ఈ వేసవిలో మీరు తప్పకుండా వాడి ప్రయత్నించవలసిన పుచ్చకాయ మాస్కులు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

మీ చర్మం ఈ వేసవి తాపాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? మీ సమాధానం కాదు అయితే,మీ చేతులతో మీరే పుచ్చకాయతో ఫేస్ మాస్క్ లు తాయారు చేసుకుని వాడి చూడండి. పుచ్చకాయలో 93% ఉండే నీరు మన చర్మానికి తేమను అందివ్వడమే కాక తాజాగా నిగారించేటట్లు చేస్తుంది. ఇందులో ముఖ్య ఖనిజాలు మరియు విటమిన్లయిన ఏ, ఇ, సి మరియు బి6 ఉంటాయి.

ఆరోగ్యంతో పాటు పుచ్చపాయ మీ అందాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మీరు చదివినది నిజమే! పుచ్చకాయలు యవ్వనమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని మీకందివ్వడానికి వివిధ రకాల మాస్కులు మరియు ప్యాక్లరూపంలో ఉపయోగపడతాయి.

ట్యానింగ్, పొడి చర్మం, మచ్చలు మొదలైన చర్మ సమస్యలు మనందరికీ ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం పుచ్చకాయ. సాధారణ ఫలమే కనుక ఎక్కడైనా, ఎప్పుడైనా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా వేసవిలో. ఈసారి మీరు పుచ్చకాయ తినేటప్పుడు చిన్న ముక్క మీ చర్మ సౌందర్య పోషణకు ఉంచుకోండి.

watermelon-face-masks-that-you-should-try-this-season

ఇప్పుడు మీరు దానిని ఎలా వాడాలో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ వ్యాసం మీకు పుచ్చకాయలను మచ్చలేని కాంతివంతమైన చర్మం కొరకు మాస్కులు మరియు ప్యాక్లగాఎలా వాడాలో, వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో పూర్తి సమాచారం అందిస్తుంది.

పుచ్చకాయ+పెరుగు:

పుచ్చకాయ+పెరుగు:

పేరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మృతకణాలను తొలగించడానికి తోడ్పడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా వాడితే మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా కనపడేటట్టు చేస్తుంది. పుచ్చకాయ మరియు పెరుగులను కలిపి వాడితే మృదువైన చర్మం మీ సొంతం

ఒక గిన్నెలో కొంచెం పుచ్చకాయ రసాన్ని తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగును బాగా కలిపి ముఖానికి రాసుకోండి. దీనిని ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి నీటితో కడిగేయండి.

పుచ్చకాయ+ తేనె:

పుచ్చకాయ+ తేనె:

ఈ మాస్క్ ట్యాన్ ను తొలగించడానికి, దెబ్బతిన్న చర్మంను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని శాంతపరుస్తుంది.

పుచ్చకాయ మరియు తేనెలను సమాన నిష్పత్తిలో కలపండి. సరిగ్గా కలపండి. ముందుగా ముఖాన్ని కడుక్కుని తుడుచుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ముప్పై నిమిషాల తరువాత కడిగేయండి.

పుచ్చకాయ+ కీరా:

పుచ్చకాయ+ కీరా:

పుచ్చకాయలోని ఎర్రని పిగ్మెంట్ సహజ సన్ స్క్రీన్ వలె పనిచేసి ఎండవలన కలిగిన గాయాలను మాన్పుతుంది. కీరా చర్మాన్ని చల్లబరచి, తేమనిస్తుంది

ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం లేదా గుజ్జును ఒక గిన్నెలో వేడి దానికి ఒక టేబుల్ స్పూన్ కీరా రసాన్ని కలపండి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయండి.

పుచ్చకాయ+అరటిపండు:

పుచ్చకాయ+అరటిపండు:

అరటిపండులోని బి విటమిన్ కాంప్లెక్స్ మొటిమల వలన కలిగే నొప్పిని తగ్గిస్తాయి. కనుక ఈ రెండు పదార్థాలను కలిపి వాడినట్లైతే మొటిమలను తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

ఒక గిన్నెలో రెండు పుచ్చకాయ ముక్కలను తీసుకోండి. తరువాత సగం అరటిపండును తీసుకుని రెండింటిని కలిపి ముద్ద చేయండి. రెండు బాగా కలవాలి. ఈ మాస్కును ముఖానికి, మెడకు రాసుకుని పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చిన తరువాత నీటితో కడిగేయండి.

పుచ్చకాయ+ పాలు:

పుచ్చకాయ+ పాలు:

పాలు మంచి సహజమైన మాయిశ్చరైజర్. ఇవి పెద్దగా ఉన్న చర్మ రంధ్రాలను కృశించుకుపోయేట్టు చేస్తుంది. ఎండవలన కలిగిన గాయాలను, మచ్చలను తొలగిస్తుంది.

ఒక గిన్నెలో పచ్చి పాలు లేని యెడల పాలపొడిని వాడవచ్చు. రెండుపదార్థాలను బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకుని ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చిన తరువాత నీటితో కడిగేయండి.

పుచ్చకాయ+ కలబంద:

పుచ్చకాయ+ కలబంద:

కలబంద ఎండ గాయాలు, దెబ్బలు మరియు మొటిమల వలన కలిగే మంటను తగ్గిస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్ వలె పనుచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఒక కలబంద ఆకును తీసుకుని, పై పొరను తొలగించి గుజ్జును స్పూనుతో బయటకు తీయండి. ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును కలపండి. రెండింటిని బాగా కలవనివ్వండి. దీనిని చర్మానికి రాసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చిన తరువాత నీటితో కడిగేయండి.

English summary

watermelon-face-masks-that-you-should-try-this-season

Is your skin ready for summer? If no, then you can prepare yourself with these watermelon face masks this season. Watermelons can be used in the form of masks and packs to gain a young and beautiful skin. Use watermelon with yogurt, honey, aloe vera, cuccumber, banana etc., to make your skin summer ready.
Story first published: Wednesday, April 4, 2018, 16:00 [IST]