For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రకరకాల చర్మాలకు పసుపు ఫేస్ ఫాక్స్.. !

|

భారతీయ వంటలలో, మరియు ఆరోగ్యసంబంధమైన విషయాలలో పసుపుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నెమ్మదిగా ప్రపంచదేశాలకు కూడా పసుపు ప్రాధాన్యత తెలిసివచ్చింది . ఈ పసుపును వంటకోసమే కాకుండా, ఆరోగ్య సంబంధ ప్రయోజనాలకై కూడా వినియోగిస్తారు. ముఖ్యంగా చర్మ సౌందర్యానికై ఫేస్ మాస్క్ రూపంలో కూడా వినియోగిస్తారు.

ఏ ఇతర పదార్ధాలు చయని విధంగా చర్మానికి అందాన్ని తీసుకుని రావడంలో పసుపు ఎంతగానో సహాయం చేస్తుంది. భారతీయ సాంప్రదాయంలో ఆరోగ్యం, మరియు అందం విషయంలో పసుపుకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.

భారతీయ వంటలలో పసుపు రుచికి మాత్రమే కాకుండా, అనేక క్రిమినాశక లక్షణాలను కలిగి ఉన్న కారణంగా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. జలుబు , కఫం వంటి లక్షణాలను కూడా తగ్గించగల ఆరోగ్య ప్రదాయిని ఈ పసుపు.

Turmeric Face Packs For Different Skin Types

ఇక అందం విషయానికి వస్తే, చర్మం ప్రకాశవంతంగా, బిగుతుగా మరియు నునుపుగా చేయడంలో పసుపు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇందుచేతనే పెళ్ళికి ముందు పెళ్లికూతురు ముఖానికి అప్లై చేస్తుంటారు. తద్వారా ప్రకాశవంతంగా కనిపిస్తుంటారు.

మీకోసం కొన్ని పసుపుతో కూడిన ఫేస్ ప్యాక్స్ గురించిన వివరణ ఇక్కడ పొందుపరచడం జరిగింది.

1. మొటిమల పీడిత చర్మానికై:

1. మొటిమల పీడిత చర్మానికై:

పసుపులో ఎక్కువగా క్రిమినాశక కారకాలు, మరియు మంటను తగ్గించే లక్షణాలు ఉన్న కారణంగా ఇది మొటిమలను తగ్గించుటలో ఎంతగానో సహాయం చేస్తుంది. దీనికోసం తెల్లగుగ్గుళ్ల పొడి (chickpea flour) లేదా శెనగ పిండి(besan flour), పెరుగు, పసుపు అవసరమవుతాయి. ముఖ్యంగా ఇందులో శనగ పిండికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న కారణంగా ఇది శరీరం పై ఉన్న మృతకణాలను తొలగించుటలో సహాయం చేస్తుంది.

పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ మొటిమల కారణంగా ఏర్పడిన నల్లమచ్చలను తగ్గించుటలో సహాయం చేయగా, పసుపు క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండి బాక్టీరియాను నాశనంచేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ మూడింటి మిశ్రమాన్ని పేస్టుగా అయ్యేలా కలిపి, ముఖానికి వృత్తాకారంలో సున్నితంగా అప్లై చేశాక, 20 నిమిషాలు ఉంచి , పొడిబారిన తర్వాత నీటితో కడిగివేయాలి. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా, చర్మం మీద మృతకణాలను తొలగించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది.

2. పొడిచర్మం కల వాళ్ళు:

2. పొడిచర్మం కల వాళ్ళు:

పొడి చర్మం కల వాళ్ళు పసుపుతో జాగ్రత్తగా ఉండాలి, పసుపు సహజంగానే చర్మాన్ని పొడిగా చేసే తత్వాలను కలిగి ఉంటుంది. అలాగని పసుపుని వాడకూడదు అని చెప్పడం లేదు. పొడిచర్మం కలిగిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు. పసుపులో కేవలం చర్మాన్ని పొడిబారేలా చేయడమే కాదు, క్రిమిసంహారక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అది మర్చిపోకూడదు. దీనికోసం మీరు పసుపుని పాలతో కలిపి పేస్టులా చేసి వినియోగించడం మూలంగా ఎక్కువ పొడిబారకుండా చూసుకోవచ్చు. వలయాకారంలో ఈ పేస్టుని మర్ధనలాగా ముఖానికి పట్టించి, 20 నిమిషాలు ఉంచిన తర్వాత , పొడిగా మారాక, మంచి నీళ్ళతో కడిగివేయాలి. తద్వారా ప్రకాశవంతమైన చర్మం మీ వశమవుతుంది.

3. టాన్ కాబడిన చర్మానికై :

3. టాన్ కాబడిన చర్మానికై :

సూర్యకాంతి వలన కానీ, కాలుష్యం వలన కానీ చర్మం టాన్ కి గురవడం సర్వసాధారణం. కానీ అందంగా ఉన్న చర్మం, నల్లగా మారిపోవడం ఎంతగానో భాధ పెడుతుంది. ముఖ్యంగా మన భారత దేశంలోని వ్యక్తుల చర్మంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఇది త్వరగా సూర్యకాంతికి, కాలుష్యానికి ప్రభావితం కాబడి చర్మo రంగు తగ్గిపోయేలా చేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటే, పసుపు నిమ్మ ఫేస్ పాక్ చర్మానికి వినియోగించవలసి ఉంటుంది. నిమ్మలో ఉండే సహజ సిద్దమైన బ్లీచింగ్ లక్షణాలు సిట్రిక్ యాసిడ్ మరియు పసుపులో ఉన్న మృతకణాలను తొలగించే స్వభావం కారణంగా ఈ మిశ్రమం ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కావున మీరు ఎండ ప్రభావానికి గురై ఇంటికి వచ్చిన వెంటనే ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం మూలంగా సత్ఫలితాలను పొందవచ్చు.

4. జిడ్డు లేదా ఆయిలీ చర్మానికై:

4. జిడ్డు లేదా ఆయిలీ చర్మానికై:

ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగినవారు అనేక రకాల చర్మ సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. వీరిలో మొటిమల సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. వీరి శ్లేష పటలం (స్వేద గ్రంధులు) ఎక్కువగా జిడ్డుకు కారణం అవుతూ ఉంటుంది. వీరు గంధంతో కూడిన పసుపు మిశ్రమాన్ని ముఖానికి రాయడం వలన మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో గంధం స్వేదగ్రంధులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించి, చర్మాన్ని మామూలు స్థితికి తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది. గంధం పొడి, పసుపు పొడిని రోజ్ వాటర్ తో కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి పట్టించాలి. పదినిమిషాలు అలాగే వదిలేసి, మామూలు నీళ్ళతో ముఖాన్ని కడిగివేయవలసి ఉంటుంది. ఇది మీకు చక్కటి పరిష్కారంగా ఉంటుంది.

English summary

Turmeric Face Packs For Different Skin Types

Turmeric Face Packs For Different Skin Types,Here are the turmeric face packs for different skin types, read to know the different turmeric face packs for different skin types.
Desktop Bottom Promotion