For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వేసవిలో మీరు తప్పక ప్రత్నించవలసిన కూరగాయ ఫేస్ ప్యాకులు

|

మనందరికీ మెరిసే, మచ్చలేని, ఆరోగ్యవంతమైన చర్మం అంటే చాలా ఇష్టం. కాని ఇలాంటి చర్మం పొందటం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకుంటాము. కాని అది నిజం కాదు! మీ ఇంట్లోనే కూర్చుని చిన్న చిన్న చిట్కాలతో మీ చర్మాన్ని మచ్చలేకుండా చేసుకోవచ్చంటే మీరు నమ్ముతారా? అదెలాగో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, చదవండి మరి!

చాలా వరకు కూరగాయలలో ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచి ట్యాన్, నల్లని వలయాలు, మొటిమలు మరియు మచ్చలను తొలగించి పునరుత్తేజాన్ని కలిగించి తెల్లగా తయారయ్యేట్టు చేస్తాయి.

Vegetable Face Packs To Try Out This Summer

ఫేస్ ప్యాక్ తయారి కొరకు కూరగాయలను వాడేటప్పుడు, అవి ఆర్గానిక్ కూరగాయలైతే మరీ మంచిది. ఎందుకంటే మామూలు కూరగాయలలో రసాయనాలు ఉంటాయి. ఇటువంటి వాటిని ఎక్కువగా వాడితే దుష్పరిణామాలు తలెత్తవచ్చు.

అందమైన, మెరిసే చర్మం కోసం రకరకాల కూరగాయలను ఏ విధంగా వాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం!

1. దోసకాయ ఫేస్ ప్యాక్:

1. దోసకాయ ఫేస్ ప్యాక్:

మీరు కనుక పొడి చర్మం కలిగిన వారైతే, దోసకాయ ఫేస్ ప్యాక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ మాస్కుగా కూడా ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్ధాలు:

2-3 టేబుల్ స్పూన్ల దోసకాయ రసం, టేబుల్ స్పూన్ మీగడ

వాడే విధానం:

పై పదార్ధాలను బాగా కలిపి ముద్దగా చేయండి. ఈ ముద్దను ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్కు చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

2. బంగాళ దుంపల రసం:

2. బంగాళ దుంపల రసం:

బంగాళ దుంపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇది బ్లీచింగ్ ఎజంట్ గా పనిచేసి చర్మం పై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.

కావలసిన పదార్ధాలు:

1 బంగాళ దుంప, దూది

వాడే విధానం:

బంగాళ దుంపను చిన్న ముక్కలుగా తరగండి.వాటిని తురిమి, పిండి రసాన్ని తీయండి. ఆ రసంలో దూదిని ముంచి ముఖానికి, మెడకు రాసుకోండి. పదిహేను- ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత మంచి నీటితో కడిగేయండి.

౩. టమాటో ఫేస్ ప్యాక్:

౩. టమాటో ఫేస్ ప్యాక్:

టమాటోలో ఉండే విటమిన్లు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మం యొక్క అలసట మరియు నిస్తేజాన్ని కూడా తగ్గిస్తాయి. టమాటోలను ఉపయోగించి ఇంట్లోనే మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు:

1 టమాటో, 1 కప్పు నీరు.

వాడే విధానం:

టమాటోను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, బాగా మెదిపి ముద్దగా చేయండి. ఈ ముద్దను ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. మొదటిసారి వాడగానే మీరు తేడాను గమనించవచ్చు.

4. క్యారట్ ఫేస్ ప్యాక్:

4. క్యారట్ ఫేస్ ప్యాక్:

క్యారట్లోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేసి మొటిమల వలన ఏర్పడిన మచ్చలతో పోరాడుతుంది. అంతేకాక కమిలిన చర్మాన్ని తేజోవంతంగా చేసి మృతకణాలను తొలగిస్తుంది.

కావలసిన పదార్ధాలు:

2 టేబుల్ స్పూన్ల క్యారట్ పేస్టు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి, చిటికెడు పసుపు

వాడే విధానం:

ఒక గిన్నెలో అన్ని పదార్ధాలను ఉండలు లేకుండా కలపండి. ఈ పేస్టును ముఖానికి, మెడకు దళసరిగా రాసుకోండి. తరువాత ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. బాగా ఆరినాక నీళ్ళతో కడిగేయండి.

5. ఉల్లిపాయ ఫేస్ ప్యాక్:

5. ఉల్లిపాయ ఫేస్ ప్యాక్:

ఉల్లిలో ఉండే విటమిన్లు రక్త ప్రసరణను వేగవంతం చేసి ముడుతలు లేని చర్మాన్ని మనకి అందిస్తాయి.

కావలసిన పదార్ధాలు:

ఒక చిన్న ఉల్లిపాయ, దూది ఉండలు, నీరు

వాడే విధానం:

ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరగండి. బ్లెండ్ చేసి దానిలోని రసాన్ని తీయండి. ఈ రసంలో దూది ఉండను ముంచి ముఖానికి, మెడకు బాగా పట్టించండి. పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత మంచి నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Vegetable Face Packs To Try Out This Summer

Vegetables contain minerals, vitamins and antioxidants. These help in keeping our skin fresh and rejuvenated by removing tan, dark circles, pimples and acne scars and also help in skin whitening. Some vegetables that you can use as face packs are cucumber, carrot, potato, beetroot, etc.DIY Vegetable Face Packs
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more