types

ఇటువంటి వృద్ధాప్య ఛాయలకు , పర్యావరణ కాలుష్యం, సూర్యుని తీవ్ర కిరణాలు,అధిక మద్యపానం, అధిక ధూమపానం, జీవనశైలి మొదలైనవి కారణమవుతాయి.

నేడు, ఈ సమస్య నివారణకు, వృద్ధాప్య ఛాయలతో పోరాడేందుకు మార్కెట్ లో ఎన్నో రకాలైన ఉత్పత్తులు ఉన్నాయి. కానీ వీటిలో చర్మంకు హాని కలిగించే రసాయనాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువలన, వృద్ధాప్య సంకేతాలను పోరాడటానికి సహజ నివారణ చర్యలు పాటించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.

ఈ వ్యాసం ద్వారా, వివిధ చర్మ రకాలకు తగిన, వృద్ధాప్య ఛాయలతో పోరాడే కొన్ని మాస్కులను గురించిన సమాచారం మీకు అందిస్తున్నాము. మీ చర్మం తరహా ప్రకారం వీటిలో ఒకదాన్ని ఎన్నుకుని వృద్ధాప్య ప్రారంభ సంకేతాలతో పోరాడటానికి సిద్ధంకండి.

జిడ్డు చర్మం కొరకు:

జిడ్డు చర్మం కొరకు:

కోడిగ్రుడ్డులోని తెల్లసొన:

కోడిగ్రుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మార్చడం ద్వారా, పెద్ద చర్మరంధ్రాలను చిన్నవిగా చేస్తాయి. తెల్లసొన, చర్మాన్ని టోన్ చేసే లక్షణాలను కలిగి ఉన్నందున, జిడ్డు చర్మం కలిగిన వారికి మరింత లాభం చేకూరుస్తుంది.

వాడే విధానం: ముందు గుడ్డు తెల్లసొనను వేరు చేయండి. మృదువైగా మారేంత వరకు గుడ్డు తెల్లసొనను గిలక్కొట్టండి. ముఖాన్ని శుభ్రపరుచుకుని, తెల్లసొనను ఒక పల్చని పొరగా రాసుకోండి. ముఖం మొత్తంగా సమానంగా ఉందని నిర్ధారించుకోండి. మాస్కును 30 నిముషాల పాటు ఆరనిచ్చి, తర్వాత సాధారణ నీటితో కడుక్కోండి.

తేనె, పెరుగు మరియు గులాబీ మాస్కు:

తేనె, పెరుగు మరియు గులాబీ మాస్కు:

తేనె చర్మానికి తేమనందివ్వడానికి సహాయపడుతుంది. పొడిబారి ,పగిలిన చర్మాన్ని నివారించడానికి సహాయపడుతుంది. పెరుగు ఛాయతగ్గి, నిర్జీవంగా మారిన చర్మంను కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

వాడే విధానం:

ఈ యాంటీ ఏజింగ్ ప్యాక్ తయారు చేయడానికి, మీరు రెండు టేబుల్ స్పూన్ల చిక్కని పెరుగు, ఇక టేబుల్ స్పూన్ తేనె మరియు కొన్ని గులాబీ రేకులు అవసరం అవుతాయి. ఒక గిన్నెలో తేనె మరియు పెరుగు తీసుకుని కలిపి బాగా కలపాలి. కొన్ని తాజా గులాబీ రేకులు నలిపి, పెరుగు-తేనె మిశ్రమంలో వేయండి. ఈ ప్యాక్ ను మీ ముఖంపై సమానంగా రాసుకోండి. ప్యాకును ఆరనిచ్చి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎండకు కమిలిన చర్మం కొరకు:

ఎండకు కమిలిన చర్మం కొరకు:

టొమాటో మరియు కలబంద మాస్క్:

కలబందలో యాంటిఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే టొమాటో సూర్యుడి ప్రభావం వలన కమిలిన చర్మం పై నలుపుదనం తగ్గించడానికి సహాయపడుతుంది.

వాడే విధానం:

మీకు ఈ మాస్కును తాయారు చేయడం కొరకు ఒక టొమాటో మరియు రెండు టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు అవసరం అవుతాయి. ముందుగా, టొమాటోను గుజ్జు చేయాలి. తరువాత టొమాటో గుజ్జులో కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. మీరు మార్కెట్లో లభించే తాజా కలబంద గుజ్జును కూడా ఉపయోగించవచ్చు.

మీ ముఖం మీద ఈ ప్యాక్ ను రాసుకుని 15-20 నిమిషాలు పాటు ఆరనివ్వండి. తరువాత, నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను ఉపయోగించండి.

సాధారణ చర్మం కొరకు:

సాధారణ చర్మం కొరకు:

బొప్పాయి మరియు తేనె ఫేస్ మాస్క్:

తేనె సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ అని మనకు తెలిసినదే! ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖం మీద ముడుతలను తగ్గించి, చర్మాన్ని తెల్లబరిచే, యాంటీ ఏజింగ్ లక్షణాలు బొప్పాయిలో ఉంటాయి.

వాడే విధానం:

దీని తయారీకి మీరు సగం బొప్పాయి పండు, 3-4 టేబుల్ స్పూన్లు తేనె యొక్క మరియు 2 టేబుల్ స్పూన్లు ఓట్ మీల్ పౌడర్ తీసుకోవాలి. పండిన బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మృదువైన పేస్ట్ ను తయారుచేయాలి. ఇప్పుడు దీనికి మిగిలిన అన్ని పదార్థాలను కలపాలి. మీ ముఖం మీద ఈ ప్యాక్ ను రాసుకుని 15-20 నిమిషాలు పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Try These Anti-ageing Face Masks For Different Skin Types

Skin issues that occur due to ageing are something that we all worry about irrespective of the gender. But these age-related issues occur not only among aged people but can also occur on a very young skin. Some ingredients like honey, papaya, avocado, etc., can be used as remedies.
Story first published: Monday, July 16, 2018, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more